vizag city
-
జూన్ నాటికి హెచ్‌పీసీఎల్ వైజాగ్ రిఫైనరీ విస్తరణ
వారణాసి: ఈ ఏడాది జూన్ నాటికల్లా ఆంధ్రప్రదేశ్, వైజాగ్‌లోని ఆయిల్ రిఫైనరీ విస్తరణ పూర్తవుతుందని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చైర్మన్ పుష్ప్ జోషి తెలిపారు. ఉత్పత్తికి, విక్రయాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేసుకునేందుకు హెచ్‌పీసీఎల్ వార్షికంగా 8.33 మిలియన్ టన్నులుగా (ఎంటీపీఏ) ఉన్న వైజాగ్ రిఫైనరీ సామర్థ్యాన్ని 15 ఎంటీపీఏకి పెంచుకుంటోంది. దానితో పాటు రాజస్థాన్‌లోని బాడ్మేర్లో 9 ఎంటీపీఏ సామర్థ్యంతో కొత్తది నిర్మిస్తోంది. ఇది 2024 ఆఖరు నాటికి పూర్తి కావొచ్చని అంచనా. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ తాను ఉత్పత్తి చేసే దానికన్నా 50 శాతం అధికంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని విక్రయిస్తోంది. -
స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన వెంకటేశ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి..
F3 Success Meet Vizag, పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మహిళా ప్రేక్షకుల ఆదరణ వల్లే ఎఫ్–3 (F3) సినిమా అఖండ విజయం సాధించిదని ప్రముఖ హీరో వెంకటేశ్ తెలిపారు. ఆర్.కె.బీచ్ దరి గోకుల్‌పార్కులో శనివారం రాత్రి ఎఫ్–3 ఫన్టాస్టిక్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ తనకెప్పుడూ స్పెషల్ అన్నారు. తన తొలి సినిమా కలియుగ పాండవులు షూటింగ్ విశాఖ బీచ్‌రోడ్డులోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మల్లీశ్వరి వంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను విశాఖలో చిత్రీకరించామన్నారు. తాను నటించిన దృశ్యం–2, నారప్ప వంటి సినిమాలు ఓటీటీలో మాత్రమే విడుదల కావడంతో తన అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారని పేర్కొన్నారు. ఎఫ్–3 సినిమాకు అభిమానులు విజయం చేకూర్చారని సంతోషం వ్యక్తం చేశారు. మరో హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ 'అభిమానుల ఆదరణే తమకు వందకోట్ల ఆదాయంతో సమానం. విశాఖ నోవాటెల్ హోటల్లోనే దర్శకుడు అనిల్ ఎఫ్–3 సినిమా కథ రాసుకున్నారు. మళ్లీ అవకాశం వస్తే కథ వినకుండానే వెంకటేశ్‌తో సినిమా చేస్తాను.' అని పేర్కొన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ విశాఖలో ఆర్య, పరుగు సినిమా షూటింగ్ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అమెరికాలో కూడా ఇదే ఆదరణ లభించడం అపూర్వమన్నారు. ఈ రోజుకు సినిమా విడుదలై 9 రోజులవుతుందని.. రూ.100 కోట్ల గ్రాస్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. జగదాంబ వంటి 1,100 సీట్లు ఉన్న థియేటర్లో ఎఫ్–3 హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోందని జగదాంబ థియేటర్ అధినేత జగదీష్ చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్–4 త్వరలోనే ప్రకటిస్తామన్నారు. The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 'విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు ముందు నేను చేసిన చాలెంజ్‌తో మీడియా కూడా షాక్ అయింది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణను నేను, హీరో వెంకటేశ్ ఎంతో రుచి చూశాం' అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ కేవలం ప్రేక్షకులను నవ్వించడానికే ఈ సినిమా తీశానన్నారు. ఈ సినిమాలో ఆలీ పాత్ర నచ్చిందా అని ప్రేక్షకులను అడిగారు. తనకు ఎఫ్–2 కంటే ఎఫ్–3 సినిమా అంతకుమించి ఆనందం ఇచ్చిందన్నారు. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా చాలా బాగా పండాయన్నారు. తన సినిమా కథలన్నీ వైజాగ్‌లోనే రాసుకున్నానని చెప్పారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ఎఫ్–3 చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇదే రోడ్డుపై ఎన్నో షూటింగ్‌లు చేశానని నటుడు అలీ చెప్పారు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హీరో వెంకటేశ్, వరుణ్‌తేజ్, అనిల్ సినిమాలోని ఓ పాటకు నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. సే నో టు ప్లాస్టిక్ ఎఫ్–3 విజయోత్సవంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ మాట్లాడుతూ విశాఖలో ఆదివారం నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామన్నారు. విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మారుస్తున్నట్లు తెలిపారు. దీనిపై చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేయాలన్న జీవీఎంసీ ప్రయత్నాన్ని అభినందించారు. ప్రజల సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యపడుతుందన్నారు. -
వైజాగ్ టు టాలీవుడ్.. వెండితెరపై విశాఖ యువకుడు
కొమ్మాది(భీమిలి)/విశాఖపట్నం: విశాఖ అంటే ప్రకృతి అందాలకు పుట్టినిల్లే కాదు.. అపర్ణ, గౌతమి, రమణ గోగుల, రాజా, సుత్తివేలు, గొల్లపూడి మారుతీరావు, శుభలేఖ సుధాకర్, వైజాగ్ ప్రసాద్, సుమన్‌శెట్టి, కులశేఖర్ లాంటి ఎంతో మంది నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులకు జన్మనిచ్చింది. అందుకే సినిమా అంటేనే ముందుగా గుర్తొచ్చేది విశాఖపట్నమే. వీరందరి స్ఫూర్తితో విశాఖ నుంచి టాలీవుడ్ బాటపట్టారు సాగర్‌నగర్‌కు చెందిన పోలుబోతు రవిశంకర్ నాయుడు. చదవండి: ‘భీమ్లా నాయక్’ నుంచి మరో ట్రైలర్.. ఫాన్స్‌కు పూనకాలే! తక్కువ ఖర్చుతో.. స్థానిక నటులతో.. విశాఖ పరిసర ప్రాంతాల్లో స్వాతి చినుకు సంధ్య వేళలో సినిమా తీసి.. వెండి తెరకు పరిచయమయ్యారు. అంతే కాదు.. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో మరో రెండు సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో స్వాతి చినుకు సంధ్య వేళలో సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆయన రెండో సినిమా బండెనక బండికట్టి చిత్రీకరణలో ఉంది. మార్చి 5న ది నన్స్ డైరీ పేరుతో మరో సినిమా చిత్రీకరించేందుకు రవిశంకర్ సిద్ధమవుతున్నారు. దర్శకుడు రవిశంకర్ అంతా విశాఖే.. డిప్యూటీ కలెక్టర్ తమ్మారావు, త్రివేణి దంపతుల కుమారుడు రవిశంకర్ విశాఖలోనే పుట్టి పెరిగారు. ఎంబీఏ చేసిన తర్వాత సినిమాలపై ఆసక్తితో ఓ కథను తయారు చేసుకుని.. తానే దర్శకత్వం వహించారు. ఆ సినిమాయే స్వాతి చినుకు సంధ్య వేళలో. ఈ నెల 18న రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా మొత్తం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో రూ.45 లక్షల వ్యయంలో చిత్రీకరించి విజయం సాధించారు. విశాఖ యువతకు అవకాశం విశాఖలో షూటింగ్‌లకు అనువైన స్థలాలే కాదు.. ప్రతిభ కలిగిన వేలాది మంది కళాకారులు ఉన్నారు. వారందరికీ అవకాశం కల్పించాలన్నదే తన ధ్యేయమని దర్శకుడు రవిశంకర్ తెలిపారు. స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తే తక్కువ పెట్టుబడితో సినిమాను అందంగా చిత్రీకరించవచ్చన్నారు. సీఎం జగన్ నిర్ణయంతో కొత్త ఆశలు రాష్ట్ర విభజన తర్వాత సినీ పరిశ్రమ అంతా వైజాగ్ వైపు చూస్తుంది. ఈ క్రమంలో విశాఖలో స్టూడియోలు నిర్మించాలని, సినిమా చిత్రీకరణలు చేపట్టాలని ముఖ్యంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టాలీవుడ్‌ను ఆహా్వనించారు. ఆయన తీసుకున్న నిర్ణయంతో విశాఖ కళాకారులకు కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లయితే సినీ పరిశ్రమకు విశాఖ ఒక ఐకాన్ కానుందని రవిశంకర్ తెలిపారు. ఏడాదికి 3 సినిమాలు ఏడాదికి మూడు సినిమాలు తీయాలన్నదే తన ధ్యేయమని రవిశంకర్ తెలిపారు. ఇప్పటికే ఓ సినిమా విడుదల కాగా.. మరో సినిమా నిర్మాణంలో ఉంది. వచ్చే నెలలో మరో సినిమా ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. రవితేజతో సినిమా తీయాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. విశాఖ అంటే చాలా ఇష్టమని.. అందుకే తన సినీ ప్రస్థానం ఇక్కడే ప్రారంభించినట్లు తెలిపారు. -
శత్రు దేశాలకు దడ పుట్టించేలా, విశాఖ తీరానికి అడ్వాన్స్డ్ భద్రత
సాక్షి, విశాఖపట్నం: తీర రక్షణలో రెప్ప వాల్చకుండా నిమగ్నమైన తూర్పు నౌకాదళం తన శక్తి సామర్థ్యాల్ని పెంపొందించుకుంటూ దుర్బేధ్యమైన శక్తిగా మారుతోంది. తాజాగా అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లు నౌకాదళ అమ్ముల పొదిలో చేరడంతో తూర్పు తీర భద్రత మరింత పటిష్టమైంది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హెలికాఫ్టర్లు బంగాళాఖాతంలో నిరంతరం పహారా కాయనున్నాయి. విశాఖ స్థావరంగా.. రక్షణ అవసరాల దృష్ట్యా బ్రిటిష్ పాలకుల హయాం నుంచే తూర్పు తీరం కీలకమైన ప్రాంతం. తూర్పు నౌకాదళం విశాఖపట్నం ప్రధాన స్థావరంగా ఏర్పాటైంది. మయన్మార్‌లోని కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహాసముద్రం వరకూ ఈస్ట్రన్ నేవల్ కమాండ్ పరిధిలో సురక్షితంగా ఉంది. ఉత్తరాన సుందర్బన్ నుంచి దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ విస్తరించి ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పాండిచ్చేరి వరకూ విస్తరించి ఉంది. 2,600 కి.మీ నిడివి కలిగిన తూర్పు తీరంలో 30 శాతం అంటే 6 లక్షల చ.కి.మీ పరిధిలో ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ విస్తరించి ఉంది. తీరంలో 13 మేజర్ పోర్టులున్నాయి. కేంద్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తిస్తోంది. డీఆర్డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. క్షిపణులు తయారు చేసే నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీస్ కూడా విశాఖలోనే ఏర్పాటైంది. యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు.. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో భారతీయ నౌకాదళం ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 40 వరకూ యుద్ధ నౌకలు, సబ్మెరైన్లున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో కిల్తాన్, ధ్రువ్ మొదలైన యుద్ధ నౌకల్ని సమకూర్చుకుంటూ దేశ రక్షణలో తూర్పు నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా మూడు సూపర్ ఫాస్ట్ హెలికాఫ్టర్లు చేరడంతో భద్రత వ్యవస్థ మరింత పటిష్టంగా మారింది. గంటకు 280 కి.మీ వేగంతో... నిఘా వ్యవస్థలో రాటుదేలేందుకు కొత్తగా ఆధునిక పరిజ్ఞానంతో దేశీయంగా నిర్మించిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లు మూడింటిని భారత నౌకాదళం విశాఖకు కేటాయించింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఏఎల్‌హెచ్ ఎమ్కే–3 పేరిట ఈ హెలికాఫ్టర్లని తయారు చేశారు. నేవీ, కోస్ట్‌గార్డ్‌లు ఇప్పటి వరకూ ఎమ్కే–1 వేరియంట్ హెలికాఫ్టర్లని వినియోగిస్తున్నాయి. ఎమ్కే–3 వేరియంట్స్‌తో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఏఎల్‌హెచ్ ఎమ్కే–3 హెలికాఫ్టర్లలో గ్లాస్ కాక్‌పిట్ మాత్రమే కాకుండా హిందూస్థాన్ ఏరోనాటికల్స్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్చర్ డిస్ప్లే సిస్టమ్(ఐఎడీఎస్) ఉంది.ఇందులో శాఫ్రాన్ ఆర్డిడెన్ 1హెచ్1 ఇంజిన్స్ ఉండటంతో గంటకు 280 కి.మీ. వేగంతో దూసుకెళతాయి. ఎమ్కే–3లో అధునాతన ఏవియానిక్స్ ఉండటం వల్ల వాతావరణానికి అనుగుణంగా పనితీరు మార్చుకొని ప్రయాణం చేయగలవు. వీటికి ఆధునిక నిఘా రాడార్, ఎలెక్ట్రో ఆప్టికల్ పరికరాలు అమర్చారు. దీనివల్ల పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ సుదూర శోధన, శత్రుమూకల నుంచి రక్షణ అందిస్తూ సముద్ర నిఘా వ్యవస్థని పటిష్టం చేయనున్నాయి. ఎమ్కే–3లో భారీ మెషీన్‌గన్ కూడా అమర్చారు. అత్యవసరాల కోసం మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఎమ్కే–3లో ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల్ని ఎయిర్‌లిఫ్ట్ చేసి ఆస్పత్రులకు తరలించేందుకు ఇది దోహదపడుతుంది. -
విశాఖ ఐటీఐఆర్‌లో ముందడుగు లేదు
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రతిపాదన( ఆగస్టు 26, 2014)ను ఇంకా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి పంపించలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి ఆల్ఫోన్స్ కన్నాంతనమ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం తరుపున లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గతంలో భువనేశ్వర్‌లో కూడా ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కూడా వచ్చిందని అయితే దీని ఏర్పాటులో సమగ్రంగా పున: పరిశీలించాలని ఆదేశించామని, ఆ ఆదేశాల అనంతరం అందులో సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ సవరణ మేరకు కేబినెట్ కమిటీకి ఒక నోట్ కూడా సమర్పించామని, అది జరిగితే ఏపీ ప్రతిపాదనను పంపిస్తామన్నారు. అలాగే జీఎస్టీ తర్వాత రైల్వే కాంట్రాక్ట్ పనుల విషయంలో కోరిన వివరణకు కూడా కేంద్రం సమాధానం చెప్పింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత దక్షిణ మధ్య రైల్వేలోని ఓపెన్ లైన్, కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్‌లో కాంట్రాక్టర్లు తాత్కాలికంగా పనులు నిలిపేసిన విషయం వాస్తవమేనని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహైన్ తెలిపారు. అయితే, శాఖ పరమైన వనరులను తరలించి ఎక్కడ అవసరం అయితే అక్కడ ట్రాక్ భద్రత పనులు కొనసాగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. విజయసాయిరెడ్డి ప్రశ్నల వివరాల పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
‘సినిమాల వల్ల వ్యవస్థలు మారవు’
సాక్షి, విశాఖపట్టణం : దేశ రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సివుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన సభలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు రావాల్సివుందని అభిప్రాయపడ్డారు. సినిమాల వల్ల వ్యవస్థలు మారవని చెప్పారు. ఆచరించి మిగతావాళ్లకు చెబితేనే విలువ ఉంటుందని అన్నారు. సమూల మార్పులు సాధించలేకపోయినా, ఎంతో కొంత మార్పు తీసుకురావడం సాధ్యమేనని చెప్పారు. నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ల స్ఫూర్తితోనే తాను రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు ఏదో ఒక కులానికి పరిమితమయ్యాయని విమర్శించారు. పూర్తిగా జాతీయ భావాలున్న పార్టీ రాజకీయాల్లో రావాల్సివుందని అన్నారు. -
మీకు అండగా వుంటా!
-
చెట్టును ఢీకొట్టిన కారు : ఇద్దరు మృతి
-
చెట్టును ఢీకొట్టిన కారు : ఇద్దరు మృతి
విశాఖపట్నం : నగరంలోని స్టీల్ ప్లాంట్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మంటే మంగమ్మలా ఉండాలి
గోపాలపట్నం : ఆమె పేరులోనే ఉంది అమ్మ. గర్భం నుంచి ప్రసవించిన లెక్కలేనంత మంది బిడ్డల్ని తల్లికంటే ముందు లోకానికి పరిచయం చేసిన అమృత వల్లి. ఎందరో తల్లులకు పునర్జన్మనిచ్చిన దేవతామూర్తి. ఆంధ్రుల హక్కు...విశాఖ ఉక్కు...అంటూ విశాఖలో ఆందోళన కారులు కేజీహెచ్‌ని సైతం మూయించేసిన రోజుల్లో నేనున్నానంటూ ఉత్తరాంధ్ర తల్లులకు పురుడుపోసిన మహాతల్లి. ఉత్తరాంధ్రలో ఏ బస్సెక్కినా, ఆటో ఎక్కినా, చివరికి రిక్షా ఎక్కినా ఆమె పేరు చెబితే తెలియని వారుండరు. పరిచయం అక్కర్లేని అమ్మ. ఆమే డాక్టర్ మంగమ్మ. మాతృదినోత్సవం సందర్భంగా డాక్టర్ మంగమ్మ గురించి... నేపథ్యమిదీ... చిత్తూరి సుబ్రహ్మణ్య మంగమ్మ ఎక్కడి వారో కాదు. ఆమె స్వస్థలం విశాఖ సిటీ వన్టౌనే. రెండో ప్రపంచయుద్ధం సమయంలో విశాఖ మొత్తం అంధకారం అయిన రోజుల్లో దీపంబుడ్డిలతో బీఎస్సీ చదువుకున్నారు. వివాహ అనంతరం భర్త రమణ ప్రోత్సాహంతో ఎంబీబీఎస్, డీజీవో చదివారు. కేజీహెచ్‌లో హానరీ గైనకాలజిస్టుగా ఆమె విశేష అనుభవం సాధించారు. నగరంలో నర్సింగ్‌హోం అంటే విచిత్రంగా చూసిన 1958 రోజుల్లో కేజీహెచ్ ఎదురుగా ఆమె తొలిసారిగా నర్సింగ్ హోం ఏర్పాటు చేశారు. అదే డాక్టర్ మంగమ్మ నర్సింగ్ హోమ్. మంగమ్మకు ఐదుగురు సంతానంలో కొడుకు శ్రీనివాస్, కుమార్తెలు సంధ్యారాణి, సుజాత గైనకాలజిస్టులు కాగా, ఇంకా మనవలతో కలిపి 13మంది వైద్యుల్ని తయారు చేశారు. కిడ్నీ, గుండె తదితర పేరొందిన వైద్యులుగా వారు సేవలందిస్తున్నారు. ఆపద్భాంధవి... విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖలో ఆందోళనలు అట్టుడికిపోయిన రోజుల్లో కేజీహెచ్‌లో ఎమర్జెన్సీవార్డులు సైతం మూతపడ్డాయి. ఆ సమయంలో ఉత్తరాంధ్రలో ఎందరో గర్భిణులకు అండగా నేనున్నానంటూ లేపాక్షి భవనంలో 15 రోజుల పాటు ఉచితంగా డెలివరీలు చేశారు. మూడు దశాబ్దాలుగా ఆమె సత్యసాయి వైద్యకేంద్రం పేరుతో ప్రహ్లాదపురం సమీప శ్రీనివాసనగర్‌లో గర్భిణులకు ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. బాబా ప్రశంసలు... భగవాన్సత్యసాయిబాబాకి భక్తురాలయిన డాక్టర్ మంగమ్మ ఒకసారి దర్శించి బాబాతో మాట్లాడి దైవం చెంతకు తీసుకెళ్లాని కోరితే... నీవేదైవస్వరూపిణిగా ఎందరికో సేవ చేస్తున్నావు..దైవున్నే నీసొంతం చేసుకున్నావు....ఇక నీకెం దుకు ఇంకో దైవం...అని బాబా ప్రశంసించారంటే ఆమె గొప్పతనాన్ని అంచనావేయాలి. అమ్మ సంస్కృతికి అద్దంపట్టాలి అమ్మంటే బిడ్డల్ని కనేయడమే కాదు. భారతీయ సంస్కృతిని నేర్పాలి. మనల్నిమనం సంస్కరించుకోవడంతో పాటు ఇతరుల బాగోగులు పట్టించుకోవాలి. మాటసాయం, చదువుకి సహకరించడం, వైద్యం అందించడం...ఇవీ సేవలంటే. నాకిపుడు 85 ఏళ్లు వచ్చినా ప్రజలు ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. ఇంతకంటే ఏం కావాలి. -డాక్టర్ మంగమ్మ -
సినీ పరిశ్రమను విశాఖకు తీసుకువస్తాం: చినరాజప్ప
విశాఖ ఉత్సవాల్లో ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సాక్షి, విశాఖపట్నం: సుందర విశాఖ నగరానికి సినీ పరిశ్రమను తీసుకువస్తామని ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విశాఖలో జరుగుతున్న ‘విశాఖ ఉత్సవ్’ రెండో రోజు కార్యక్రమాల్లో మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్లతో కలిసి శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్కె బీచ్‌లో ప్రధాన వేదికపై జరిగిన సభలో చినరాజప్ప ప్రసంగిస్తూ... వారంలో 5 రోజులు పనిచేస్తే రెండు రోజులు సెలవు తీసుకునే పద్ధతి విదేశాల్లో ఉందని, అలాంటిది మనకూ ఉండాలన్నారు. చిన్న గ్రామంలా ఉండే విశాఖ ఇప్పుడు మహా నగరం అయి స్మార్ట్ సిటీ జాబితాలో చేరిందని, దీనిని ప్రపంచ స్థాయికి తీసుకువెళతామన్నారు. మంత్రి రావెల కిషోర్ మాట్లాడుతూ హుద్‌హుద్ తుపాను వచ్చినపుడు నగరంలో అలుముకున్న నిరాశ నిస్ఫృహల నుంచి విశాఖవాసులు అత్యంత వేగం గా బయటపడి ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడం ఆదర్శనీయమన్నారు. కాగా.. రెండో రోజు కైలాసగిరిలో లేజర్‌షో ఆకట్టుకుంది. ఆర్కె బీచ్‌లో నమూనా దేవాలయాలకు సందర్శకులు పోటెత్తారు. గురజాడ కళాక్షేత్రంలో జరిగిన నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. కిక్ బాక్సింగ్, బీచ్ వాలీబాల్ పోటీలు జరిగా యి. ఆంధ్రా యూనివర్శిటీలో విలువిద్య పోటీలు జరిగాయి. కాగా.. రెండో రోజు విశా ఖ ఉత్సవ్‌లో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొంటారని అధికార వర్గాలు ప్రచారం చేసినా.. ఆయన రాలేదు. -
నాటుపడవ బోల్తా, ఐదుగురు మహిళలు గల్లంతు
విశాఖ: నాటుపడవ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని హుకుంపేట మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో గురువారం చోటుచేసుకుంది. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.