ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు సోమవారం అర్ధరాత్రి నగరంలో వీరంగం సృష్టించారు. నలుగురు యువకులను విచక్షణారహితంగా చితకబాదారు. వివరాల్లోకి వెళితే... నవోదయ కాలనీకి చెందిన నారాయణస్వామి సోమవారం రాత్రి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళ్తున్నాడు. విద్యుత్‌నగర్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇంటి సమీపంలో ఎమ్మెల్యే అనుచరులు వేగంగా ద్విచక్రవాహనంలో నారాయణస్వామిని ఓవర్‌టేక్ చేశారు. నారాయణస్వామి హార్న్ కొట్టగా ఎమ్మెల్యే అనుచరుడు ‘ఏరా నేను వెళ్తుంటే హార్న్ కొడుతున్నా’వంటూ నారాయణస్వామిని దుర్బాషలాడాడు. ఈ క్రమంలో ఇరువురూ వాదులాడుకున్నారు. ఎమ్మెల్యే అనుచరుడు కొంతమందిని తీసుకువచ్చి నారాయణస్వామిని రోడ్డుపైనే చితకబాదారు.