జీఎస్‌టీ, నోట్లరద్దు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. నోట్ల రద్దు అత్యంత ఘోరంగా విఫలమైందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ అంగీకరించడం లేదన్నారు. ‘నవంబర్ 8..భారత్‌కు విషాదకర దినం..బీజేపీ ఆ రోజున నల్లధన వ్యతిరేక దినంగా పాటించాలని పిలుపు ఇవ్వడం తనకు అర్థం కావడం లేద’ని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రజల మనోగతాన్ని అర్ధం చేసుకోవాలని, దేశ ప్రజలను వందలాదిగా బలిగొన్న రోజున ఉత్సవాలు జరుపుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.నోట్ల రద్దుతో దేశంలోని నిరుపేదలు అనుభవించిన కష్టాలను అర్థం చేసుకోవడంలో ప్రధాని విఫలమయ్యారని విమర్శించారు.