టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తన ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారని స్వయంగా అతడి భార్య హర్షితా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు సామ్రాట్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిని మియాపూర్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాల జారీ చేశారు. మరోపక్క తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సామ్రాట్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై కోర్టు నిర్ణయం బుధవారానికి వాయిదా పడింది. దాంతో సామ్రాట్‌ను పోలీసులు జైలుకు తరలించారు.
తన భర్త సామ్రాట్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ గతంలో హర్షితారెడ్డి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో తన ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారు, ఇతర వస్తువుల్ని చోరీ చేశారనే ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు సామ్రాట్‌పై ఐపీసీలోని 380,427ఆర్/డబ్ల్యూ, 201 సెక్షన్ల కింద కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.