హైటెక్‌ సిటీని వాజ్‌పేయినే ప్రారంభించారు | Hitech City Inaugurated By Atal Bihari Vajpayee | Sakshi
Sakshi News home page

హైటెక్‌ సిటీ ప్రారంభించిన వాజ్‌పేయి

Published Fri, Aug 17 2018 9:37 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

దేశసేవ కోసమే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి.. భరతమాత ముద్దుబిడ్డ.. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి గురువారం సాయంత్రం అనంత లోకాలకు వెళ్లిపోయారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన విలువల కోసమే పోరాడిన యోధుడతను. వాజ్‌పేయికి అన్ని రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల నేతలు, ప్రజలతో మంచి సంబంధాలు ఉండేవి. దేశ ప్రధానిగా వాజ్‌పేయికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం కొనసాగింది. ప్రధానిగా హోదాలో ఆయన నాలుగు సార్లు హైదరాబాద్‌ సందర్శించారు. నగరానికి ఐటీ హబ్‌గా ఉన్న హైటెక్‌ సిటీ(సైబర్‌ టవర్స్‌)ని 1998లో వాజ్‌పేయినే ప్రారంభించారు.  ప్రతిష్ఠాత్మక ఈ సిటీ ప్రారంభోత్సవానికి వాజ్‌పేయి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇదే మన హైదరాబాద్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఐటీ సౌకర్యం. హైటెక్‌ సిటీ మైక్రోసాఫ్ట్‌, జీఈ, ఒరాకిల్‌ వంటి అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు ఇది మెట్టునిల్లుగా ఉంటుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా(1980-86) కొనసాగిన సమయంలో వాజ్‌పేయి టాక్సీలో వచ్చి ఆశ్చర్యానికి గురిచేశారు. కర్ణాటకకు వెళుతూ ఆయన బేగంపేట విమానాశ్రయంలో ఆగారు. హెగ్డేవార్‌ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకుని నేరుగా టాక్సీలో వచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement