టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకేయులు ఆదిలోనే షాక్ తగలింది. లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే(10) నిరాశపరచగా, కాసేపటకి కుశాల్ పెరీరా(18) కూడా పెవిలియన్ చేరాడు. దాంతో లంక 40 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లను జస్‌ప్రీత్ బుమ్రా సాధించాడు. కొద్ది సేపటి తర్వాత అవిష్కా ఫెర్నాండో(20)ను హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించగా,కుశాల్ మెండిస్‌ను జడేజా ఔట్ చేశాడు. దాంతో 55 పరుగులకే లంకేయులు నాలుగు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ తర్వాత తనకు భారత్‌పై ఉన్న మంచి రికార్డును కొనసాగిస్తూ మాథ్యూస్ సమయోచితంగా ఆడాడు. వంద పరుగులకు పైగా భాగస్వామ్యంలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా సెంచరీ సాధించాడు. దాంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.
భారత్ విజయ లక్ష్యం 265
Published Sat, Jul 6 2019 7:59 PM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement