రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది! శాసనసభ రద్దుకు కౌంట్‌డౌన్ మొదలైంది!! గురువారం ఉదయం మంత్రివర్గం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు అత్యున్నత అధికార వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకం ప్రకారం గురువారం ఉదయం 6 గంటల నుంచి 7 వరకు కీలక నిర్ణయాలకు అత్యంత అనుకూల సమయమని, ఆయన నక్షత్ర, రాశులకు అనుకూలంగా గ్రహస్థితులు ఆ రోజు ఉన్నాయని, అందుకే ఆ సమయాన కేబినెట్ భేటీకి సీఎం సిద్ధమైనట్లు తెలియవచ్చింది. శాసనసభ రద్దుకు ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం శరవేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
రేపు కేబినెట్ భేటీ.. అసెంబ్లీ రద్దుకు సిఫారసు
Published Wed, Sep 5 2018 6:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement