కోల్‌కతాకు కీలక విజయం... తొలుత చెన్నైను బ్యాటింగ్‌లో కట్టడి చేసి, తర్వాత బ్యాటింగ్‌లో స్థిరమైన ఆటతో ఛేదనను పూర్తి చేసిన ఆ జట్టు గెలుపును తన ఖాతాలో వేసుకుంది. నరైన్ ఆల్‌రౌండ్ ప్రతిభ, యువ శుబ్‌మన్ గిల్ సంయమనం, కెప్టెన్ దినేశ్ కార్తీక్ మెరుపులతో నైట్ రైడర్స్...ధోని జట్టును మట్టికరిపించింది.