
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా
న్యూఢిల్లీ: గతవారం జరిగిన అంతర్జాతీయ న్యాయ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రధాని మోదీని ప్రశంసించడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీని జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశంసించడం అభ్యంతరకరమని పేర్కొంటూ ఒక తీర్మానం చేసినట్లు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు దుష్యంత్ దవే పేరుతో బుధవారం ప్రకటన వెలువడింది. జస్టిస్ మిశ్రా తీరును విమర్శిస్తూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. ప్రధానిని పొగడుతూ జస్టిస్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ స్వతంత్రత, నిష్పక్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. అయితే జస్టిస్ మిశ్రాను ఎస్సీబీఏ అధ్యక్షుడు విమర్శించడం హ్రస్వ దృష్టికి నిదర్శనమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ ఓ ప్రకటనలో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment