arun misra
-
‘హరిత’ వాహనాలపై బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో డీజిల్ ఆధారిత మైనింగ్ వాహనాలను బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలుగా మార్చుకునేందుకు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,270 కోట్లు) పైగా వెచ్చించనున్నట్లు, పూర్తి స్థాయిలో హరిత ఇంధనాల వైపు మళ్లనున్నట్లు హిందుస్తాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా తెలిపారు. తమకు 900 మైనింగ్ వాహనాలు ఉండగా ఇప్పటికే నాలుగింటిని ప్రయోగాత్మకంగా బ్యాటరీలతో నడిపిస్తున్నట్లు ఆయన వివరించారు. 2050 నాటికి పూర్తి కర్బన ఉద్గారాల రహిత సంస్థగా ఎదిగే దిశగా 200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు ఇటీవలే సెరెంటికా సంస్థతో పాతికేళ్ల పవర్ పర్చేజ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మిశ్రా చెప్పారు. దీనితో 1.2 మిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాలను నివారించవచ్చన్నారు. 2024 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగాన్ని 40 శాతం మేర, 2027 పూర్తిగా తగ్గించుకోవాలని ప్రణాళికలు ఉన్నట్లు మిశ్రా వివరించారు. అలాగే రాజస్థాన్‌లోని చందేరియాలో రూ. 2,500 కోట్లతో 0.5 మిలియన్ టన్నుల డీఏపీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వేదాంత గ్రూప్ సంస్థ అయిన హెచ్‌జెడ్‌ఎల్‌లో ప్రభుత్వానికి 29 శాతం వాటాలు, ముగ్గురు బోర్డు సభ్యులు ఉన్నారు. ఈ వాటాలను ప్రభుత్వం త్వరలోనే పూర్తిగా విక్రయించనుందని, అయితే నిర్దిష్ట కాలవ్యవధేమీ లేదని మిశ్రా వివరించారు. దీనిపై ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసినట్లు ఆయన చెప్పారు. జింక్ తయారీలో హెచ్‌జెడ్‌ఎల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. దేశీయంగా వెండిని తయారు చేసే ఏకైక సంస్థగాను, జింకు..సీసం అత్యధికంగా తయారు చేసే కంపెనీగాను కార్యకలాపాలు సాగిస్తోంది. -
సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లపైనా ‘నిఘా’
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిన వారి జాబితాలో ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు కూడా ఉన్నారని ‘ది వైర్’ న్యూస్ పోర్టల్ బుధవారం వెల్లడించింది. సుప్రీంకోర్టు జడ్జి వాడిన పాత ఫోన్ నంబరు కూడా దీంట్లో ఉందని తెలిపింది. రిజిస్ట్రార్లు ఎన్కే గాంధీ, టీఐ రాజ్‌పుత్‌లు సుప్రీంకోర్టులోని ‘రిట్’ విభాగంలో పనిచేసినపుడు.. 2019లో వీరి ఫోన్లపై నిఘా పెట్టారు. ప్రతి ఏడాది దాదాపు వెయ్యికి పైగా రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవుతాయని, వీటిలో ప్రభుత్వానికి ఇబ్బందికరమైనవి, రాజకీయంగా సున్నితమైన అంశాలకు సంబంధించినవి కూడా ఉంటాయని వైర్ పేర్కొంది. అందువల్లే రిజిస్ట్రార్లపై కన్నేసి ఉంచారని వివరించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా వాడిన పాత ఫోన్ నంబరు కూడా నిఘా జాబితాలో ఉంది. సదరు ఫోన్ నంబరు 2014లోనే వాడటం ఆపేశానని అరుణ్ మిశ్రా తెలిపారు. అయితే 2018 దాకా ఇది ఆయన పేరుపైనే ఉందని వైర్ తెలిపింది. జస్టిస్ అరుణ్ మిశ్రా పాత ఫోన్ నంబరును 2019లో నిఘా జాబితాలో చేర్చారు. ఆయన 2020లో రిటైరయ్యారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సన్నిహితుడు, ఆయన దగ్గర పనిచేసే జూనియర్ ఎం.తంగదురై ఫోన్‌పైనా నిఘా పెట్టారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తయారుచేసిన పెగసస్ స్పైవేర్‌తో విపక్ష నాయకులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, జర్నలిస్టులపై (మొత్తం 300 మందిపై) కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని తమ పరిశోధనలో తేలిందని అంతర్జాతీయ మీడియా సంస్థల కన్సార్టియం వెల్లడించినప్పటి నుంచి భారత్‌లో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఇద్దరు కేంద్రమంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, 40 మంది పాత్రికేయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే తాము పెగసస్ స్పైవేర్‌ను అమ్ముతామని ఎన్ఎస్ఓ ప్రకటించింది. చట్ట విరుద్ధంగా ఎవరిపైనా నిఘా పెట్టలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా... అంటే దానర్థం ఈ నిఘా సాఫ్ట్వేర్ భారత ప్రభుత్వం వద్ద ఉన్నట్లు, దాన్ని వాడుతున్నట్లు అంగీకరించడమేనని విపక్షాలు అంటున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన జూలై 19 నుంచి పెగసస్ అంశంపై పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విస్పష్ట ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. -
NHRC చైర్మన్‌గా జస్టిస్ అరుణ్ మిశ్రా.. ఖర్గే అభ్యంతరం
ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా(ఎన్హెచ్ఆర్సీ) బాధ్యతలు స్వీకరించారు. మాజీ జస్టిస్ హెచ్ఎల్ దత్తు పదవీకాలం ముగిసిన తర్వాత.. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ పోస్టు గత ఏడాది డిసెంబర్ నుంచి ఖాళీగా ఉన్నది. ఇవాళ జస్టిస్ అరుణ్ మిశ్రాతో పాటు ఓ ప్యానెల్ సభ్యుడు కూడా చేరారు. అయితే అరుణ్ మిశ్రాను మోదీ నేతృత్వంలోని హై పవర్డ్ కమిటీ రాష్ట్రపతికి రికమెండ్ చేసింది. ఆ హైపవర్డ్ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ఉన్నారు. కాగా మల్లిఖార్జున్ ఖర్గే అరుణ్ మిశ్రా నియామకాన్ని తప్పుబట్టారు.షెడ్యూల్డ్ కాస్ట్ లేదా షెడ్యూల్డ్ తెగకు చెందిన వ్యక్తిని ఎన్హెచ్ఆర్సీ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. జస్టిస్ మిశ్రా సుప్రీంకోర్టు జడ్జిగా 2014లో చేరారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆయన రిటైర్ అయ్యారు. కోల్‌కతా, రాజస్థాన్ హైకోర్టుల్లో ఆయన చీఫ్ జస్టిస్‌గా చేశారు. జస్టిస్ మిశ్రా తండ్రి హర్గోవింద్ మిశ్రా మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా చేశారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2020 డిసెంబర్లో పదవీ విరమణ చేశారు. కాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ చంద్ర పంత్ ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి: వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం -
జేఈఈ, నీట్ వాయిదాకు సుప్రీం నో!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశ పరీక్షలు జేఈఈ, నీట్లు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. విలువైన విద్యా సంవత్సరాన్ని వృథా కానివ్వలేమని, కరోనా వైరస్ ఉన్నప్పటికీ జీవితం ముందుకు సాగాల్సిందేనని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. (3 కోట్లు దాటిన పరీక్షలు) ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం జేఈఈ పరీక్ష సెప్టెంబరు 1 –6 తేదీల్లో, నీట్ పరీక్ష అదే నెల 13వ తేదీన జరగాల్సి ఉంది. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా వీటిని వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదకొండు రాష్ట్రాలకు చెందిన ఈ విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి జూలై మూడున జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని తమ పిటిషన్లో కోరారు. అయితే ఈ అంశాలపై జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్‌మిశ్రా మాట్లాడుతూ విద్యార్థుల కెరీర్‌ను దీర్ఘకాలం డోలాయమానంలో ఉంచలేమని వ్యాఖ్యానించారు. దీంతో జేఈఈ, నీట్ పరీక్షలు సెప్టెంబరులోనే జరిగేందుకు మార్గం సుగమమైంది. విచారణ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సమయంలో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత మాత్రమే జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని, పరీక్షల వాయిదాతో తమకు సాంత్వన చేకూరుతుందని లక్షల మంది విద్యార్థులు సుప్రీంకోర్టువైపు చూస్తున్నారని అన్నారు. పరీక్ష నిర్వహణ కేంద్రాల సంఖ్యను పెంచాలని కూడా ఆయన తన పిటిషన్లో కోరారు. ‘‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో జేఈఈ, నీట్ నిర్వహించడం పిటిషన్దారులతోపాటు లక్షలాది విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టడమే. మరికొంత కాలం వేచి చూడటం మేలైన పని. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడేందుకు కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తరువాతే పరీక్షలు నిర్వహించాలి’’అని ఆ పిటిషన్లో కోరారు. జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ ఈ ఏడాది 161 కేంద్రాల్లో జేఈఈని ఆన్లైన్ పద్ధతిలోనూ, నీట్‌ను ఆఫ్లైన్లోనూ నిర్వహించాలని తీర్మానించిందని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్టీఏ జూన్ 22న జరగాల్సిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేసిందని పిటిషన్‌దారులు తెలిపారు. బిహార్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో వరదల కారణంగా విద్యార్థులు ఎదుర్కొనే కష్టాలను ఎన్టీఏ పరిగణనలోకి తీసుకోలేదని, ఈ రాష్ట్రాల విద్యార్థులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ పరీక్షలకు హాజరయ్యే పరిస్థితుల్లో లేరని వివరించారు. ఇదిలా ఉండగా.. ఆయుష్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష ఏఐఏపీజీఈటీని వాయిదా వేయాలని, కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో పరీక్ష నిర్వహణ సరికాదని పలువురు డాక్టర్లు సోమవారం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం కొసమెరుపు. -
ప్రధానిని పొగడడంపై లాయర్ల సంఘాల్లో విభేదాలు
న్యూఢిల్లీ: గతవారం జరిగిన అంతర్జాతీయ న్యాయ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రధాని మోదీని ప్రశంసించడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీని జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశంసించడం అభ్యంతరకరమని పేర్కొంటూ ఒక తీర్మానం చేసినట్లు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు దుష్యంత్ దవే పేరుతో బుధవారం ప్రకటన వెలువడింది. జస్టిస్ మిశ్రా తీరును విమర్శిస్తూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. ప్రధానిని పొగడుతూ జస్టిస్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ స్వతంత్రత, నిష్పక్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. అయితే జస్టిస్ మిశ్రాను ఎస్సీబీఏ అధ్యక్షుడు విమర్శించడం హ్రస్వ దృష్టికి నిదర్శనమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ ఓ ప్రకటనలో అన్నారు. -
సారీ చెప్పిన సుప్రీంకోర్టు జడ్జి
న్యూఢిల్లీ: కేసులో వాదనలు వినిపిస్తున్న ఓ న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ నేరం మోపుతానంటూ బెదిరించిన సంఘటనలో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా గురువారం క్షమాపణ చెప్పారు. తమతో వ్యవహరించే విషయంలో ఓపికగా ఉండాలన్న సీనియర్ న్యాయవాదుల సూచనకు అంగీకరించిన జస్టిస్ అరుణ్ మిశ్రా... తన వైఖరి కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. భూ సేకరణకు సంబంధించిన కేసులను చూస్తున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహిస్తుండగా మంగళవారం ఒక కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న లాయర్ గోపాల్ శంకర నారాయణన్‌ను కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తానని బెదిరించారు. ఈ విషయంపై కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ, అభిషేక్ సింఘ్వీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్ ఖన్నా తదితరులు గురువారం జడ్జిని కలిసి జరిగిన సంఘటనను ప్రస్తావించారు. ‘ఏ సమయంలోనైనా ఎవరైనా ఏదైనా అనుకునిఉంటే చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నా’ అని జడ్జి వ్యాఖ్యానించారు. -
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
-
