ఎప్పుడైనా నడిరోడ్డుపై రైలు రావడం చూశారా. దానికి ఎదురుగా పోలీస్ వాహనం. సాధారణం ఏం జరుగుతుంది? రైలు ఢీకొంటే ఏమౌతుంది? ఏదైనా తుక్కుతుక్కుగా మారాల్సిందే. పట్టాలపై వెళ్లాల్సిన రైలు నడి రోడ్డులోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందనే అనుమానం పక్కన పెడితే మధ్యప్రదేశ్‌లో ఈ సన్నివేశం సర్వసాధారణం.
మధ్యప్రదేశ్‌లోని గౌషీపుర, రతినగర్ జిల్లాల మధ్య గ్వాలియర్ లైట్ రైలు నడుస్తోంది. ప్రపంచంలోనే వీధుల్లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు కూడా ఇదే. ఈ రైలు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్‌ను అదుపు చేయడానికి మూడు ప్రదేశాల్లో గేట్లు మూసేస్తారు. అయితే ఒకరోజు ఇది వీధుల్లో ప్రయాణిస్తుండగా ఎదురుగా పోలీస్ వాహనం వచ్చింది. రెప్పపాటులో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు ఇంజన్ ముందు భాగం, పోలీస్ వాహనం వెనుక భాగాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరీకీ ఏమీకాలేదు. కాసేపు రెండిటిని నిలిపేసి నిదానంగా వెనక్కి నడిపి బయటకు తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.