‘ఆపరేషన్‌’ ఇంకా కొనసాగుతోంది: ఎస్పీ | SP Amber Kishore jha Pressmeet On Chala Encounter | Sakshi
Sakshi News home page

Mar 2 2018 7:23 PM | Updated on Mar 22 2024 10:48 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో రాష్ట్ర గ్రేహౌండ్స్‌ బలగాలకు మావోయిస్టు బలగాలకు మధ్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులలో 10మంది మావోయిస్టులతో పాటు ఒక గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌  మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్‌ కిశోర్‌ ఝ తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో నిఘా పెట్టామని తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement