Dushyant Dave
-
విద్వేష ప్రసంగాలపై సీజేఐకి 76 మంది లాయర్ల లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ, హరిద్వార్‌లలో ఇటీవల జరిగిన ధర్మసంసద్ల సందర్భంగా పలువురి విద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ ఎన్వీ రమణకు 75మంది న్యాయవాదులు లేఖ రాశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రసంగించిన వారు సమాజంలో విద్వేషాలను ప్రేరేపించడమే కాదు, ఒక మతానికి చెందిన వారందరినీ చంపేయాలని బహిరంగంగా పిలుపునిచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రసంగాలు దేశ సమగ్రత, ఐక్యతలకు గొడ్డలిపెట్టుగా మారడమే కాదు, లక్షలాది ముస్లిం పౌరుల జీవితాలను ప్రమాదంలో పడవేశాయన్నారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో సీనియర్ లాయర్లు సల్మాన్ ఖుర్షీద్, దుష్యంత్ దవే, మీనాక్షి అరోరా ఉన్నారు. -
ప్రజాక్షేత్రంలో చెల్లక కోర్టుకెక్కారు
సాక్షి, అమరావతి: ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే నివేదించారు. అందులో భాగంగానే ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ) ఏర్పాటును సవాలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ఇలాంటి వ్యాజ్యాలను దాఖలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ కారణాలతో ప్రభుత్వ విధాన నిర్ణయాలను అడ్డుకునే దిశగా దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలను ఆదిలోనే కొట్టివేయాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వొద్దంటూ బ్యాంకులకు లేఖలు రాస్తున్నారని, తద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని న్యాయస్థానానికి నివేదించారు. రుణాలు కొత్తేమీ కాదు.. ఆస్తులపై హక్కులను బదలాయించి రుణాలు తీసుకోవడం కొత్తేమీ కాదని, కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో ఏకంగా ఓ పథకాన్ని అమల్లోకి తెచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఆ ఆస్తులపై యాజమాన్య హక్కులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని, పిటిషనర్లు వాస్తవాలను తెలుసుకోకుండా రాజకీయ కారణాలతో రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలన్నీ సంచిత నిధికే జమ అవుతాయని, ఆ తరువాతే అవి ఏపీఎస్డీసీకి వెళతాయన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల గవర్నర్ సార్వభౌమత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లడం లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని నివేదించడంతో హైకోర్టు అందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ పేరా? ఏపీఎస్డీసీ చట్టబద్ధతపై విజయవాడకు చెందిన కన్నెగంటి హిమబిందు, ఏపీఎస్డీసీకి ఆదాయాల బదలాయింపుపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, బ్యాంకులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎస్క్రో ఒప్పందాన్ని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన వెంకట గ్రీష్మ కుమార్‌లు వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై సీజే ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాలపై విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం విశాఖపట్నంలోని పలు ప్రభుత్వ ఆస్తులను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ వద్ద తనఖా పెట్టి భారీ రుణం పొందిందని వెలగపూడి తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కున్న రక్షణను తొలగించి ఆయన సార్వభౌమత్వం విషయంలో ప్రభుత్వం రాజీపడిందన్నారు. గవర్నర్‌పై కేసులు, పిటిషన్లు వేసే విధంగా బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ అసలు ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. వీటిని మొగ్గలోనే తుంచేయాలన్నారు. ఈ వ్యాజ్యాల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ గవర్నర్ సార్వభౌమత్వం విషయంలో ఎలా రాజీపడతారని ప్రశ్నించింది. ఒప్పందంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరును ఎలా ప్రస్తావిస్తారని, ఎల్లకాలం ఆయనే కొనసాగరు కదా? అని పేర్కొంది. రుణాల విషయంలో గవర్నర్ పేరును చేర్చడం సరికాదని సూచిస్తూ దీనిపై తమకు స్పష్టతనివ్వాలని ఆదేశించింది. ఇందుకు దవే సమాధానమిస్తూ ప్రభుత్వ కార్యనిర్వాహక నిర్ణయాలు, ఒప్పందాలు అన్నీ గవర్నర్ పేరు మీదే జరుగుతాయని, ఇదేమీ కొత్త కాదని వివరించారు. అన్ని వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని నివేదించడంతో మూడు వ్యాజ్యాల్లో విచారణను ధర్మాసనం ఈ నెల 21కి వాయిదా వేసింది. కౌంటర్ల దాఖలు తరువాత మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయాన్ని పరిశీలిస్తామంది. -
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశంసించింది. సీబీఎస్ఈ పరీక్షల రద్దు అంశంపై విచారణ సందర్భంగా.. ఏపీ పరీక్షల రద్దు విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాది దవే మాట్లాడుతూ..''ఎన్నికల ర్యాలీలు, సభలు జరిగాయని సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. గురువారం సుప్రీం విచారణ అనంతరం ముఖ్యమంత్రి వెంటనే పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణకు సిద్ధమైనప్పటికి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేశాము. పది రోజుల్లో హైపవర్ కమిటీ అసెస్మెంట్ స్కీమ్‌ను రూపొందించి జూలై 31 లోపు ఫలితాలను ప్రకటిస్తుంది. దేశం మొత్తం ఒక వైపు ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక మార్గంలో వెళ్ళలనుకోవడం లేదని తాము భావించాము.. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కుంభ మేళాలో జరిగిన దానికి ఎవరూ బాధ్యత తీసుకోలేదంటూ'' ఆయన తెలిపారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
ప్రధానిని పొగడడంపై లాయర్ల సంఘాల్లో విభేదాలు
న్యూఢిల్లీ: గతవారం జరిగిన అంతర్జాతీయ న్యాయ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రధాని మోదీని ప్రశంసించడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీని జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశంసించడం అభ్యంతరకరమని పేర్కొంటూ ఒక తీర్మానం చేసినట్లు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు దుష్యంత్ దవే పేరుతో బుధవారం ప్రకటన వెలువడింది. జస్టిస్ మిశ్రా తీరును విమర్శిస్తూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. ప్రధానిని పొగడుతూ జస్టిస్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ స్వతంత్రత, నిష్పక్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. అయితే జస్టిస్ మిశ్రాను ఎస్సీబీఏ అధ్యక్షుడు విమర్శించడం హ్రస్వ దృష్టికి నిదర్శనమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ ఓ ప్రకటనలో అన్నారు. -
మాల్యా కేసు : సంచలన విషయాలు
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి, విదేశాల పారిపోయిన విజయ్ మాల్యా వ్యవహారంలో రోజుకో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న కాక మొన్న తాను దేశం విడిచి వెళ్లిపోవడానికి కంటే ముందు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసినట్టు మాల్యానే సంచలన విషయం వెల్లడించగా... నేడు టాప్ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దావే కూడా కీలక విషయాలను తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఫిర్యాదు ఫైల్ చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతోనే, మాల్యా దేశం విడిచిపోయినట్టు పేర్కొన్నారు. అసలేం జరిగింది...? విజయ్ మాల్యా భారత్ విడిచి పారిపోవడానికి కంటే సుమారు ఒక నెల ఉమందు, ఈ లిక్కర్ టైకూర్ రూ.2000 కోట్లకు పైగా రుణాలను తమకు చెల్లించాల్సి ఉందని ఎస్బీఐ ప్రకటించింది. డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు సమర్పించే క్రమంలో ఈ విషయాలను వెల్లడించింది. విజయ్ మాల్యా, ఆయన కంపెనీల రుణాల ఎగవేతను ఈ ట్రిబ్యునల్ విచారిస్తోంది. 14 బ్యాంక్‌లను నిర్వహించే కన్సోర్టియం ఎస్బీఐ ట్రిబ్యునల్‌కు ఈ వివరాలను సమర్పించింది. 2016 జనవరి 31 వరకు మాల్యా ఎస్బీఐకు రూ.2,043 కోట్ల రుణాలు బాకీ ఉన్నారని, మొత్తంగా బ్యాంకులకు రూ.6,963 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. కొన్ని వారాల తర్వాత అంటే ఫిబ్రవరి 28న టాప్ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దావే, సీనియర్ ఎస్బీఐ అధికారులతో భేటీ అయ్యారు. మాల్యా, ఆయన కంపెనీల రుణాల వ్యవహారంలో వెంటనే సమావేశం కావాలని ఎస్బీఐ అధికారులు కోరడంతో, ఈ భేటీ నిర్వహించారు. ఆ మీటింగ్ న్యూఢిల్లీలోని దావే ఇంట్లో జరిగింది. గంట పాటు జరిగిన సమావేశంలో మాల్యా భారత్ విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఎస్బీఐ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మాల్యా పారిపోకుండా ఉండాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలని, తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 29న సుప్రీంకోర్టులో అతను భారత్‌ను వీడకుండా ఉండేందుకు ఓ ఫిర్యాదు దాఖలు చేయాలని దవే సూచించారు. అప్పటి ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య కూడా తన సూచనకు అంగీకారం తెలిపినట్లు దావే వెల్లడించారు. అయితే ఆమె ఈ సమావేశంలో పాల్గొన్నారో.. లేదో దుష్యంత్ స్పష్టం చేయలేదు. ఆ తర్వాత రోజు దవే సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడి టాప్ ఎస్బీఐ అధికారులెవరూ రాలేదు. మాల్యా భారత్ వీడకుండా ఉండేందుకు పిల్‌నూ దాఖలు చేయలేదు. రెండు రోజుల అనంతరం అంటే మార్చి 2న విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాల్యా భారత్‌కు రాలేదు. ప్రస్తుతం లండన్‌లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు. ‘నేను ఎస్బీఐ అధికారులకు సూచించిన తర్వాత ఏదో జరిగింది, దానిలో ఏం అనుమానం లేదు’ అని దవే ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దవే స్టేట్మెంట్లపై ఎస్బీఐ మాజీ చీఫ్ అరుంధతీ భట్టాచార్యా స్పందించారు. దీనిపై ఎస్బీఐ అధికార ప్రతినిధి స్పందిస్తారు.తాను స్పందించదలుచుకోలేదని.. ప్రస్తుత యాజమాన్యాన్ని సంప్రదించాలని భట్టాచార్య సూచించారు. మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసుల విషయంలో తమ అధికారులు అలసత్వం ప్రదర్శించారని వస్తున్న ఆరోపణలను ఎస్బీఐ ఖండించింది. ఎగవేత మొత్తాలను రికవరీ చేసుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పింది. టైమ్ లైన్.... 2016 జనవరి 31 : రూ.2000 కోట్లకు పైగా రుణాలను విజయ్ మాల్యా కలిగి ఉన్నట్టు ఎస్బీఐ ప్రకటన 2016 ఫిబ్రవరి 28 : మాల్యా రుణాల విషయంపై న్యాయవాది దుశ్యంత్ దవేతో టాప్ ఎస్బీఐ అధికారుల భేటీ 2016 ఫిబ్రవరి 28 : మాల్యా భారత్‌ను వీడి వెళ్లకుండా ఉండేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించమని సూచన 2016 ఫిబ్రవరి 29 : దవే సుప్రీంకోర్టుకు హాజరు, కానీ ఎస్బీఐ అధికారులు మాత్రం రాలేదు 2016 మార్చి 2 : విజయ్ మాల్యా భారత్‌ను వీడారు. -
‘స్పీకర్‌ది తప్పు.. సీఎంను మార్చాలన్నారంతే..’
-
‘స్పీకర్‌ది తప్పు.. సీఎంను మార్చాలన్నారంతే..’
మద్రాస్ : పద్దెనిమిదిమంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ అనర్హత వేటు వేయడం సహజ న్యాయానికి విరుద్ధం అని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ తరుపు న్యాయవాది దుష్యంత్ దవే బుధవారం మద్రాస్ హైకోర్టుకు విన్నవించారు. ఎమ్మెల్యేలు పార్టీకి విరుద్ధంగా ఏమీ చేయలేదని, వారు కేవలం నాయకత్వ మార్పును మాత్రమే కోరుకున్నారని, అవినీతిపరుడైన పళనీస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని అడిగారని, ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాదని చెప్పారు. దినకరన్ వైపు ఉండిపోయిన అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ వేలు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తొలుత దినకరన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. కోర్టుకు ఆయన ఏం చెప్పారంటే.. ‘18మంది ఎమ్మెల్యేలపై వేలు వేస్తు తమిళనాడు స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సహజ న్యాయానికి విరుద్థం. పార్టీకి విరుద్ధంగా ఎమ్మెల్యేలు ఏం చేయలేదు. వాళ్లు నాయకుడిని మాత్రమే మార్చాలని కోరారు. వారు వేరే పార్టీలోకి వెళ్లలేదు.. దీని ప్రకారం వారి చర్య పార్టీ ఫిరాయింపు పరిధిలోకి రాదు. గవర్నర్‌కు వారు ఇచ్చిన లేఖలో కూడా ముఖ్యమంత్రిని మార్చాలనే అడిగారు. ఆ పద్దెనిమంది ఎమ్మెల్యేలకు కనీసం సమయం కూడా ఇవ్వలేదు. మూడు వారాల్లో త్వరత్వరగా మొత్తం కానిచ్చేశారు. ఎమ్మెల్యేలపై వేటు వేశారు’ అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం స్పీకర్ తరుపు న్యాయవాది వాదనలు చేస్తూ స్పీకర్ నిర్ణయం సరైనదే అన్నారు. చట్టప్రకారమే ఆయన వ్యవహరించారని తెలిపారు.