మనం బతకగలమా?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్య బాధ్యత రాజధాని ప్రాంత పరిధిలోని రాష్ట్రాలదే అని తేల్చి చెప్పింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్ కమిషనర్లు బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు సప్ష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ఫై జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అరగంటలో పర్యావరణ నిపుణులను కోర్టుకు తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిపుణుల సలహాలు, సూచనలతో వాయు కాలుష్యంపై ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. రైతులకు పంట వ్యర్థాలను కాల్చే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘జీవించే హక్కు చాలా ముఖ్యమైనదని, సాధారణంగా ఏక్యూఐ 401 దాటితేనే అక్కడ గాలి కాలుష్యం దారుణంగా ఉన్నట్లు పరిగణిస్తారు.. ఢిల్లీలో అయితే ఇది 500 పాయింట్లు దాటింది. అంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. వాయు కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో పని ఉంటే తప్ప ప్రజలను బయటికి రావొద్దని ప్రభుత్వం సూచిస్తోందంటే కాలుష్య స్థాయి ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆదివారం రోజున ఢిల్లీలోని రోహిణి, జహంగీర్‌పుర, సోనియా విహార్ తదితర ప్రాంతాల్లో ఈ సూచీ 999ని తాకిందంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఇలాంటి వాతావరణంతో మనం బతకగలమా? ఇంట్లో కూర్చున్నా సురక్షితంగా ఉండలేరు. ఇది చాలా భయానకం. ప్రతి ఏడాది కాలుష్యం పెరుగుతున్నా మనం ఏమీ చేయలేకపోతున్నాం. కాలుష్యంతో ప్రజలు చనిపోతున్నారు. నాగరిక దేశంలో ఇలాంటి మరణాలు ఉండకూడద’ని ధర్మాసనం పేర్కొంది. -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం వెనక్కి
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) వేధింపుల నిరోధక చట్టం నిబంధనలను సడలిస్తూ 2018లో ఇచి్చన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ఎస్సీ, ఎస్టీ ప్రజలు సమాజంలో సమానత్వం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారని, అంటరానివారుగా, వేధింపులకు, సామాజిక బహిష్కరణలకు గురవుతున్నారని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2018లో ఇచి్చన మార్గదర్శకాలను సమీక్షించాలంటూ కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ‘ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే తప్పుడు కేసులకు మానవ వైఫల్యమే తప్ప కుల వ్యవస్థ కారణం కాదు. న్యాయస్థానం ఈ విషయంలో సంపూర్ణ అధికారాలను ఉపయోగించ జాలదు. రాజ్యాంగం మేరకు ఈ మార్గదర్శకాలను అనుమతించలేము. వీటి కారణంగా సంబంధిత కేసుల విచారణ జాప్యం అవుతుంది. అందుకే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసే ముందుగా ప్రాథమిక దర్యాప్తు జరపాలని, అరెస్టుకు సంబంధిత అధికారి అనుమతి తీసుకోవాలంటూ గత ఏడాది మార్చి 20వ తేదీన ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నాం’అని తెలిపింది.‘ఒకవేళ నేరం నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ విషయంలో ప్రాథమిక విచారణ కూడా అవసరం లేదు’ అని స్పష్టం చేసింది. ఈ చట్టంలో ప్రాథమిక విచారణ జరపాలనే నిబంధనలు లేవని తెలిపింది.ఆర్టికల్ 15 ద్వారా రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కలి్పంచిందని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా ఇంకా వారు సామాజికంగా వేధింపులు, వివక్షకు గురవుతున్నారని పేర్కొంది. కులరహిత సమాజ స్థాపనే అంతిమ లక్ష్యం. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన అటువంటి పవిత్ర లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నాం’అని తెలిపింది. మనుషులతో మలమూత్రాల్ని ఎత్తివేయిస్తున్న పరిస్థితులు, ఈ సందర్భంగా సంభవిస్తున్న మరణాలపైనా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రపంచంలో మరెక్కడా కూడా మనుషులను గ్యాస్ చాంబర్లలోకి పంపి చంపడం లేదని వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రం వచి్చన 70 ఏళ్ల తర్వాత కూడా వివక్షకు, అంటరానితనానికి గురవుతున్న ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం రక్షించలేక పోయిందని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌నుద్దేశించి వ్యాఖ్యానించింది. గత ఏడాది మార్చిలో ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును సెప్టెంబర్ 18వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చట్టం దురి్వనియోగం అవుతున్నప్పుడు శాసనాలకు రాజ్యాంగానికి విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయగలమా? కులం ప్రాతిపదికన ఏ వ్యక్తినయినా అనుమానించగలమా? సాధారణ పౌరుడు కూడా తప్పుడు కేసు పెట్టొచ్చు కదా’అని పేర్కొంది. సమానత్వ సాధనకు సంబంధించిన ఈ అంశంపై నిర్దిష్టమైన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కూడా ఆ సమయంలో తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దురి్వనియోగం చేస్తూ ప్రభుత్వ అధికారులను వేధిస్తున్నారంటూ అభిప్రాయపడిన సుప్రీంకోర్టు గత ఏడాది సంచలన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో తక్షణమే అరెస్టులకు పూనుకోకుండా ఆరోపణల్లో వాస్తవాలను ముందుగా డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయించాలని పేర్కొంది. దీంతో ఈ చట్టాన్ని నీరుగార్చారంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టానికి సవరణలు చేపట్టింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులను సమీక్షించాలంటూ సుప్రీంలో పిటిషన్ వేసింది. -
మార్నింగ్ వాక్కు వెళ్లలేకపోతున్నా!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రతపై సుప్రీంకోర్టులో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో కాలుష్యం అధికంగా ఉండడం వల్ల తాను ఉదయం వాక్కు వెళ్లలేకపోతున్నానని అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాలుష్యం ఇంత అధికంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. కాలుష్యం వల్ల ఢిల్లీ వాసులు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేకపోతున్నారని ఆయన చెప్పారు. తాను కూడా గత కొన్ని రోజులుగా ఉదయాన్నే లేచి మార్నింగ్ వాక్కు వెళ్లాలనుకుంటానని, కానీ కాలుష్యాన్ని చూసి ఆ ప్రయత్నం మానుకుంటున్నానని న్యాయమూర్తి మిశ్రా చెప్పారు. కాలుష్య ప్రస్తావన రాగానే ఆందోళన.. న్యాయమూర్తి అరుణ్ మిశ్రా, న్యాయమూర్తి వినీత్ సరన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉదయం కోర్టు నంబర్లో ఆరులో ఉన్నపుడు నగరంలో కాలుష్యం విషయం ప్రస్తావనకు వచ్చింది. కోర్టు రూముకు వస్తూనే న్యాయమూర్తి మిశ్రా అక్కడే ఉన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో నగరంలో కాలుష్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. కాలుష్య తీవ్రత కారణంగా ఆస్తమా వంటి సమస్యలున్న వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టు గదిలో ఉన్న మరో న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, నగరంలో శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న ఫుట్ బాల్ కీడ్రాకారులకు ప్రతి రోజు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నగరంలో స్మాగ్ కారణంగా వారికి ఈ పరీక్షలు జరుపుతున్నారు. రాజధానిని పలకరించిన వర్షం న్యూఢిల్లీ : ఢిల్లీ–ఎన్సీఆర్లో కొన్ని చోట్ల మంగళవారం ఉదయం చిరుజల్లు కురిసింది. కనీస ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి 14.2 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. నగరంలో వాయు కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో కొనసాగింది. నిర్మాణ కార్యకలాపాలపై, నగరంలో ట్రక్కుల ప్రవేశం విధించిన నిషేధాన్ని ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ (ఈపీసీఏ)ఎత్తివేసింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్మాణ కార్యకలాపాలు జరపవచ్చని ఈపీసీఏ పేర్కొంది. రాత్రి వేళ గాలిలో కాలుష్యాల వ్యాప్తి తక్కువగా ఉండడం వల్ల అవి కదలడం లేదని అందువల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే నిర్మాణ కార్యకలాపాలను అనుమతించాలని ఈపీసీఏ పేర్కొంది. ట్రక్కుల ప్రవేశాన్ని కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతించాలని ఈపీసీఏ భావించినప్పటికీ నగరరోడ్లపై ట్రాఫిక్ దృష్ట్యా పగటి పూట వాటిని అనుమతించడం సాధ్యం కాదని ట్రాఫిక్ పోలీసులు తెలియచేయడంతో రాత్రి పూటనే వాటిని అనుమతించాలని ఈపీసీఏ పేర్కొంది. నగరంలో కాలుష్యం పెరగడంతో ఈ నెల 1 నుంచి 12 వరకు నగరంలో నిర్మాణపనులపై నిషేధం విధించారు. అలాగే నవంబర్ 8 నుంచి 12 వరకు ట్రక్కుల ప్రవేశంపై నిసేధం కొనసాగింది. -
అరుణ్ చిటికేస్తే.. బడా లాయర్ల క్యూ!
సోలీ సొరాబ్జీ, హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి.. వీళ్లంతా దేశంలోనే పెద్దపెద్ద లాయర్లు. గంటకు లక్షల్లో ఫీజులు తీసుకునే స్థాయి వాళ్లది. అలాంటి పెద్ద లాయర్లంతా కలిసి ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? ఉత్తరప్రదేశ్‌లో లంచాలతో కోట్లాది రూపాయల సొమ్ము వెనకేసి, లెక్కలేనన్ని నకిలీ బ్యాంకు అకౌంట్లు కలిగిన ఓ అధికారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్లో చీఫ్ ఇంజనీర్ అయిన అరుణ్ మిశ్రాను కాపాడేందుకు గత మూడేళ్లుగా సుప్రీంకోర్టులోను, అలహాబాద్ హైకోర్టులోను ఇలాంటి పెద్ద పెద్ద లాయర్లంతా తమ వాదనలు వినిపించారు. ఆయనకు ఎంత పెద్ద జీతం వస్తుందో అనుకుంటాం కదూ.. కానీ అది నెలకు లక్ష రూపాయలు మాత్రమే. ఒక రోజుకు 5 లక్షల నుంచి 25 లక్షల వరకు వసూలుచేసే లాయర్లను మరి ఈయన ఎలా భరిస్తున్నాడంటే.. అంతా లంచాల మహిమ. 2011 సంవత్సరంలో ఈడీ అధికారులు ఢిల్లీ పృథ్వీరాజ్ రోడ్డులోని లూటైన్స్ జోన్, డెహ్రాడూన్ ప్రాంతాల్లోని ఆయన ఆస్తులపై దాడులు చేశారు. పృథ్వీరాజ్ రోడ్డులోని ఆస్తి అజంతా మర్చంట్స్ అనే కంపెనీ పేరుమీద ఉంది. అందులో అరుణ్ భార్య, తండ్రి డైరెక్టర్లు. ఆ భవనం విలువ ఒక్కటే దాదాపు రూ. 300 కోట్లు. యూపీఎస్ఐడీసీ ఇండస్ట్రియల్ పార్కులో కూడా 60 ఎకరాల భూమి ఈయనకు ఉంది. అది కాక, మరో 52 ఎకరాల భూమి మరోచోట ఉంది. కోర్టు రికార్డుల ప్రకారమే చూసినా ఆయనకు, ఆయన కుటుంబానికి కలిపి లక్నో గోమతి రోడ్డులో రెండు బంగ్లాలు, డెహ్రాడూన్‌లో ఐదు ఆస్తులు, బారాబంకిలో 100 ఎకరాల భూమి ఉన్నాయి. 2011 నుంచి ఆయన మీద కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈలోపు ఆస్తుల విలువ మరింత పెరుగుతూ ఉంది. 1986లో యూపీఎస్ఐడీసీలో ఏఈగా చేరిన ఆయన.. 2002లో చీఫ్ ఇంజనీర్ అయ్యారు. ఆయన కంటే సీనియర్లు చాలామంది ఉన్నా, ఈయననే కార్పొరేషన్‌కు ఎండీగా చేశారు. ఫోర్జరీ డిగ్రీలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలతో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు 2014 ఆగస్టులో ఆయన ఉద్యోగం ఊడిపోయింది. ఆయన ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అప్పట్లో కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు న్యాయవాది శాంతిభూషణ్ ఢిల్లీ నుంచి అలహాబాద్‌కు వచ్చేవారు. సుప్రీంకోర్టులో వేర్వేరు దశల్లో సోలీ సొరాబ్జీ, హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ, గోపాల్ సుబ్రమణ్యం, నాగేశ్వర రావు, శాంతిభూషణ్ తదితరులు వాదించడంతో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో నెల రోజుల్లోనే అరుణ్ మిశ్రా మళ్లీ ఉద్యోగంలో చేరారు.