వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మ.1.49గంటలకు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం10గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా ఇక్కడకు చేరుకుంటారు. స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం నామినేషన్ పూర్తయ్యాక హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్తారని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు.