తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేటకు చెందిన కోరం జయరాం, ఆయన తండ్రి నాగేశ్వరావులు కారులో వెళ్తుండగా రామచంద్రాపురం వద్ద ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులోని ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. జయరాం తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం ఎస్సీ సెల్ అద్యక్షుడిగా పనిచేస్తున్నారు.
Published Fri, Mar 2 2018 7:52 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement