ధవన్.. పిచ్ లో నాగిని డ్యాన్స్ చేస్తే మంచిది! | May you do Bhoomi Poojan in dressing room and Naagin Dance on pitch for atleast 2 hours every time while batting | Sakshi

ధవన్.. పిచ్ లో నాగిని డ్యాన్స్ చేస్తే మంచిది!

Dec 5 2016 4:30 PM | Updated on Sep 4 2017 9:59 PM

ధవన్.. పిచ్ లో నాగిని డ్యాన్స్ చేస్తే మంచిది!

ధవన్.. పిచ్ లో నాగిని డ్యాన్స్ చేస్తే మంచిది!

మన వీరేంద్ర సెహ్వాగ్ చేసే ట్వీట్లు ఒక్కోసారి ఆలోచింప జేస్తే, మరి కొన్ని సందర్భాల్లో నవ్వుల్లో ముంచెత్తుతాయి.

ఢిల్లీ: మన వీరేంద్ర సెహ్వాగ్ చేసే ట్వీట్లు ఒక్కోసారి ఆలోచింప జేస్తే, మరి కొన్ని సందర్భాల్లో నవ్వుల్లో ముంచెత్తుతాయి. ఇప్పటికే ట్విట్టర్ కింగ్ అనే ముద్రను సంపాదించుకున్న సెహ్వాగ్.. తాజాగా చేసిన ట్వీట్లో మరింత హాస్యాన్ని జోడించాడు. అది కూడా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ బర్త్ డే సందర్భంగా సెహ్వాగ్ చేసిన ట్వీట్  అతని సృజనకు మరింత అద్దం పట్టింది. అయితే సెహ్వాగ్ చేసిన ట్వీట్లో శిఖర్ ధవన్ ఫామ్ను ప్రస్తావించుకుండానే, ఆ మేరకు సలహా ఇచ్చాడు.

ఈసారి బ్యాటింగ్ కు వెళ్లాక క్రీజ్లో నాగిని డ్యాన్స్ చేయమని సెహ్వాగ్ సూచించాడు.  ధవన్.. బ్యాటింగ్ కు వెళ్లే ముందు డ్రెస్సింగ్ రూమ్లో భూమి పూజ చేసి, ఆ తరువాత పిచ్లో నాగిని డ్యాన్స్ చేస్తే మంచిదన్నాడు.  కనీసం రెండు గంటలు పిచ్లో నాగిని డ్యాన్స్ శిఖర్ కు మంచిదంటూ చలోక్తులు విసిరాడు.

మరొకవైపు డిసెంబర్ 4 వ తేదీన పుట్టినరోజు జరుపుకున్న భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్పై కూడా సెహ్వాగ్ సరదాగా సెటైర్లు వేశాడు. 191 వన్డే మ్యాచ్లు ఆడి 288  వికెట్లు తీయడం అజిత్ కు పెద్ద విజయం, అలాగే  లార్డ్స్లో 100 వికెట్ల మార్కును అందుకోవడం అంతకంటే గొప్పది. అయితే టెస్టుల్లో ఐదుసార్లు డకౌట్ కావడం అగార్కర్  సాధించిన అతి పెద్ద గొప్ప విజయం' అని సెహ్వాగ్ సరదాగా ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement