సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పి, ప్రజలను మోసం చేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘అయిదేళ్ల చంద్రబాబు పాలన చూశారు. ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు చూశారు. కులానికో ఓ పేజీ చొప్పున హామీ ఇచ్చి... ఏ విధంగా మోసం చేశారో చూశారు.