వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. ప్రతిపక్ష నేతను భౌతికంగా అంతం చేసేందుకు సాగించిన కుట్ర బయట పడుతుందనే భయం చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటాడుతోందన్న విషయం తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. ఎన్‌ఐఏకు ఏపీ పోలీసుల సహాయ నిరాకరణతోపాటు దర్యాప్తును అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కారు 2 రోజులుగా మల్లగుల్లాలు పడుతున్న తీరు చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. గతేడాది అక్టోబర్ 25న జగన్‌పై కత్తితో హత్యాయత్నం చేయడాన్ని ఖండించకుండా సీఎం చేసిన వ్యాఖ్యలు, డీజీపీ ఠాకూర్ చేసిన ప్రకటన ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఎన్‌ఐఏపై ఎందుకీ ద్విముఖ వైఖరి?
Published Mon, Jan 7 2019 7:00 AM | Last Updated on Wed, Mar 20 2024 3:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement