శబరిమల ఆలయ పరిసరాల్లో మూడో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా భక్తులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. మాస పూజల కోసం బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు కేరళ చేరుకున్నారు. కాగా వారు ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు.