Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YSRCP Sajjala Ramakrishna Reddy Teleconference With Party Leaders1
మన వాణిని బలంగా వినిపిద్దాం... ప్రజలను చైతన్యపరుద్దాం: సజ్జల

తాడేపల్లి: బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమానికి జిల్లా, నియోజవర్గ, మండల స్థాయి నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కూడా సక్సెస్‌ చేద్దామని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు(ఆదివారం, జూలై 27) వైఎస్సార్‌సీపీ నగర, మున్సిపల్‌ క్లస్టర్‌, మండల పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు సజ్జల,. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆగష్టు నెలాఖరికల్లా గ్రామస్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలి. మండల స్ధాయి నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలి. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి వైఎస్సార్సీపీని బలోపేతం చేద్దాం’ అని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సజ్జల ఏమన్నారంటే..బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం మండల స్ధాయిలో కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అయింది, ఇప్పుడు గ్రామాల్లోకి వెళుతున్నాం. మన నాయకుడు జగన్‌ తన పాలనలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలుచేసి, చక్కటి పాలన అందించారు, కానీ కూటమి ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పొలిటికల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సాగిస్తుంది. మనం ప్రజల పక్షాన నిలుచున్నాం, ప్రజల్లో వైఎస్సార్సీపీ అంటే ఒక నమ్మకం, భరోసా కల్పించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది, జగన్‌ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్షేత్రస్ధాయిలోకి వెళుతున్నారు. వారి ఫేక్‌ న్యూస్‌ను బలంగా తిప్పికొడదాంమండల స్ధాయి నుంచి గ్రామస్ధాయిలోకి మనం వెళుతున్నాం కాబట్టి మనం క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి, సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటూ మన వాణిని బలంగా వినిపిద్దాం. ప్రజలను చైతన్యపరుద్దాం. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఫేక్‌న్యూస్‌ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. దానిని బలంగా తిప్పికొడదాం.మండల స్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణంలో అవసరమైతే మరింత మందిని నియమించుకునే వెసులుబాటు కల్పించాం, మండల పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలి. నిర్ణీత కాలపరిమితిలోగా గ్రామాల్లో కూడా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పూర్తికావాలి. మన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. నియోజకవర్గ సమన్వయకర్తలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మండల, గ్రామ స్ధాయిలో ఉన్న సీనియర్‌ నాయకులను పరిశీలకులుగా నియమించుకుని గ్రామ కమిటీల నియామకం చేపట్టాలి. టాస్క్‌ఫోర్స్‌లాగా పనిచేసి పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలి. మండల స్ధాయిలో 22 అనుబంధ విభాగాలు ఉంటాయి, ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ నుంచి మండల స్ధాయి కమిటీలలో ప్రాతినిద్యం ఉండాలి. ఈ కార్యక్రమం ప్రతీ గడపకూ వెళ్లాలి..గ్రామస్దాయిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ప్రతి గడపకూ వెళ్ళాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం ఉంటుంది. గ్రామమంతా ప్రజల్లో చైతన్యం వచ్చేలా మన కార్యక్రమం ఉండాలి. ఆగష్టు నెలాఖరికల్లా గ్రామ కమిటీల నియామకాలు పూర్తవ్వాలని జగన్‌ చెప్పారు. కాబట్టి మనం దీనిపై సీరియస్‌గా దృష్టిపెడదాం. అంకితభావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ నియమావళికి లోబడి పార్టీ నిర్మాణంలో కష్టపడి పనిచేసేవారిని గుర్తించి తగిన విధంగా పదవులు ఇవ్వడం జరుగుతుంది. బూత్‌ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలిియోజకవర్గ ఇంఛార్జ్‌ బలోపేతం అయినప్పుడే పార్టీ బలపడుతుంది. గ్రామ స్ధాయి నుంచి మండల స్ధాయి తర్వాత నియోజకవర్గ స్ధాయిలో వేలాదిమంది వైఎస్సార్సీపీ సైన్యం సిద్దమవుతారు. అప్పుడు ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా వేలాదిమందితో మన గొంతు వినిపించినవారు మవుతాం. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చే సమాచారం ప్రతి ఒక్కరికీ చేరాలి, సాంకేతికతపై అవగాహాన ఉన్న ఉత్సాహవంతులైన యువతీ యువకులను వినియోగించుకుని మన నెట్‌వర్క్‌ పెంచుకుందాం. డేటా బిల్డింగ్‌, ప్రొఫైలింగ్‌ చేయగలిగితే లక్షలాదిమందికి మన సందేశం, సమాచారం క్షణాల్లో చేరుకుంటుంది. బూత్‌ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలి. పరిశీలకులు దీనిపై దృష్టిపెట్టాలి.మన నాయకుడు జగన్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువద్దాంకూటమి ప్రభుత్వ తప్పుడు కేసులకు ఎవరూ ఆందోళన చెందవద్దు, పార్టీ అండగా ఉంటుంది. అత్యంత కీలకమైన దశలో ఉన్నాం, మనం కమిటీలను పటిష్టంగా నియమించుకుంటే నియోజకవర్గంలో మన పార్టీ అంత బలపడుతుంది. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పార్టీ నిర్మాణం కోసం పనిచేసి మన నాయకుడు జగన్‌ , మన వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకువద్దాం’ అని సజ్జల స్పష్టం చేశారు.

Tata Consultancy Services To Cut 12 Thousand Jobs2
టీసీఎస్‌.. భారీగా లే ఆఫ్స్‌.. ఎవరిపై ప్రభావమంటే..!

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) భారీ లే ఆఫ్స్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు కారణంగా భారీ తొలగింపునకు టీసీఎస్‌ సన్నద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్‌ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగాల‍్లో 2 శాతం లే ఆఫ్స్‌ కు సిద్ధమైన విషయాన్ని కంపెనీ ఆదివారం స్పష్టం చేసింది. అంటే 12వేలకు పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోనన్నారు. ఇది మధ్యస్థంగా ఉన్న ఉద్యోగులతో పాటు సీనియర్‌ స్థాయిల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని టీసీఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ కె కృతివాసన్‌ స్పష్టం చేశారు. అయితే ఉద్యోగుల్ని తొలగించడం తమకు కూడా బాధగానే ఉందని, కాకపోతే మారిన టెక్నాలజీతో తొలగింపులు తప్పడం లేదన్నారు.కొత్త టెక్నాలజీల పరంగా చూస్తే ముఖ్యంగా ఏఐ ఆపరేటింగ్ మోడల్ మార్పులను గుర్తిస్తున్నాం. పని చేసే విధానాలూ మారుతున్నాయి. అందుకే భవిష్యత్తుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము ఏఐని ఉపయోగిస్తూ కావాల్సిన నైపుణ్యాలను మెరుగుపరిచే పనిలో ఉన్నాం. మా కంపెనీ విస్తరణ అవకాశాలను మెరుగుపరిచేందుకు ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టాం. కానీ, పలు విభాగాల్లో వృద్ధి కనిపించడం లేదు. దాంతో లే ఆఫ్స్‌ తప్పడం లేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మా ఉద్యోగుల్లో సుమారు 2 శాతం మందిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మధ్యస్థ, సీనియర్ స్థాయుల్లో ఉండే ఉద్యోగులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్ణయం అనుకున్నంత ఈజీ కాదు. సీఈఓగా నేను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఇదొకటి’ అని కృతివాసన్‌ తెలిపారు.

Air Hostess Folds Hands Fliers Agitated Over IndiGo Take-Off Delay3
మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!

ముంబై: అది ఇండిగో విమానం.. ముంబై నుంచి వారణాసి వెళ్లాల్సిన ప్రయాణికులంతా తమ తమ సీట్లలో కూర్చొని ఉన్నారు. అయితే టేకాఫ్‌కు ముందు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ విమానం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఈ మధ్యలో చోటు చేసుకున్న రభస అంతా ఇంతా కాదు. సీట్లలో కూర్చొన్న ప్రయాణికలు ఒక్కొక్కరిగా తమ నిరసనను ఉధృతం చేశారు. తొలుత కొంత ఓపిక పట్టిన ప్రయాణికులు.. ఆపై తమ సహనం కోల్పోయారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో చెప్పాలంటూ విమాన సిబ్బందిపై ప్రశ్నలు వర్షం కురిపించారు. అయితే విమానం లోపల ఉన్న ఎయిర్‌ హోస్టస్‌ వద్ద కచ్చితమైన సమాధానం లేకపోవడంతో ప్రయాణికుల్ని బ్రతిమాలుకున్నారు. ప్లీజ్‌.. మీకు చేతులెత్తి దండం పెడతా.. దయచేసి ఎవరి సీట్లలో వారు కూర్చోండి’ అంటూ ఒక ఎయిర్‌ హోస్టెస్‌ ఓ ప్రయాణికుడ్ని బ్రతిమాలుతున్న వీడియో వైరల్‌గా మారింది. విమానంలోని ఈ రగడ జరిగే సమయంలో ఎవరో వీడియో తీసి పోస్ట్‌ చేస్తే అది వైరల్‌గా మారింది. ఇదంతా శనివారం(జూలై 26) రాత్రి ముంబై నుంచి వారణాసి బయల్దేరే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి గం. 9. 45 ని.లకు బయల్దేరాల్సిన విమానం.. టేకాఫ్‌ కావడానికి సుమారు రెండు గంటలు ఆలస్యమైంది. ఆ విమానం రాత్రి గం. 11.40 ని.లకు టేకాఫ్‌ అయ్యింది.

mla raja singh hot comments on their resignation4
ఆయన మంచి రైటర్‌.. ఇక్కడ మంచి ఫైటర్‌ కావాలి: రాజాసింగ్‌

సాక్షి,హైదరాబాద్‌: తాను పార్టీకి రాజీనామా చేయడంలో ఎలాంటి కుట్ర లేదని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ తిరిగి బీజేపీలో చేరనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు హాట్‌ కామెంట్స్‌ చేశారు.‘‘రామచందర్ రావు మంచి రైటర్. కానీ తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే మంచి ఫైటర్ కావాలి. నా రాజీనామా వెనక కుట్ర లేదు. వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారికి అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయంపై కేంద్ర పార్టీకి చెప్పాలని అనుకుంటున్నా. నా రాజీనామాను కేంద్ర పార్టీ ఆమోదించడం వెనక కుట్ర జరిగింది. నా పార్టీలో చేరడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎం చేయాలో కేంద్ర పార్టీకి వివరించాలని ఉంది. హోంశాఖ మంత్రి అమిత్ షా నాకు ఫోన్ చేయలేదు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న తప్పిదాలపై కేంద్రానికి లేఖ రాశా.. మెయిల్స్ చేశాను. వారి దృష్టికి వెళ్ళిందో లేదో.. తెలియదు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కలిసినప్పుడు అమిత్ షాకు కలుస్తానని చెప్పాను.. ఆ లోపే రాజీనామా చేశాను.తెలంగాణలో 2014, 2018, 2023 ఎన్నికల్లో బీజేపీకి ఎవరు మోసం చేశారో, ఎవరు వెనక నుంచి కత్తిపోట్లు పొడిచారో ఐబీ రిపోర్ట్ కేంద్ర పార్టీ తెప్పించుకోవాలి. కొంతమంది బీజేపీ మహిళానేతలకు దండం. వారికి సన్మానం చేస్తా. నా ఉద్దేశ్యం ఒక్కటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడమే. నాకు అమిత్ షా ఫోన్ చేశారని యూట్యూబ్ ఛానళ్లలో ఫేక్ వార్తలు పెట్టించి రాజీనామా ఆమోదించేలా చేశారు. ఫేక్ వార్తలు, మీడియాలో లీకులు ఇచ్చే అలవాటు నాకు లేదు.. అటువంటి చిన్న ఆలోచన నేను చేయను"అని అన్నారు.

Latest updates on Srushti Test Tube Baby Center case5
‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం

సాక్షి,హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఐవీఎఫ్‌ పేరుతో చైల్డ్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆదివారం(జులై 27) మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ భాగోతాలను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్‌ బయట పెట్టారు. ఈ నెల 25న సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై కేసు నమోదైంది. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. గతేడాది ఆగస్టులో డాక్టర్‌ నమ్రతాను సోనియా దంపతులు కలిశారు. ఐవీఎఫ్‌ ప్రొసీజర్ కోసం డాక్టర్‌ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను విశాఖకు పంపారు. ఐవీఎఫ్‌ ద్వారా సాధ్యం కాదు.. సరోగసితో అవుతుందని చెప్పారు.సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని చెప్పారు. ఐవీఎఫ్‌ ప్రొసీజర్‌ కోసం డాక్టర్‌ నమ్రత రూ.30లక్షలు డిమాండ్‌ చేశారు. రూ.15లక్షల చెక్కు,రూ.15లక్షలు బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌. మెడికల్‌ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నారు. విజయవాడ వెళ్లి శాంపిల్స్‌ ఇచ్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు.ఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. ఢిల్లీలో డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించారు. మరొకరి డీఎన్‌ఏ అని తేలింది. డాక్టర‌ నమ్రత జాబితాలో చాలామంది డేటా ఉంది. బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీ మహిళకు రూ.90వేలు ఇచ్చారు. దంపతుల వద్ద మొత్తం రూ.40లక్షలు వసూలు చేశారు. బాధిత కుటుంబం మమ్మల్ని కలిశారు. వెంటనే మేము సోదాలు చేశాము. నమ్రత కొడుకు జయంత్ కృష్ణ అడ్వకేట్‌గా పని చేస్తూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై ఏదైనా కేసులు వస్తే తనే వాదించేవారు. వైజాగ్‌లోనూ సరోగసి ద్వారా అనేక గర్భధారణలు చేశారు నమ్రత.హైద్రాబాద్‌లో ఉన్న ఒక మహిళకు రూ.89వేలు ఇచ్చి ఫ్లైట్‌లో వైజాగ్ తీసుకెళ్లి అక్కడ సర్జరీ అయ్యాక పాపని వాళ్లకు అప్పగించి మళ్ళీ హైదరాబాద్‌కు పంపించారు. పేదలకు డబ్బు ఆశ చూపించి సరోగసీకి ఒప్పిస్తున్నారు నమ్రత. నమ్రతకు సంబంధించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లైసెన్సులు కాన్సిల్ చేశాం.ఆమె లైసెన్స్ కూడా క్యాన్సిల్‌ అయ్యింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశాం. డాక్టర్‌ నమ్రతపై ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణలలో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ కథాకమామిషు ఏంటంటే?పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్‌ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్‌ బజార్‌లోని సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్‌ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ వెంకటితో పాటు క్లూస్‌ టీం, వైద్య బృందాలు సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ నమ్రత­ను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్‌ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టాడు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్‌ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్‌ చరిత్ర లేక­పోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్‌ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్ప­కపోవడంతో బాబుకు డీఎన్‌ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్‌ఏతో మ్యాచ్‌ కాలేదు. దీంతో డాక్టర్‌ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్‌ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. డాక్టర్‌ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. డాక్టర్‌ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైంది.

ENG VS IND 4TH TEST DAY 5: RAVINDRA JADEJA COMPLETED 1000 RUNS IN ENGLAND IN TESTS6
వీరోచితంగా పోరాడుతున్న సుందర్‌, జడేజా.. దిగ్గజాల సరసన చేరిన వెటరన్‌ ఆల్‌రౌండర్‌

మాంచెస్టర్‌ టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడుతున్నాడు. జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు అజేయమైన హాఫ్‌ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా బ్యాటింగ్‌ దిగ్గజాలైన సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి సరసన చేరాడు.ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లుసచిన్ టెండూల్కర్ - 30 ఇన్నింగ్స్‌లలో 1575 పరుగులురాహుల్ ద్రవిడ్ - 23 ఇన్నింగ్స్‌లలో 1376 పరుగులుసునీల్ గవాస్కర్ - 28 ఇన్నింగ్స్‌లలో 1152 పరుగులుకేఎల్ రాహుల్ - 26 ఇన్నింగ్స్‌లలో 1125 పరుగులువిరాట్ కోహ్లీ - 33 ఇన్నింగ్స్‌లలో 1096 పరుగులురిషబ్ పంత్ - 24 ఇన్నింగ్స్‌లలో 1035 పరుగులురవీంద్ర జడేజా - 31 ఇన్నింగ్స్‌లలో 1016* పరుగులుమ్యాచ్‌ విషయానికొస్తే.. ఆట చివరి రోజు టీమిండియా ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడుతున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయమైన 100 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. సుందర్‌ 58, జడ్డూ 53 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.టీ విరామం సమయానికి భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్కోర్‌ 322/4గా ఉంది. ప్రస్తుతం భారత్‌ 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించాలంటే భారత్‌ మరో రెండున్నర గంటల్లోపు ఆలౌట్‌ కాకుండా చూసుకోవాలి.311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌.. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్‌, సాయి సుదర్శన్‌ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిల్‌, కేఎల్‌ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్‌ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. బెన్‌ స్టోక్స్‌ అద్భుతమైన బంతితో రాహుల్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు.రాహుల్‌ ఔటయ్యాక చాలా జాగ్రత్తగా ఆడిన గిల్‌ ఈ సిరీస్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ జేమీ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా (222 పరుగుల వద్ద) వెనుదిరిగాడు. ఇవాళ భారత్‌ తొలి సెషన్‌లోనే ఓవర్‌నైట్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (90), శుభ్‌మన్‌ గిల్‌ (103) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సుందర్‌, జడేజా భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు ఇంగ్లండ్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్కోర్‌ వివరాలు..భారత్‌ తొలి ఇన్నింగ్స్‌- 358 ఆలౌట్‌ (సాయి సుదర్శన్‌ 61, జైస్వాల్‌ 58, పంత్‌ 54, స్టోక్స్‌ 5/72)ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌- 669 ఆలౌట్‌ (రూట్‌ 150, స్టోక్స్‌ 141, రవీంద్ర జడేజా 4/143)

Stampede at Mansa Devi temple in Uttarakhand's Haridwar7
మన్సాదేవీ ఆలయంలో తొక్కిసలాట.. ఫేక్‌ వార్త ప్రచారమే కారణం!

Manasa Devi Temple Stampede.. డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. హరిద్వార్‌ మన్సాదేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం కారణంగా ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. హరిద్వార్‌లోని మన్సాదేవి ఆలయం వద్ద ఆదివారం ఉదయం అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రావణమాసం, ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జులై 23వ తేదీన మాస శివరాత్రి జలాభిషేకం తర్వాత, లక్షలాది మంది కన్వర్ యాత్రికులు, సామాన్య ప్రజలు ఇప్పటికే హరిద్వార్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడి చేరుకోవడంతో.. ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. हरिद्वार के मनसा देवी मंदिर में भगदड़, 6 लोगों की मौत◆ भगदड़ में 25 से 30 लोग घायल◆ बताया जा रहा है कि ये हादसा सीढ़ियों में करंट उतरने की वजह से हुआ #MansaDeviMandir | Mansa Devi Mandir | #MansaDeviTemple pic.twitter.com/V1pLALBwJC— News24 (@news24tvchannel) July 27, 2025 తొక్కిసలాట ఘటనపై డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (డీఎం) మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ "విద్యుత్ తీగ తెగిపోయిందనే పుకారును ఎవరో వ్యాప్తి చేశారని ఫోటోలు, వీడియోల ద్వారా తెలిసింది. గాయపడిన వారు, మృతులు విద్యుత్ షాక్‌కు గురైనట్టు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ పుకారును ఎవరు వ్యాప్తి చేశారనే దానిపై దర్యాప్తు చేస్తాం. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం. సీసీటీవీ కెమెరాలు, ఇతర మార్గాలను పరిశీలిస్తాం. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు" అని తెలిపారు.మరోవైపు.. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రగాఢ సానుభూతి తెలిపారు. "హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయ మార్గంలో జరిగిన తొక్కిసలాట బాధాకరం. స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక యంత్రాంగంతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నాను. భక్తుల భద్రత కోసం మాతృదేవతను ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.ఇక, శివాలిక్ కొండలపై 500 అడుగుల ఎత్తులో ఉన్న మానసాదేవి ఆలయం, హరిద్వార్‌లోని పంచ తీర్థాలలో ఒకటి. ఇది పాముల దేవత మా మానసా దేవి ఆలయం, పురాతన సిద్ధపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.#WATCH | Haridwar, Uttarakhand | The injured are being rushed to the hospital following a stampede at the Mansa Devi temple. 6 people died and several others got injured in the stampede. pic.twitter.com/ScUaYyq2Z3— ANI (@ANI) July 27, 2025

This Bollywood Actor Missing From Mental Asylum for 25 Years8
కెరీర్‌ పతనంతో డిప్రెషన్‌.. పిచ్చాసుపత్రిలో ట్రీట్‌మెంట్‌? 25 ఏళ్లుగా మిస్సింగ్‌

ఆ రంగు, లుక్స్‌ చూసి ఫ్యూచర్‌ హీరో అనుకున్నారు. కొన్ని సినిమాలతోనే చాక్లెట్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు చేసి విలనిజం కూడా చేయగలనని హింటిచ్చాడు. సినిమాలకే ఎందుకు పరిమితం కావాలనుకున్నాడో ఏమో కానీ బుల్లితెరపైనా తళుక్కుమని మెరిశాడు. రెండుచోట్లా గుర్తింపు సంపాదించుకున్న ఆయన 25 ఏళ్లుగా కనిపించకుండా పోయాడు. అతడే బాలీవుడ్‌ నటుడు రాజ్‌ కిరణ్‌..అగ్రతారగా ఎదుగుతాడనుకునేలోపే..రాజ్‌ కిరణ్‌ (Actor Raj Kiran).. 1975లో 'కాగజ్‌ కీ నవో' చిత్రంతో కెరీర్‌ ప్రారంభించాడు. రిషి కపూర్‌, గోవింద, అనిల్‌ కపూర్‌, శ్రీదేవి, రేఖ, హేమమాలిని వంటి పలువురు అగ్రతారలతో కలిసి పనిచేశాడు. బషీర, కర్జ్‌, అర్థ్‌, తేరి మెహర్బనియన్‌, మజ్దూర్‌, ఘర్‌ ఏక్‌ మందిర్‌.. వంటి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు! వాకిట్లో ఎప్పుడూ విజయాలే సిద్ధంగా ఉంటాయా? మొదట్లో ఎంతో సక్సెస్‌ చూసిన రాజ్‌కిరణ్‌ తర్వాత ఫ్లాపుల్ని కూడా చూశాడు. కొన్ని సినిమాలైతే అర్ధాంతరంగా ఆగిపోయేవి. అంతా ఓకే అయ్యాక, షూటింగ్‌ కూడా మొదలుపెట్టాక అటకెక్కేవి. ఇలా తన కెరీర్‌ కిందకుపడిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్‌కు వెళ్లిపోయాడు. 25 ఏళ్లుగా మిస్సింగ్‌దీంతో 2000వ సంవత్సరంలో మానసిక ఆరోగ్య కేంద్రంలో చేరినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేశ్‌ భట్‌ కూడా అతడిని చూసేందుకు పలుమార్లు వెళ్లొచ్చాడంటుంటారు. కానీ తర్వాత రాజ్‌కిరణ్‌ కనిపించకుండా పోయాడు. అతడి గురించి ఇంటిసభ్యులు వెతకని చోటంటూ లేదు. రిషికపూర్‌, దీప్తి నావల్‌.. సిటీ అంతా జల్లెడ పట్టారు. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయయ్యాయి. అయినా అతడి జాడలేదు. 25 ఏళ్లుగా అతడు కనిపించకపోవడం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.పిచ్చి ఆస్పత్రి నుంచి..నటుడి మిస్సింగ్‌ గురించి ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముంబైలోని బైకుల్లా పిచ్చి ఆస్పత్రిలో రాజ్‌కిరణ్‌ ఉండేవాడని, అక్కడినుంచి సడన్‌గా మాయమైపోడని అంటుంటారు. కొందరేమో అట్లాంటాలోని పిచ్చాసుపత్రిలో ఉన్నాడంటారు. మరికొందరేమో న్యూయార్క్‌లో టాక్సీ డ్రైవ్‌ చేస్తూ కనిపించాడని చెప్తుంటారు. 2000వ సంవత్సరంలో రాజ్‌ కిరణ్‌ అదృశ్యమయ్యేనాటికి అతడి భార్య రూప, కూతురు రిషిక ఉన్నారు.ఎప్పటికైనా తిరిగొస్తాడని..తండ్రి ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండుంటాడని, ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది కూతురు రిషిక మహతని. తన తండ్రి అట్లాంటాలో పిచ్చాసుపత్రిలో ఉన్నాడన్న ప్రచారాన్ని సైతం ఖండించింది. పోలీసులు, డిటెక్టివ్‌ల సాయంతో తండ్రిని వెతికిస్తున్నామంది. అయినా ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా భర్త తిరిగిరాకపోవడంతో రూప రెండో పెళ్లి చేసుకుందని సమచారం.మాట నిలబెట్టుకోలేకపోయిన నటిరాజ్‌కిరణ్‌ కోసం సల్మాన్‌ ఖాన్‌ మాజీ ప్రేయసి, నటి సోమి అలీ కూడా తెగ వెతికింది. నీ క్లోజ్‌ ఫ్రెండ్‌ ఎక్కడుతన్నా వెతికి తీసుకొస్తాను అని రిషి కపూర్‌కు మాటిచ్చింది. 20 ఏళ్లపాటు వెతికినా ఫలితం లేకపోయింది. అసలు రాజ్‌ కిరణ్‌ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు కనిపించకుండా పోయాడు? ప్రస్తుతం బతికే ఉన్నాడా? లేదా? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్‌ వండుకుని తిన్నా: హీరోయిన్‌

Union Minister Bandi Sanjay Slams BRS Working President KTR9
అందుకే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామన్నారు: బండి సంజయ్‌

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ పార్టీని నడిపే స్థితిలో లేరని, ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌. బీఆర్‌ఎస్‌ను నడిపే స్థితిలో లేకే బీజేపీలో విలీనం చేస్తామన్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 27) కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌.. సీఎం రమేశ్‌పై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.‘సిరిసిల్ల టికెట్‌ను మొదట కేటీఆర్‌కు ఇవ్వకపోతే, టికెట్‌ ఇ‍ప్పించాలని సీఎం రమేశ్‌ని ‍కలిశారు. కేటీఆర్‌కు సీఎం రమేశ్‌ టికెట్‌ ఇప్పించారు.. ఆర్థికసాయం కూడా చేశారు. సీఎం రమేశ్‌ సవాల్‌పై కేటీఆర్‌ చర్చకు సిద్ధమా?’ అని ప్రశ్నించారు బండి సంజయ్‌. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. కాగా, దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదికి రూ. 1,137 కోట్ల అమృత కాంట్రాక్ట్‌ ఇచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. . రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్‌.. సీఎం రమేశ్ సవాల్‌కు కేటీఆర్‌ సిద్ధంగా ఉంటే, తాను తీసుకు వస్తానన్నారు. అదంతా అవాస్తవం: సీఎం రమేశ్‌ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్‌ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్‌ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్‌ఎస్, కేసీఆర్‌ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్‌కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్‌ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు.

Thanushree Dutta Eats Mutton on Sravanamasa Fasting Period10
శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్‌ వండుకుని తిన్నా: హీరోయిన్‌

శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అంటూ ఎక్కువగా దైవారాధానలోనే మునిగిపోతారు. ఆధ్యాత్మికబాటలో నడుస్తున్నానని చెప్పిన హీరోయిన్‌ తనుశ్రీ దత్తా (Tanushree Dutta) కూడా శ్రావణ ఉపవాసం చేస్తోంది. కానీ మాంసాహారం తింటోంది. అదేంటో మీరే చదివేయండి..చంపడానికి ప్రయత్నాలుసినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తనుశ్రీ దత్తా ఇటీవల కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. నటుడు నానాపటేకర్‌.. తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడంది. తన మనుషులతో రాత్రిపూట ఇంటి బయట శబ్దాలు చేస్తూ భయపెడుతున్నారంది. బాలీవుడ్‌ మాఫియా చాలా పెద్దదని, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌లాగే తననూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ వీడియోలు వైరల్‌ కావడంతో ఇంటర్వ్యూల కోసం ఆమెను చాలామంది సంప్రదించారు. రోజంతా ఉపవాసం.. రాత్రవగానే..దానికామె కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడ్డానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని పేర్కొంది. కట్‌ చేస్తే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రావణమాసం సందర్భంగా మటన్‌ తింటున్నట్లు తెలిపింది. కొట్టు నుంచి తెచ్చుకున్న మటన్‌ను చూపిస్తూ.. రోజంతా తినకుండా ఉన్నానని, రాత్రి 7 గంటలకు మటన్‌ తిని ఉపవాసం పూర్తి చేశానంది. "ఎవరైనా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా టార్చర్‌ చేస్తుంటే మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. మటన్‌ వండుకుని తిన్నాఎందుకంటే ఆహారమే అసలైన మెడిసిన్‌. శ్రావణమాసం కావడంతో రాత్రి ఏడు గంటల వరకు ఉపవాసమున్నాను. ఆ తర్వాత అధిక పోషకాలున్న పప్పు, మటన్‌ వండుకుని డిన్నర్‌ చేశాను. ఉపవాసాలు మరీ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారు దాన్ని మార్చుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పనిచేస్తుంది" అని చెప్పుఒకచ్చింది. అందుకే లావైపోతున్నావ్‌శ్రావణంలో మటన్‌ తినడమేమో కానీ ఏకంగా ఉపవాసం రోజు మటన్‌ తినడమేంటని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఓ వ్యక్తి అయితే నువ్వు కొవ్వు ఎక్కువగా తింటున్నావు, అందుకే లావవుతున్నావు అని కామెంట్‌ చేశాడు. దానికి తనుశ్రీ స్పందిస్తూ.. ముందుగా నా శరీరం గురించి కామెంట్‌ చేసేందుకు నీకు ఎటువంటి అర్హత లేదు. రెండోది.. బక్కపల్చగా లేనేమోకానీ ఫిట్‌గానే ఉన్నాను. ఎటువంటి డ్రెస్‌ వేసుకున్నా అందంగానే కనిపిస్తాను. కాబట్టి బొద్దుగా, అందంగా ఉండేవాళ్లను బాడీషేమింగ్‌ చేయడం ఆపండి. కొవ్వు మంచిదే!ప్రతి ఒక్కరూ సన్నగా ఉండాలని కోరుకోరు. అయినా కాస్త కొవ్వు పదార్థాలు తిన్నంతమాత్రాన శరీరంలో కొవ్వు చేరదు. ఆరోగ్యకరమైన కొవ్వు తీసుకోవడం వల్ల సన్నగా కూడా అవుతారు. మన శరీరం బాగా పనిచేయడానికి హెల్తీ ఫ్యాట్స్‌ అవసరం అని చెప్పుకొచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో వీరభద్ర మూవీలో యాక్ట్‌ చేసింది. View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్‌ చేయాలనుంది: నాగచైతన్య

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement