విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ ఇంట్లో మంగళవారం రాత్రి జీఎస్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పటమట పోస్టల్ కాలనీ బస్టాప్ సమీపంలోని మేయర్ ఇంట్లో 8 మంది అధికారుల బృందం దాడులు నిర్వహించి కీలకపత్రాలు, రికార్డులు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. పుష్కరాల సమయంలో పుష్కరనగర్ తదితర ప్రాంతాల్లో అధికారులు, సిబ్బందికి భోజనాల ఏర్పాటు సహా పలు ఈవెంట్ల నిర్వహణను చేపట్టిన కేఎంకే సంస్థపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. కేఎంకే ఈవెంట్స్ సంస్థకు మేయర్ భార్య డైరెక్టర్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ ఇంట్లో ఐటీ దాడులు
Published Wed, Oct 24 2018 9:41 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement