చిన్నాచితక అధికారినంటే మోసం చేయలేననుకున్నాడో..ఏమో ఏకంగా ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీనంటూ మోసాలకు తెగబడ్డాడో ఓ నేరగాడు. ఏకంగా ఉన్నతాధికారులనే బెదిరించాడు. పాపం పండటంతో చివరకు కటకటాలపాలయ్యాడు. ఇది ఘరానా మోసగాడు విజయ్‌కుమార్ బాగోతం. డిజిటల్ సీపీ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో విజయ్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.