'మ్యాచ్‌లు లేక‌పోవ‌డంతో బోర్‌గా ఫీల‌వుతున్నా' | Steve Smith Practices Isolation Batting At Home | Sakshi
Sakshi News home page

'మ్యాచ్‌లు లేక‌పోవ‌డంతో బోర్‌గా ఫీల‌వుతున్నా'

Published Wed, Apr 22 2020 3:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:01 AM

సిడ్నీ : ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌డంతో క్రీడ‌ల‌న్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంటికే ప‌రిమితమైన ఆట‌గాళ్లు త‌మ ఆట‌ను మ‌రిచిపోకూద‌ని వివిధ రూపాల్లో ప్రాక్టీస్ కొన‌సాగిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా ఆట‌గాడు, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సిడ్నీలోని  త‌న ఇంట్లో ప్రాక్టీస్ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా బ్యాటింగ్ స‌మ‌యంలో చేతికి, కంటికి మ‌ధ్య స‌మ‌య్వ‌యం ఎలా ఉండాలనేది వీడియోలో చూపించాడు.
 

'హాయ్.. క‌రోనా మ‌హ‌మ్మారితో క్రీడ‌ల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో మాకు మ్యాచ్‌లు లేక‌పోవ‌డంతో బోర్‌గా ఫీల‌వుతున్నాము. అందుకే రోజులో కొంత స‌మ‌యాన్ని ప్రాక్టీస్‌కు కేటాయిస్తున్నా. ఈరోజు మీకు ఒక విష‌యం చెప్పాల‌నుకుంటున్నా.. బ్యాటింగ్ చేసేట‌ప్పుడు క‌ళ్ల క‌ద‌లిక చాలా ముఖ్యం.  అందుకు ఒక బంతిని తీసుకుని గోడ‌కు ఎదురుగా నిల‌బ‌డి బ్యాట్‌తో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కొట్టండి. దీనివ‌ల్ల కంటికి, చేతికి మధ్య కోఆర్డినేష‌న్ ఉంటుంద‌ని, త‌ద్వారా షాట్ల ఎంపిక‌కు ఈ టెక్నిక్ చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక చివ‌ర‌గా స్టే హోమ్.. బీ సేఫ్ ' అని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా మంచి పేరు తెచ్చుకున్న స్టీవ్ స్మిత్ కెరీర్‌లో వార్నర్‌, బెన్‌క్రాప్ట్‌ల‌తో క‌లిసి చేసిన‌ బాల్‌టాంప‌రింగ్ ఉదంతం ఒక మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయింది. దాదాపు ఏడాది పాటు ఆట‌కు దూర‌మైన స్మిత్ కెప్టెన్ ప‌దవిని కోల్పోయి జ‌ట్ట‌కు బ్యాట్స్‌మెన్‌గా సేవ‌లందిస్తున్నాడు. స్టీవ్ స్మిత్ ఆసీస్ త‌ర‌పున 73 టెస్టులు, 125 వ‌న్డేలు, 39 టీ20లు ఆడాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement