పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలను సొంత పార్టీ కార్యకర్తలే గాడిదలపై ఊరేగించిన ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. గత మంగళవారం బనీపార్క్‌లోని బీఎస్పీ కార్యాలయం ముందు పార్టీ నేషనల్ కోఆర్టీనేటర్ రామ్‌జీ గుప్తా, మాజీ ఇంచార్జ్ సీతారాంలను కార్యకర్తలు చుట్టుముట్టారు. వారి ముఖాలకు నల్లరంగు పులిమి, మెడలో చెప్పుల దండ వేశారు.అనంతరం గాడిదలపై ఊరేగించారు.