ఎలా ఖర్చు చేశారో చెప్పాలి | GVL Narasimha Rao Slams TDP Government | Sakshi
Sakshi News home page

ఎలా ఖర్చు చేశారో చెప్పాలి

Published Thu, Dec 20 2018 7:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

మరోసారి టీడీపీ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శలు సంధించారు. ఢిల్లీలో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. విపత్తు కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయించిందని వెల్లడించారు. గతంలో విపత్తు నిధి కింద రూ.2200 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదలం చేసింది.. దాన్ని ఎలా ఖర్చు పెట్టారో టీడీపీ ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాయుడికి పాలనపై దృష్టి లేదని వ్యాఖ్యానించారు. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మాతో కలిసి లేకపోయినా తిత్లీ తుపాను సంభవించినప్పుడు రూ.559 కోట్లు కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement