బ్రెజిల్ : నిజంగానే ఈ కుక్క మామూలుది కాదు! జంతువులకు సాధ్యంకాదు అన్న పనిని చేసి చూపించి ఔరా అనిపించింది. జాతీయ రహదారిపై(యాజమాని సహాయంతో) బైక్‌ను నడిపి నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ దృశ్యాలను ఎవరు వీడియో తీశారు, సంఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు. క్లారా జో బర్గ్ అనే యువతి తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘‘ కుక్కకు కూడా హెల్‌మెంట్ కావాలి కదా?. అదో పిచ్చిపని మంచిది కాదు.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, కొన్ని సంవత్సరాల క్రితం ఓ కుక్క డబుల్ రైడింగ్ చేస్తే.. ఈ కుక్క త్రిబుల్ రైడింగ్ చేయటం గమనార్హం.
ఈ కుక్క మామూలుది కాదు!
Published Sun, Oct 27 2019 2:35 PM | Last Updated on Thu, Mar 21 2024 11:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement