భారత్ ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. భారత పైలట్ విక్రమ్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ చెర నుండి విడిపించడానికి అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిగా చేస్తూ ఒత్తిడి చేయడంలో భారత్ పైచేయి సాధించింది. విక్రమ్ అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, కుదరలేదని పేర్కొన్నారు. శాంతి చర్యల్లో భాగంగా అభినందన్‌ను విడుదల చేస్తామని తెలిపారు.