సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ తాము కోరుకున్న రీతిలో ఐపీఎల్‌ను ప్రారంభించింది. ఎక్కడా ఎలాంటి తడబాటు లేకుండా అతి సునాయాసంగా తొలి విజయాన్ని అందుకుంది. పొదుపుగా బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడిన వేళ రైజర్స్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.