రాష్ట్రాభివృద్ధికి ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మరో కీలకమైన ముందడుగు వేసింది. ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు కూడా ఇచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఇదే తొలి అవిశ్వాస తీర్మానం కావడం గమనార్హం