పవన్ అభిమానిపై బాలయ్య ఫ్యాన్ దాడి | Pawan kalyan fan injured in balaiah fans blade attack | Sakshi
Sakshi News home page

పవన్ అభిమానిపై బాలయ్య ఫ్యాన్ దాడి

Published Fri, Jan 12 2018 7:21 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

శ్రీకాకుళం జిల్లాలో టాలీవుడ్ అగ్ర హీరోల అభిమానుల మధ్య మొదలైన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. పురుషోత్తపురంలో పవన్ కల్యాణ్, బాలకృష్ణ అభిమానుల మధ్య మాటలతో మొదలైన చిన్న వివాదం భౌతిక దాడుల వరకు వెళ్లడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో బాలకృష్ణ అభిమాని పవన్ అభిమానిపై బ్లేడుతో దాడి చేశాడు. బాలయ్య అభిమాని దాడిలో పవన్ ఫ్యాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు పవన్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసికి మిశ్రమ స్పందన వస్తోంది.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement