Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan to Meet with Local Government Representatives on April 21
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్‌ భేటీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గట్టిగా నిలబ­డిన ప్రజా ప్రతినిధులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నా­ప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బం­దులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో 8 నియోజకవర్గాల్లోని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీ­టీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్టెడ్‌ సభ్యులు హాజరవుతారు. ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజా­స్వామిక పరిణామాలపై చర్చించడంతోపాటు, భవిష్యత్‌ కార్యాచరణపైనా ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతిని«ధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం⇒ వచ్చే వారం స్వయంగా నేనే వస్తా⇒ టీడీపీ ఎమ్మెల్యే బంధువుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య ⇒ కుటుంబానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ⇒బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైఎస్సార్‌సీపీ అధినేత సాక్షి, అమరావతి/రామగిరి: ‘ఏమాత్రం అధైర్యప­డొద్దు.. మీ కుటుంబానికి పూర్తిగా అండగా నిలు­స్తాం.. అన్ని విధాలా ఆదుకుంటాం.. వచ్చే వారం స్వయంగా నేనే వస్తా’ అని వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియో­జకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డి­పల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధు­వుల చేతిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగ­మయ్య కుటుంబాన్ని మంగళవారం ఆయన ఫోన్‌లో పరామర్శించారు.లింగమయ్య భార్య రామాం­జినమ్మ, కుమా­రులు మనోహర్, శ్రీని­వాసులతో మాట్లాడారు. లింగమయ్య హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ‘సార్‌.. రామగిరి మండలంలో రాక్షసపాలన కొనసాగుతోంది. పరిటాల సునీత నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఇక్కడి పోలీసులు పరిటాల కుటుంబ సభ్యు­లకు తొత్తులుగా మారారు. వైఎస్సార్‌సీపీ నాయ­కులు, కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం రామగిరి ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటిపై పరిటాల సునీత సమీప బంధువులైన ధర్మవరపు ఆదర్శ్‌నాయుడు, ధర్మవ­రపు మనోజ్‌ నాయుడు దాడులకు దిగారు. వారిని మా నాన్న అడ్డుకో­బో­యాడు. దీంతో కక్ష కట్టి వైఎస్సార్‌సీపీకి అనుకూ­లంగా ఉన్నారంటూ పండుగ వేళ ఇంట్లో ఉన్న మాపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనలో నాన్న లింగమయ్య మృతి చెందాడు’ అంటూ కుమారులు మనోహర్, శ్రీనివాసులు... మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. మీరు అధైర్య పడొద్దని, పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని, ఆదుకుంటుందని లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలు, లీగల్‌సెల్‌ను అప్రమత్తం చేస్తామని, వారు తగిన రక్షణ కల్పిస్తారన్నారు. ‘మీ కుటుంబానికి ఏం జరిగినా చూస్తూ ఊరుకోం. పూర్తి అండగా నిలుస్తాం. అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఏ మాత్రం భయపడొద్దు. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు.

Waqf Bill Discussion In Lok Sabha NDA-INDIA Live Updates2
లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం: మిథున్‌ రెడ్డి

Waqf Bill In Lok sabha Updates..వైఎస్సార్‌సీపీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి కామెంట్స్‌..ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాంలోక్‌సభ, రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాంమైనారిటీ సమాజానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్‌ ప్రకటించారుముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారు చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారుఅన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలిముస్లింల ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరంవక్ఫ్‌ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉందిఇదిలాగే కొనసాగితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉంది 👉నేడు లోక్‌సభలో కీలకమైన వక్ఫ్‌(సవరణ) బిల్లుపై చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్‌(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు.👉తాజాగా కాంగ్రెస్ ఎంపీ, జేపీసీ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము నిజం చెప్పాలనుకుంటున్నాను. ముస్లింలకు ఏమీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రభుత్వానికి వాటా ఉన్న ప్రభుత్వ ఆస్తి వివాదాస్పదమని, నియమించబడిన అధికారి దర్యాప్తు చేసే వరకు ఆ ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించబోమని, వివాదాస్పద ఆస్తి ఇకపై వక్ఫ్‌గా ఉండదని వారు నిబంధన చేశారు’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayCongress MP and JPC member Imran Masood says, "We are ready for discussion. But I want to tell you the truth. The government is repeatedly saying that nothing will happen to Muslims, but they have made a… pic.twitter.com/ZULzEi1RzT— ANI (@ANI) April 2, 2025👉 ఇక, బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్‌(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్‌ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు.👉బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆయా పార్టీలు విప్‌ జారీ చేశాయి. వక్ఫ్‌ (సవరణ) బిల్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు.👉ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయించారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 298 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి. ఏమిటీ వివాదం? 👉వక్ఫ్‌ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్‌ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం.👉ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్‌ ఆస్తినీ సెంట్రల్‌ పోర్టల్లో విధిగా నమోదు చేయించాలి.👉ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్‌ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి.

Megaquake is a Massive Earthquake Coming will 300000 People die3
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?

న్యూఢిల్లీ: భవిష్యత్‌లో మహా భూకంపం (Mega quake) రానుందా? దీని తీవ్రతకు 3,00,000 మంది ప్రాణాలు కోల్పోనున్నారా? లెక్కలేనన్ని నగరాలు సముద్రంలో మునిగిపోతాయా? ఈ సామూహిక విధ్వంసానికి సమయం ఆసన్నమయ్యిందా?.. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రశ్నలకు ‘అదే జరగవచ్చు’ అంటూ జపాన్‌ తన అంచనాలను, భవిష్యవాణిని వెల్లడించింది. ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్‌ (Agence France-Presse) (ఏఎప్‌పీ) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసింది. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుంది.ఇటీవల మయన్మార్‌ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను మరువక ముందే జపాన్‌ మహాభూకంపం అంచనాలను చెప్పడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు.జపాన్ ప్రభుత్వం (Japanese Government) తమ దేశ పసిఫిక్ తీరంలో వినాశకరమైన మెగా క్వేక్ సంభవించవచ్చని తెలిపింది. దీని కారణంగా సునామీ వస్తుందని, ఇదే జరిగితే జపాన్‌లో లక్షలాది మంది ప్రజలు కొన్ని నిమిషాల్లోనే మృత్యువాత పడతారని పేర్కొంది. మృతదేహాలను లెక్కించడం కూడా కష్టమయ్యేంత విధ్వంసం జరుగుతుందని అంచనా వేసింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు నాశనమవుతుందని పేర్కొంది. అందుకే మెగా భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు వెల్లడించింది.భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. వార్తా సంస్థ ఏఎప్‌పీ నివేదిక ప్రకారం జపాన్‌లో 9 తీవ్రతతో భూకంపం సంభవిస్తే, 13 లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు. భవనాలు కూలిపోవడం వల్ల సుమారు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే జపాన్ ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు (అంటే రూ. 171 లక్షల కోట్లకు పైగా) నష్టపోతుంది. ఈ నష్టం నుండి కోలుకోవడం జపాన్‌కు చాలా భారంగా మారుతుంది.ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్‌

Rs 27 Cr for what Pant Slammed By Fans Sanjiv Goenka Animated Chat Viral4
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్‌ తీసుకున్న గోయెంకా!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant). ఐపీఎల్‌-2025 మెగా వేలంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ వికెట్‌ కీపర్‌ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ పంత్‌ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించింది.అయితే, లక్నో సారథిగా తొలి మ్యాచ్‌లోనే పంత్‌ విఫలమయ్యాడు. బ్యాటర్‌గా, వికెట్‌ కీపర్‌గా స్థాయికి తగ్గట్లు రాణించలేక.. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఇక రెండో మ్యాచ్‌లో మాత్రం పంత్‌కు ఊరట దక్కింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో లక్నో గెలుపొందడంతో అతడు తొలి విజయం అందుకున్నాడు. అయితే, సొంత మైదానంలో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది.పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సమిష్టి వైఫల్యం కారణంగా హోం గ్రౌండ్‌లో తొలి మ్యాచ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇప్పటి వరకు లక్నో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పంత్‌ బ్యాటర్‌గా విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.బ్యాటర్‌గా విఫలంతొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో పోరులో పదిహేను బంతుల్లో పదిహేను పరుగులు చేయగలిగాడు. ఇక తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండే పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పంత్‌ బ్యాటింగ్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రూ. 27 కోట్లు దండుగ!‘‘పంత్‌కు ఏమైంది? హ్యాట్రిక్‌ అట్టర్‌ఫ్లాప్‌లు.. రూ. 27 కోట్లు.. లక్నో బూడిదలో పోసినట్లే..’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పంత్‌పై భారీగా ట్రోలింగ్‌ జరుగుతోంది. మరోవైపు.. ప్రతి మ్యాచ్‌ తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా పంత్‌తో సంభాషిస్తున్న ఫొటోలు వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే.గట్టిగానే క్లాస్‌ తీసుకున్న గోయెంకాతాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌ తర్వాత కూడా గోయెంకా పంత్‌కు గట్టిగానే క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్‌ చేతులు కట్టుకుని నిలబడగా.. అతడి వైపు వేలు చూపిస్తూ మరీ గోయెంకా సీరియస్‌ అయిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోయెంకా తీరుపై కూడా ట్రోల్స్‌ వస్తున్నాయి. గతంలో కేఎల్‌ రాహుల్‌తో ఇలాగే వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.‘‘విజయాల కంటే కూడా ఇలాంటి వివాదాలతోనే హైలైట్‌ కావాలని చూసే ఓనర్‌ ఈయన ఒక్కడేనేమో! ప్రతి మ్యాచ్‌ తర్వాత ఇలా కెప్టెన్‌తో అందరి ముందే సంభాషిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా బిల్డప్‌ ఇవ్వడం ద్వారా ఏం నిరూపించాలనుకుంటున్నారు? డబ్బులు పెట్టి కొన్నంత మాత్రాన వారిని తక్కువ చేసి చూపడం సరికాదు’’ అంటూ హితవు పలుకుతున్నారు.ఐపీఎల్‌-2025: లక్నో వర్సెస్‌ పంజాబ్‌ స్కోర్లు👉వేదిక: భారత రత్న శ్రీ అటల్‌ బిహారి వాజ్‌పేయి ఏకనా క్రికెట్‌ స్టేడియం, లక్నో👉టాస్‌: పంజాబ్‌.. తొలుత బౌలింగ్‌👉లక్నో స్కోరు: 171/7 (20)👉పంజాబ్‌ స్కోరు: 177/2 (16.2)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్‌ గెలుపు👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (34 బంతుల్లో 69).చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌.. రోహిత్ శ‌ర్మ‌కు నో ఛాన్స్‌! కెప్టెన్‌ ఎవ‌రంటే?Statement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025

Child Death Over Bird Flu In AP Palnadu District5
ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. చిన్నారి మృతి

సాక్షి, పల్నాడు: ఏపీలో బర్డ్‌ఫ్లూ (హెచ్‌5ఎన్‌1) వైరస్‌ కారణంగా ఓ చిన్నారి చనిపోయింది. ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి నిర్ధారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నరసరావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పలు ఆరోగ్య సమస్యలు రావడంతో మార్చి నాలుగో తేదీన మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు బాలికకు ఆక్సిజన్‌ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో, మార్చి 16న సదరు చిన్నారి మృతిచెందింది.అయితే, చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్‌ నమూనాలను ఎయిమ్స్‌లోని వీఆర్‌డీఎల్‌లో పరీక్షించారు. ఈ పరీక్షలో ఇన్‌ఫ్లుయెంజా ఏ పాజిటివ్‌గా తేలింది. అనంతరం మరో నమూనాను 15న ఢిల్లీలో పరీక్షించారు. అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్‌.. 24న స్వాబ్‌ నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ)కి పంపించింది. అక్కడ హెచ్‌5ఎన్‌1 వైరస్‌గా నిర్ధారించారు. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు.చిన్నారి మృతి నేపథ్యంలో ఏం జరిగిందనే విషయాన్ని కుటుంబ సభ్యులను అడిగి వైద్యాధికారులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో సదరు చిన్నారి.. ఫిబ్రవరి 28న జ్వర లక్షణాలు కన్పించగా, అంతకు రెండు రోజుల ముందు పచ్చి కోడి మాంసం పట్టుకున్నట్టు, కొంచెం మాంసం తిన్నట్లు తెలిపారు. ఇక, పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ వైరస్‌ వ్యాప్తి లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు వివరించారు. బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటరు దూరంలో ఒకరు మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో పెంపుడు, వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారు చెప్పారు.ఇదిలా ఉండగా.. బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. మరోవైపు.. జబ్బు పడిన పక్షులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతోపాటు జలుబు, తీవ్రస్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలను బర్డ్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలని తెలిపారు.

Phone Tapping Case: Sravan Rao Second Round SIT Inquiry Updates6
ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ రావు.. నేడు రెండో రౌండ్‌ విచారణ

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు శ్రవణ్‌ రావు(Shravan Rao)ను సిట్‌ మరోసారి ప్రశ్నించనుంది. మూడు రోజుల కిందట విచారణకు హాజరైన ఆయన.. సుదీర్ఘంగా సాగిన విచారణలోనూ అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రావాలని దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శ్రవణ్‌ రావు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone Tapping Case)లో శ్రవణ్‌ రావు ఏ6గా ఉన్నారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో ఓ మీడియా సంస్థ అధినేత అయిన ఈయన సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. అయితే కిందటి ఏడాది మార్చిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే.. శ్రవణ్‌ రావు అమెరికా వెళ్లిపోయారు. ఇంతకాలం విచారణకు హాజరు కాకుండా వచ్చారు. తాజాగా.. అరెస్ట్‌ నుంచి సుప్రీం కోర్టు(Supreme Court)లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట పొందిన ఆయన.. దర్యాప్తుకు తప్పనిసరిగా సహకరించాలన్న షరతు మేరకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యారు. అయితే విచారణ టైంలో ఆయనను మీడియా కంటపడనీయకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కీలకంగా శ్రవణ్‌ రావుతొలుత నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సిరిసిల్ల డీసీఆర్‌బీ అప్పటి డీఎస్పీ ప్రణీత్‌రావు పేరు మాత్రమే ఉంది. దర్యాప్తు ముందుకెళ్తున్నకొద్దీ నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. ఈక్రమంలోనే శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఆయన సూచించారని అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Contract Employees layoffs at Vizag Steel Plant7
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపు జరిగింది. తాజాగా స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న మరో 1500 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్టీల్‌ సెక్రటరీ భేటీ అనంతరం కార్మికులను తొలగించడం గమనార్హం.వివరాల ప్రకారం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ మరో 1500 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగించారు. గతంలో 1100 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిన విషయం తెలిసిందే. కార్మికుల ఆందోళన కొనసాగుతున్నప్పటికీ తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నేడో, రేపో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు కార్మికులు. అయితే, స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం దాదాపు 4500 మందిని తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక, సీఎం చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం కార్మికుల తొలగింపు జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మిక సంఘాలు నేతలు మండిపడుతున్నారు.

Jr NTR Favourite Food and Restaurant in Hyderabad8
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్‌ ఎన్టీఆర్‌

అంతర్జాతీయ స్థాయి సక్సెస్‌లు అందుకుంటున్న టాలీవుడ్‌ (Tollywood)కు కేంద్ర బిందువు హైదరాబాద్‌. అలాంటి పరిశ్రమలో గ్లోబల్‌స్టార్స్‌గా పేరున్న అనేకమంది నటీనటులకు మన నగరం నిలయం. అయితే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న టాలీవుడ్‌ స్టార్స్‌ కూడా నగరంలోని కొన్ని రుచులకు దాసులే. వారు తమ అభి‘రుచుల్ని’ సంతృప్తి పరుచుకోడానికి నగరంలోని కొన్ని రెస్టారెంట్స్‌కి తరచూ రౌండ్స్‌ వేస్తుంటారు. అభిమానులకు చిక్కకుండా రహస్యంగా తమ టేస్ట్‌ బడ్స్‌ను శాంతింపజేస్తుంటారు. అదే విధంగా మన టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కి సైతం నగరంలో తనకు నచ్చిన, ఇష్టమైన వంటకాలు వడ్డించే రెస్టారెంట్స్‌ ఉన్నాయి.గత నెల్లో దేవర చిత్రాన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రమోట్‌ చేయడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) జపాన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం అక్కడి థియేటర్లలో సందడి చేస్తోంది. మరోవైపు తారక్‌ తిరిగి నగరానికి వచ్చేశారు. అయితే తారక్‌ జపాన్‌ టూరుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. ఆ ఇంటర్వ్యూలో నగరంలో తాను ఇష్టపడే రెస్టారెంట్స్‌ రుచుల వివరాలు ఆయన వెల్లడించడమే ఇందుకు కారణం.ఫ్రెండ్‌.. జపనీస్‌ ట్రెండ్‌.. నగరంలోని నాగ చైతన్య అక్కినేనికి చెందిన షోయు రెస్టారెంట్‌ ఎన్టీఆర్‌ ఎంచుకున్న మొదటి ఎంపిక. ‘ఈ అద్భుతమైన కళాత్మక ప్లేస్‌ నా స్నేహితుడు నాగ చైతన్య సొంతం. ఈ ప్రదేశంలో కొన్ని అద్భుతమైన జపనీస్‌ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా జపనీస్‌ వంటకమైన సుషీ అక్కడ సూపర్బ్‌. హైదరాబాద్‌లో జపనీస్‌ వంటకాలకు నేను జై కొట్టే ప్లేస్‌ అది. ఇది నిజంగా అంతర్జాతీయ వంటకాలకు కేరాఫ్‌’ అంటూ ఎన్టీఆర్‌ కొనియాడారు. మరికొన్ని ప్రదేశాలు.. జపనీస్‌ వంటకాలకు సంబంధించి తన ఫేవరెట్‌ను తెలియజేయడంతో పాటు అచ్చమైన హైదరాబాదీ వంటకాలకు సంబంధించి కూడా ఎన్టీఆర్‌ కొన్నింటిని పేర్కొన్నారు. తాను ఆస్వాదించే మరికొన్ని రుచుల కోసం.. పాతబస్తీలోని షాదాబ్, జూబ్లీహిల్స్‌లోని స్పైస్‌ వెన్యూ, తెలంగాణ స్పైస్‌ కిచెన్, పాలమూరు గ్రిల్, అమీర్‌పేట్‌లోని కాకతీయ డీలక్స్‌ మెస్‌ కూడా ఆయన ఎంచుకున్న నచ్చే రుచుల జాబితాలో ఉన్నాయి.చదవండి: పూరీ- విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్‌.. నటుడి ఆగ్రహం

India external debt stood at 717 billion USD as of December 20249
భారత్‌ విదేశీ రుణాల లెక్కలివే..

భారత్‌ విదేశీ రుణాలు (అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి రుణాలు, ఇతర రూపాల్లో సమీకరించినవి) 2024 డిసెంబర్‌ చివరికి 717.9 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.61.74 లక్షల కోట్లు) చేరాయి. 2023 డిసెంబర్‌ చివరికి ఇవి 648.7 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ‘క్వార్టర్లీ ఎక్స్‌టర్నల్‌ డెట్‌’ నివేదికలోని గణాంకాలు కింది విధంగా ఉన్నాయి.2024 సెప్టెంబర్‌ చివరికి ఇవి 712.7 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే అంతక్రితం త్రైమాసికంతో పోల్చి చూస్తే 0.7 శాతం.. ఏడాది క్రితం ఇదే కాలంతో పోల్చి చూస్తే 10 శాతం అధికమయ్యాయి. జీడీపీలో విదేశీ రుణాలు డిసెంబర్‌ చివరికి 19.1 శాతానికి చేరాయి. 2024 సెప్టెంబర్‌ చివరికి 19 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా రూపాయితోపాటు ఇతర ప్రధాన కరెన్సీలతో డాలర్‌ బలపడడం విదేశీ రుణ భారం విలువ పెరిగేందుకు దారితీసింది.ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..డాలర్‌ మారకంలో 54.8 శాతం..యూఎస్‌ డాలర్‌ మారకంలోని బకాయిలు మొత్తం విదేశీ రుణాల్లో 54.8 శాతంగా ఉన్నాయి. ఆ తర్వాత రూపాయి మారకంలో విదేశీ రుణాలు 30.6 శాతంగా ఉంటే, జపాన్‌ యెన్‌ మారకంలో 6.1 శాతం, స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) రూపంలో 4.7 శాతం, యూరో మారకంలో 3 శాతం చొప్పున ఉన్నాయి. మొత్తం విదేశీ రుణాల్లో నాన్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్స్‌కు సంబంధించి 36.5 శాతం మేర ఉన్నాయి. ఆ తర్వాత డిపాజిట్‌ స్వీకరించే కార్పొరేషన్లకు సంబంధించి 27.8 శాతం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 22.1 శాతం, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించి 8.7 శాతం చొప్పున ఉన్నాయి. విదేశీ మారకంలో చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో రుణాల రూపంలో 33.6 శాతం ఉంటే, కరెన్సీ, డిపాజిట్ల రూపంలో 23.1 శాతం, ట్రేడ్‌ క్రెడిట్, అడ్వాన్స్‌ల రూపంలో 18.8 శాతం, డెట్‌ సెక్యూరిటీల రూపంలో 16.8 శాతం చొప్పున ఉన్నాయి.

UP Sant Kabir Nagar Babloo And Radhika Episode Details10
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్‌ ఇచ్చిన రెండో అత్త

లక్నో: నాడు తన భార్య ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించిన భర్త వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రాధికకు రెండో భర్త వికాస్‌ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. ఈ క్రమంలో ఆమె అత్త.. కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ప్రేమకథ అనూహ్య మలుపు తిరిగింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్‌జాట్‌ గ్రామంలో తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్‌తో ఇటీవలే భర్త బబ్లూ పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందనే భయంతో బబ్లూ తన భార్యను ఆమె ప్రియుడికే కట్టబెట్టాడు. అయితే రాధికకు రెండో భర్త వికాస్‌ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది.ఈ సందర్భంగా రాధిక అత్త మాట్లాడుతూ..‘రాధిక భర్త, అతడి పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి, నేను చలించిపోయాను. అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపొమ్మని రాధికకు తేల్చి చెప్పాను’ అని వికాస్ తల్లి వెల్లడించింది. ఈ విషయంపై కటార్‌జాట్ గ్రామంలో మళ్లీ పంచాయతీ జరిగింది. బబ్లూ తన భార్య రాధికను చూసుకుంటాడని గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు. వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు. భవిష్యత్తులో రాధికకు ఏదైనా ప్రమాదం జరిగితే, దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వికాస్ తల్లి గొప్ప మనసు గురించి అంతటా చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement