వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో సన్న బియ్యం అన్న మాటే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పని పనులను కూడా ప్రభుత్వం చేస్తోందని గుర్తుచేశారు. మంగళవారం అసెంబ్లీలో నాణ్యమైన బియ్యం సరఫరాపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తొలుత బియ్యం గురించి నాలెడ్జ్ పెంచుకొవాలని టీడీపీ సభ్యులకు సూచించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు కొడతారేమోనని టీడీపీ ఆన్‌లైన్‌లో పెట్టిన మేనిఫెస్టోను తీసివేసిందని విమర్శించారు.