నాలుగున్నరేళ్లుగా రాజధాని అమరావతికి ఒక్క ఇటుక కూడా వేయకుండా డజన్ల కొద్దీ గ్రాఫిక్స్, భారీ వ్యయంతో తాత్కాలిక కట్టడాలు, కబుర్లతో కాలక్షేపం చేసిన టీడీపీ సర్కారు ఎన్నికలకు రెండు నెలల ముందు మరో డ్రామాకు తెర తీసింది. ఈసారి సినీ దర్శకులను తలదన్నేలా అదిరిపోయే స్కెచ్ గీసింది.