ధావన్ హాఫ్ సెంచరీ | sikhar dhawan half centuray | Sakshi
Sakshi News home page

ధావన్ హాఫ్ సెంచరీ

Published Wed, Jun 24 2015 4:00 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

ధావన్ హాఫ్ సెంచరీ

ధావన్ హాఫ్ సెంచరీ

మిర్పూర్: బంగ్లాదేశ్ తో ఇక్కడ జరుగుతున్న చివరి (మూడో) వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధ శతకం సాధించాడు. ధావన్ ఎదుర్కొన్న 50 బంతుల్లో 7 ఫోర్లతో ఈ ఫీట్ అందుకున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (29) ఆరంభంలోనే అవుట్ అయ్యాడు. అయితే శిఖర్ ధావన్.. విరాట్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నాడు. ఈ సిరీస్ లో రెండో వన్డేలోనూ ధావన్ హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. తొలి 20 ఓవర్లలో భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కోహ్లి (25) రెండో వికెట్ గా అవుటయ్యాడు. కెప్టెన్ ధోని క్రీజులోకి వచ్చాడు. బంగ్లా బౌలర్ ముస్తఫిజార్ రోహిత్ శర్మ వికెట్ తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement