వైరల్‌: మహిళ కోసం కారును ఒట్టి చేతుల్తో.. | People Saves Woman Life Who Trapped Beneath The Car In China | Sakshi
Sakshi News home page

వైరల్‌: మహిళ కోసం కారును ఒట్టి చేతుల్తో..

Published Mon, Jan 13 2020 2:33 PM | Last Updated on Fri, Mar 22 2024 10:50 AM

కారు క్రింద ఇరుక్కుపోయిన ఓ మహిళ ప్రాణాలు కాపాడటానికి కొంతమంది కారును సైతం ఒట్టి చేతుల్తో ఎత్తేశారు. ఓ వ్యక్తి ప్రాణాలకోసం పోరాడుతుంటే సెల్ఫీల కోసం ఎగబడకుండా మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించారు. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఒక వారం క్రితం చైనాలోని లూజో జాన్‌గ్సి జాంగ్‌ నగరంలోని ఓ రోడ్డుపై ఎలక్ట్రిక్‌ స్కూటీ మీద వెళుతోంది ఓ మహిళ. ఏమైందో ఏమో స్కూటీ మీదనుంచి ఆమె కిందపడిపోయింది. ఆ వెంటనే మహిళ వెనకాలే వస్తున్న ఓ కారు ఆమె మీదుగా వెళ్లింది. అయితే అక్కడి వారి అరుపులతో విషయం తెలుసుకున్న డ్రైవర్‌ కొన్ని అడుగులు దూరం వెళ్లగానే కారును నిలిపేశాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement