ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హిందూత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, జేఏసీ ద్వారా మహా పాదయాత్రను తలపెట్టనున్న శివస్వామిపై శనివారం కేసు నమోదైంది. శివస్వామి అనుచరులు కులం పేరుతో దూషించి దాడి చేశారని ఫిర్యాదు అందటంతో పోలీసులు జేఏసీ చైర్మన్ అయిన శివస్వామిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు హాజరుకావాలని శివస్వామికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.