ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం | Nizamabad, RTC Bus Slips A Side From Road | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

Published Thu, Oct 24 2019 3:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

సాక్షి, నిజామాబాద్‌ : మల్లారం గండి సమీపంలోని అటవీ ప్రాంతంలో  ఆర్టీసీ బస్సుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. నిజామాబాద్‌ నుంచి బాన్సువాడ వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సు అదుపు తప్పడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కకు దిగిపోయింది. దీంతో భయబ్రాంతులకు గురైన ప్రయాణీకులు వెంటనే కిటికీల నుంచి కిందకు దిగారు. కాగా అడవిలోకి దూసుకుపోయి ఉంటే మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉండేదని డ్రైవర్‌పై తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement