‘చంద్రబాబు పౌరుషం, రోషం అంటూ తనకు సూట్ కానీ మాటలు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. కేసీఆర్, జగన్‌కు పొత్తుంది అని దుష్ప్రాచారం చేస్తున్నారు. మాకు ఏ పార్టీతోననూ పొత్తు లేదు కానీ, హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కనే ఉంచుకుని కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడింది ఈ చంద్రబాబు నాయుడు కాదా?. అప్పుడు చంద్రబాబు పౌరుషం చచ్చిపోయిందా?. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండా కొడుకుని ఎమ్మెల్సీని చేశారు... మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు పౌరుషం నిద్రపోయిందా?. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, అధికారాన్ని కబ్జా చేసిన చంద్రబాబు. దానిని పౌరుషం అంటారా?. పిల్లి గట్టిగా పౌరుషం ఉందని అరిస్తే పులి అయిపోతుందా?.