Sikhar Dhawan
-
ధావన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన కోహ్లి
పుణె : ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన తీరుని, ఈ విజయాన్నిఅందించడంలో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రత్యేకంగా కొనియాడాడు. 'ఇటీవల కాలంలో సాధించిన విజయాల్లో ఇది ఒక మధురమైన విజయంగా నిలిచిపోతుంది' అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత జట్టుకు, రోహిత్ రూపంలో స్వల్ప స్కోరుకే మొదటి వికెట్‌ను చేజార్చుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి, శిఖర్ ధావన్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 105 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు గట్టి పునాది వేశారు. 'బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న దశలో పరగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్‌పై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ''ఇవాళ శిఖర్ ధావన్ ఆడిన తీరు, అతడు సాధించిన 98 పరుగులు స్కోర్ బోర్డులో చూపించే స్కోర్ కంటే విలువైనవి'' అని చెబుతూ ధావన్‌ని కోహ్లి అభినందనల్లో ముంచెత్తాడు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ పుణేలో మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 98 పరుగుల చేసి తను ఫామ్‌లోకి వచ్చినట్లు ప్రకటించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్ మాన్ తన 18 వ వన్డే సెంచరీని కేవలం 2 పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. ( చదవండి : అరుదైన రికార్డు: సచిన్ తర్వాత కోహ్లినే ) -
తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సునాయాస విజయం
-
ధవన్.. పిచ్ లో నాగిని డ్యాన్స్ చేస్తే మంచిది!
ఢిల్లీ: మన వీరేంద్ర సెహ్వాగ్ చేసే ట్వీట్లు ఒక్కోసారి ఆలోచింప జేస్తే, మరి కొన్ని సందర్భాల్లో నవ్వుల్లో ముంచెత్తుతాయి. ఇప్పటికే ట్విట్టర్ కింగ్ అనే ముద్రను సంపాదించుకున్న సెహ్వాగ్.. తాజాగా చేసిన ట్వీట్లో మరింత హాస్యాన్ని జోడించాడు. అది కూడా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ బర్త్ డే సందర్భంగా సెహ్వాగ్ చేసిన ట్వీట్ అతని సృజనకు మరింత అద్దం పట్టింది. అయితే సెహ్వాగ్ చేసిన ట్వీట్లో శిఖర్ ధవన్ ఫామ్‌ను ప్రస్తావించుకుండానే, ఆ మేరకు సలహా ఇచ్చాడు. ఈసారి బ్యాటింగ్ కు వెళ్లాక క్రీజ్‌లో నాగిని డ్యాన్స్ చేయమని సెహ్వాగ్ సూచించాడు. ధవన్.. బ్యాటింగ్ కు వెళ్లే ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో భూమి పూజ చేసి, ఆ తరువాత పిచ్‌లో నాగిని డ్యాన్స్ చేస్తే మంచిదన్నాడు. కనీసం రెండు గంటలు పిచ్‌లో నాగిని డ్యాన్స్ శిఖర్ కు మంచిదంటూ చలోక్తులు విసిరాడు. మరొకవైపు డిసెంబర్ 4 వ తేదీన పుట్టినరోజు జరుపుకున్న భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌పై కూడా సెహ్వాగ్ సరదాగా సెటైర్లు వేశాడు. 191 వన్డే మ్యాచ్‌లు ఆడి 288 వికెట్లు తీయడం అజిత్ కు పెద్ద విజయం, అలాగే లార్డ్స్‌లో 100 వికెట్ల మార్కును అందుకోవడం అంతకంటే గొప్పది. అయితే టెస్టుల్లో ఐదుసార్లు డకౌట్ కావడం అగార్కర్ సాధించిన అతి పెద్ద గొప్ప విజయం' అని సెహ్వాగ్ సరదాగా ట్వీట్ చేశాడు. Happy Birthday @SDhawan25 . May you do Bhoomi Poojan in dressing room and Naagin Dance on pitch for atleast 2 hours every time while batting pic.twitter.com/E3UoUTVrkR — Virender Sehwag (@virendersehwag) 5 December 2016 -
శిఖర్ ధావన్ విఫలం
పెర్త్: ఆస్ట్రేలియాతో మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 36 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్(9) హాజల్ వుడ్ బౌలింగ్ లో మార్ష్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. టీమిండియా 14 ఓవర్లలో 74/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 38, విరాట్ కోహ్లి 21 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. -
అప్పుడు కంటే ఇప్పుడే నయం:శిఖర్
న్యూఢిల్లీ: గడిచిన ఎనిమిది నెలల్లో తాను బ్యాటింగ్ లో ఎంతో పరిణితి సాధించానని అంటున్నాడు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్. గతంలో తనలో నిలకడలేమి ఎక్కువగా ఉండేదని.. అది ఈ మధ్య కాలంలో చాలా మెరుగుపడిందని స్పష్టం చేశాడు. గత రెండు సంవత్సరాల క్రితం టెస్టులో ఆరంగేట్రం చేసిన తాను తొలుత బ్యాటింగ్ చేయడంలో పలు ఇబ్బందులను ఎదుర్కొనేవాడినని తెలిపాడు. 2015 వరల్డ్ కప్ నుంచి తన ఆటలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. ఆ మెగా ఈవెంట్ లో 412 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానం సాధించడమే ఇందుకు నిదర్శమని శిఖర్ పేర్కొన్నాడు. 'నా ఆటతీరు గడిచిన ఏడు-ఎనిమిది నెలల నుంచి నిలకడగా ఉంది. కొన్ని మంచి స్కోర్లు సాధిస్తూ జట్టుకు ఉపయోగపడుతున్నా. 2013 లో ఆస్ట్రేలియాతో టెస్టు కెరీయర్ ఆరంభించిన నాటి కంటే ఇప్పుడు బాగా మెరుగయ్యా. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో వరుసగా రెండు సెంచరీలు చేసి ఆకట్టుకున్నా. అయితే గాలే టెస్టులో గాయం కారణంగా రెండు టెస్టు మ్యాచ్ లకు దూరమయ్యా. అది నన్ను ఎక్కువగా బాధించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ల నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నా. సాధించిన విజయాల కంటే ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకోవచ్చన్నది అక్షరసత్యం. త్వరలో బంగ్లాదేశ్ -ఎ తో జరుగనున్న మూడు రోజుల మ్యాచ్ కు సన్నద్ధమవుతున్నా. ఇంకా నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం లేదు. సెప్టెంబర్ 27 వ తేదీన ఫిట్ నెస్ ను నిరూపించుకుని మళ్లీ బరిలోకి దిగడానికి సిద్ధమవుతా' అని ధవన్ స్పష్టం చేశాడు. -
ధావన్ హాఫ్ సెంచరీ
మిర్పూర్: బంగ్లాదేశ్ తో ఇక్కడ జరుగుతున్న చివరి (మూడో) వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధ శతకం సాధించాడు. ధావన్ ఎదుర్కొన్న 50 బంతుల్లో 7 ఫోర్లతో ఈ ఫీట్ అందుకున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (29) ఆరంభంలోనే అవుట్ అయ్యాడు. అయితే శిఖర్ ధావన్.. విరాట్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నాడు. ఈ సిరీస్ లో రెండో వన్డేలోనూ ధావన్ హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. తొలి 20 ఓవర్లలో భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కోహ్లి (25) రెండో వికెట్ గా అవుటయ్యాడు. కెప్టెన్ ధోని క్రీజులోకి వచ్చాడు. బంగ్లా బౌలర్ ముస్తఫిజార్ రోహిత్ శర్మ వికెట్ తీశాడు. -
ధావన్, కోహ్లి అర్థ సెంచరీలు
-
'ఆ మ్యాచ్ ఆస్ట్రేలియాకు గిఫ్ట్ గా ఇచ్చారు'
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల్లో టీమిండియా వరుస ఓటములు ఎదుర్కొవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కీలక తరుణంలో విఫలమైన టీమిండియా ఆటగాళ్లు రెండు టెస్టుల్లో ఓటమిని కొనితెచ్చుకున్నారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాను ఆస్టేలియాలో కొట్టే అవకాశాన్ని టీమిండియా వదులుకుందుని మండిపడ్డాడు. బ్రిస్బేన్ లో జరిగిన రెండో టెస్టులో కీలక తరుణంలో జట్టు విఫలమైందన్నాడు. టీమిండియా మూడు -నాలుగు రోజులు పూర్తిగా వైఫల్యం చెందడంతోనే మ్యాచ్ ఆసీస్ చేతుల్లోకి వెళ్లిందని గంగూలీ స్పష్టం చేశాడు. ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లి-శిఖర్ ధావన్ ల మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని పెద్దదిగా చూడాల్సిన అవసరం లేదన్నాడు. మెల్ బోర్న్ లో జరిగే మూడో టెస్టులో ఆ ప్రభావం ఏమీ ఉండదన్నాడు. గతంలో ఇదే తరహాలో కొన్నిసంఘటనలను ఉదాహరణగా పేర్కొన్నాడు. ఒకానొక సందర్భంలో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేయలేని పరిస్థితుల్లో తాను హడావుడిగా ప్యాడ్ లు కట్టుకుని క్రీజ్ లోకి వెళ్లానని గంగూలీ తెలిపాడు. ఆసీస్ నూతన టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన స్టీవెన్ స్మిత్ పై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా కష్టాల్లో ఉన్న తరుణంలో స్మిత్ సెంచరీ చేసి కెప్టెన్ గా ఆకట్టుకున్నాడన్నాడు. -
ప్లేఆప్ ఆశలు నిలుపుకున్న హైదరాబాద్
హైదరాబాద్: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు తమ ముందుంచిన 161 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(50), వార్నర్(59)తో రాణించారు. నమన్ ఓజా 24, ఫించ్ 11, స్యామీ 10 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో ఆరోన్ 2 వికెట్లు తీశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఈ ఓటమితో బెంగళూరుకు ప్లేఆప్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. హైదరాబాద్ ఆశలు నిలుపుకుంది.