ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండో విడతగా ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి కార్యాలయం వద్దకు వెళ్లిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది.
ఈశాన్య ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌నగర్ బ్లాక్‌కు చెందిన ప్రజలు టాయిలెట్ల నిధుల కోసం అధికారి కార్యాలయానికి వెళ్లారు. తమ సమస్యపై బీడీవో మాట్లాడాలని చెప్పగా కార్యాలయంలో ఎవరూ స్పందించలేదు. దీంతో సాయంత్రం వరకూ ఎవరైనా వస్తారని కార్యాలయం వద్దే వేచి చూశారు.