గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టు మంగళవారం నాడు నగర పోలీసు జాయింట్ కమిషనర్ అశోక్ యాదవ్, డిప్యూటీ పోలీసు కమిషనర్ శ్వేతా శ్రీమాలితోపాటు మరో నలుగురు పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. అన్యాయంగా పోలీసులు జరిపిన దాడిలో ఇరుగు పొరుగు వారితో పాటు గాయపడిన న్యాయవాది మనోజ్ తమాంచే దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న అహ్మదాబాద్ కోర్టు అక్టోబర్ 11వ తేదీనాడు కోర్టుకు రావాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది.