చదువుకోవడం పిల్లల హక్కు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిఅన్నారు. విద్యాహక్కు చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. చదువు అనేది పేదరికం నుంచి బయటపడేసే ఆయుధమని తెలిపారు. సోమవారం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకు ముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో 33 శాతం మంది నిరాక్ష్యరాసులు ఉన్నారని..