Bahujana Samaj Party
-
పార్టీ లీడర్లను గాడిదలపై ఊరేగించిన కార్యకర్తలు
-
పార్టీ లీడర్లను గాడిదలపై ఊరేగించిన కార్యకర్తలు
జైపూర్ : పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలను సొంత పార్టీ కార్యకర్తలే గాడిదలపై ఊరేగించిన ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. గత మంగళవారం బనీపార్క్‌లోని బీఎస్పీ కార్యాలయం ముందు పార్టీ నేషనల్ కోఆర్టీనేటర్ రామ్‌జీ గుప్తా, మాజీ ఇంచార్జ్ సీతారాంలను కార్యకర్తలు చుట్టుముట్టారు. వారి ముఖాలకు నల్లరంగు పులిమి, మెడలో చెప్పుల దండ వేశారు.అనంతరం గాడిదలపై ఊరేగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తోన్న కార్యకర్తలను కాదని వలస వచ్చిన వారికి టికెట్లు కేటాయించారని ఆరోపించారు. డబ్బులకు టికెట్లు అమ్ముకొని కార్యకర్తలను మోసం చేశారని మండిపడ్డారు. తమ గోడును అధినేత్రి మాయావతికి తెలియనీయకుండా చేశారని ఆరోపించారు. ఎన్నిసార్లు అడిగినా మాయావతికి దగ్గరకు పంపించలేదని, అందుకే తాము ఈ చర్యలకు పాల్పడ్డామని చెప్పారు. కాగా ఈఘటనపై మాయావతి స్పందించారు. పార్టీ నేతలు ఇలా చేడయం సిగ్గుచేటని, ఈ ఘటనపై విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
జేజేపీ–బీఎస్పీ పొత్తు
న్యూఢిల్లీ: హరియాణాలో మరో పొత్తు విరిసింది. త్వరలో అక్కడి అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రకటించాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న 90 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 50 స్థానాలు, జేజేపీ 40 స్థానాల్లో పోటీ పడనున్నాయి. ఆదివారం విలేకరుల సమావేశంలో జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రాతో కలిసి పొత్తును ప్రకటించారు. ఇరు పార్టీల అగ్ర నాయకులు పలుమార్లు చర్చించిన తర్వాత పొత్తు నిర్ణయం జరిగిందని దుష్యంత్ తెలిపారు. తమ కూటమి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించబోతోందని సతీశ్ చంద్ర వ్యాఖ్యానించారు. ఐఎన్ఎల్డీ అధినేత ఓంప్రకాశ్ చౌతాలాతో విభేదించి ఆయన ఇద్దరు కుమారులు అజయ్, అభయ్ బయటకు వచ్చేశారు. తన కుమారుడు దుష్యంత్‌తో కలిసి అజయ్ జేజేపీని స్థాపించారు. మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఐఎన్ఎల్డీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు, జేజేపీ–బీఎస్పీ కూటమి సత్తా చాటాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. -
టీఆర్ఎస్ గాలం?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యేలు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పలను పార్టీలో చేర్చుకునే అంశంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. టీఆర్ఎస్కు అనుబంధ సభ్యులుగా కొనసాగేందుకు ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే సుముఖంగా ఉన్నప్పటికీ, ఏకంగా పార్టీలోనే చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు జిల్లాలో పార్టీ కీలక నేత జోగు రామన్నకు ఈ బాధ్యతలు అప్పగించిన ట్లు తెలుస్తోంది. ఆయన ఈ ఇద్దరు సభ్యులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ, అధినేత కేసీఆర్ మాత్రం కలిసొచ్చే అన్ని పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతు పొందిన టీఆర్ఎస్ ఈ ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలను ఏకంగా పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న పక్షంలో స్థానికంగా అసంతృప్తులను సర్ది చెప్పాలనే యోచ నలో అధినాయకత్వం ఉంది. ఈ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని నియోజకవర్గ ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యేల తర్జనభర్జన పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగాలా? టీఆర్ఎస్లో చేరే అంశంపై బీఎస్పీ ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. పార్టీ మారిన పక్షంలో అనర్హత వేటు.. వంటి న్యాయపరమైన చిక్కులు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అనుబంధ సభ్యులుగా ఉంటూ.. రానున్న రోజుల్లో ఉండే రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే యోచనలో ఈ ఇద్దరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం మంత్రి పదవి ఆశిస్తున్న ట్లు ప్రచారం జరుగుతోంది. సర్కారులో బెర్తు దక్కిన పక్షంలో పార్టీలో చేరడం ఖాయమనినే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. వీరు బీఎస్పీ నుంచి పోటీ చేసినప్పటికీ, తమ వ్యక్తిగత చరిష్మాతోనే విజయం సాధించారు. అలాగే కోనప్ప కూడా ప్రాదేశిక ఎన్నికల్లో తమ అనుచరులను బరిలోకి దింపి, నియోజకవర్గంలో రెండు మండలాల్లో అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలిపించుకున్నారు. పార్టీ మారే విషయమై ఈ నేతలను సంప్రదించగా ఇప్పటి వరకు అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.