మీకు అండగా వుంటా! | Pawan Kalyan Speech in Visakhapatnam | Sakshi
Sakshi News home page

మీకు అండగా వుంటా!

Published Wed, Dec 6 2017 2:38 PM | Last Updated on Fri, Mar 22 2024 10:39 AM

దేశ రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సివుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన సభలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు రావాల్సివుందని అభిప్రాయపడ్డారు. సినిమాల వల్ల వ్యవస్థలు మారవని చెప్పారు. ఆచరించి మిగతావాళ్లకు చెబితేనే విలువ ఉంటుందని అన్నారు. సమూల మార్పులు సాధించలేకపోయినా, ఎంతో కొంత మార్పు తీసుకురావడం సాధ్యమేనని చెప్పారు. నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌, అంబేద్కర్‌ల స్ఫూర్తితోనే తాను రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు ఏదో ఒక కులానికి పరిమితమయ్యాయని విమర్శించారు. పూర్తిగా జాతీయ భావాలున్న పార్టీ రాజకీయాల్లో రావాల్సివుందని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement