షాద్‌నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య కు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియాంకారెడ్డిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని శంషాబాద్‌లోని ప్రియాంక నివాసం వద్ద స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందింతులను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు ఆలస్యంగా స్పందిచారని మండిపడుతున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. ‘దుండగులపై కేసులు వద్దు.. ఎన్‌కౌంటర్ చేయండి’ అని రాసి ఉన్న ఫ్లకార్డులు ప్రదర్శించారు.