ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం | Huge Fire Accident at Auto Nagar in Vijayawada | Sakshi
Sakshi News home page

ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

Published Thu, May 10 2018 12:42 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

ప్రఖ్యాత పారిశ్రామిక, ఆటోమొబైల్‌ కేంద్రం ‘విజయవాడ ఆటోనగర్‌’లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కానూరు రోడ్డులోని ఓ కూలర్ల కంపెనీలో ఉదయం 11 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు.. పక్కనున్న ఇంజన్‌ ఆయిల్‌ మిక్స్డ్‌ యూనిట్‌కు అంటుకున్నాయి. దీంతో అదుపుచేయలేనంత స్థాయిలో మంటల ఉధృతి పెరిగింది. ప్రస్తుతం నాలుగు ఫైరింజన్లలో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement