దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్య బాధ్యత రాజధాని ప్రాంత పరిధిలోని రాష్ట్రాలదే అని తేల్చి చెప్పింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్ కమిషనర్లు బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు సప్ష్టం చేసింది.