బీజింగ్ : కారులో ఉంచటానికి స్థలంలేదన్న కారణంతో పెంపుడు కుక్కను ఎలాంటి రక్షణలేని కారు టాప్‌పై ఉంచి ప్రయాణించాడో యాజమాని. ఈ సంఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన కారులో స్థలం లేని కారణంగా పెంపుడు కుక్కను ఎలాంటి రక్షణలేని తన కారు టాప్‌పై ఉంచి ప్రయాణించాడు. బిజీ రోడ్డుపై వేగంగా వెళుతున్న కారుటాప్‌పై నల్ల కుక్క ఉండటం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కారులో స్థలం లేని కారణంగానే తాను కుక్కను టాప్‌పై ఉంచాల్సి వచ్చిందని అతడు తెలిపాడు. కుక్కకు ఇంజెక్షన్ వేయించటానికి తీసుకెళుతున్నానని, ఆ సమయంలో వెనుక సీటు నిండా సామాన్లు ఉన్నాయని, అక్కడ దాన్ని ఉంచితే ఉక్కపోతకు గురవుతుందని చెప్పాడు.
ఓ పెంపుడు కుక్క ఓనర్‌పై నెటిజన్లు ఫైర్!
Apr 25 2020 8:42 PM | Updated on Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement