Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Atrocities: Mid Night High Drama in Pulivendula After TDP Flags Removed1
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా

సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో.. పులివెందుల, వేములలో గత అర్ధరాత్రంతా హైడ్రామా నడిచింది. మహానాడు నేపథ్యంతో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కడితే.. వాటిని తొలగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై అరెస్ట్‌ చేసి రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్‌ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పులివెందుల నుంచి వేముల పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పీఎస్‌కు చేరుకుని పోలీసులను నిలదీశారు. ‘‘ మా పార్టీ నేతలను అరెస్ట్‌ చేయం దారుణం. వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలు తొలగించమంటే పోలీసులు స్పందించలేదు. తమ మనోభావాలు దెబ్బ తినడంతో తోరణాలు తొలగించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలపై కేసులు పెట్టడం దారుణం’’ అని వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: వైఎస్సార్‌.. ఓ ఎమోషన్‌

US Court Blocks Donlad Trump Tariffs2
ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాల్లేవ్‌.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌కు యూఎస్‌ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘లిబరేషన్ డే’ సందర్భంగా పలు దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర పరిస్థితిలో మాత్రమే అధ్యక్షుడికి ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని మాన్‌హట్టన్‌ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో, ట్రంప్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌లు (Trump Tariffs) అమలుకాకుండా యూఎస్‌ ట్రేడ్‌ కోర్టు నిలుపుదల చేసింది. ఈ క్రమంలో మాన్‌హట్టన్‌ కోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల బృందం తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్‌కే ఉంది. విశేష అధికారాలతో టారిఫ్‌లు విధించడం సరికాదు. ఇది రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరచడమే అవుతుంది అని చెప్పుకొచ్చింది.అయితే, ట్రంప్ ఈ చర్యను అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద తీసుకున్నట్టు అమెరికన్ కమాండర్ ఇన్ చీఫ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని ఆర్థిక ఒత్తిడి సాధనంగా వినియోగించేందుకు వీలు లేదని కోర్టు తేల్చింది. ఇదే సమయంలో ‘భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల (India-Pakistan Tensions)’ అంశాన్ని ట్రంప్‌ సర్కారు ప్రస్తావించగా.. కోర్టు దాన్ని తోసిపుచ్చింది.🇺🇸 JUST IN: US federal court blocks Trump's "Liberation Day" tariffs from taking effect.It rules that the president overstepped his constitutional authority by unilaterally imposing import duties on countries with trade surpluses against the United States. pic.twitter.com/WmJlyoEz9H— Cointelegraph (@Cointelegraph) May 29, 2025అధ్యక్షుడికి ఉన్న టారిఫ్‌ అధికారాలను సమర్థించాలని ట్రంప్‌ (Donald Trump) అడ్మినిస్ట్రేషన్‌ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్‌.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణలను పెంచుతుందని అధికారులు వాదించారు. ‘‘టారిఫ్‌ అధికారం వల్లనే ఇటీవల భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్‌ సాధించగలిగారు’’ అని కోర్టుకు తెలిపారు. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్‌ డీల్స్‌ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్‌ అడ్మిస్ట్రేషన్‌ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది.ఇక, ఈ టారిఫ్‌లపై అమెరికాలోని ఐదు చిన్న దిగుమతి వ్యాపార సంస్థలు, ఒరెగాన్ రాష్ట్ర అటార్నీ జనరల్ డాన్ రేఫీల్డ్ నాయకత్వంలో ఉన్న 13 రాష్ట్రాల కూటమి వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధం, నిర్లక్ష్యంగా తీసుకున్నవని, ఆర్థికంగా నష్టం కలిగించేవి అంటూ వారు పేర్కొన్నారు. 🚨 BIG BREAKING 🚨🇺🇸 US Federal Court blocks President Trump's Liberation Day tariffs from taking effect.Donald Trump files appeal after Federal Court blocks tariffs.White House: It's "not for unelected judges to decide how to properly address a national emergency." pic.twitter.com/yCotgRaQq6— Crypto Aman (@cryptoamanclub) May 29, 2025

BJP Minister Support Shashi Tharoor Amid Congress Criticism3
Shashi Tharoor: లక్ష్మణ రేఖ దాటినా.. అనూహ్య మద్దతు

గత కొంత కాలంగా బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్(Shashi Tharoor).. ఎల్‌వోసీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర దుమారం రేపాయి. సొంత పార్టీ నేతలు ఆయన్ని తిట్టిపోస్తుంటే.. అనూహ్యంగా బీజేపీ నేతల నుంచి ఆయనకు మద్దతు లభిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పార్టీ వైఖరికి భిన్నంగా శశి థరూర్‌(Shashi Tharoor) మాట్లాడుతున్నారని, ఒకరకంగా ఆయన ‘లక్ష్మణరేఖ’ను దాటారని పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారంటూ తాజాగా పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ వివాదంలో కాంగ్రెస్‌ నేత ఉదిత్ రాజ్ శశి థరూర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రియమైన శశి థరూర్.. మిమ్మల్ని బీజేపీ సూపర్‌ అధికార ప్రతినిధిగా నియమించేలా ప్రధాని మోదీని ఒప్పించగలిగితే ఎంతో బాగుండేది. మీరు భారత్‌కు తిరిగి వచ్చేలోగానే మిమ్మల్ని విదేశాంగ మంత్రిగా ప్రకటించగలిగితే ఇంకా బాగుండేది. మోదీ ప్రధానమంత్రి కాక పూర్వం భారత్‌ ఆధీనరేఖను దాటిపోలేదని మీరన్నారు. తద్వారా కాంగ్రెస్‌ భవ్యచరిత్రను అప్రతిష్ఠపాలు చేశారు’’ అని ఉదిత్‌రాజ్‌ అన్నారు. ‘‘1965లో భారత్‌ పాకిస్థాన్‌లోని లాహోర్‌ సెక్టారులో పలుప్రాంతాల్లోకి చొచ్చుకుపోయింది. 1971లో భారత్‌ పాకిస్థాన్‌ను రెండుగా విడగొట్టింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా అనేక సర్జికల్‌ స్ట్రైక్‌లు(Surgical Strikes) నిర్వహించారు. అయితే ఆ విజయాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అప్పట్లో డప్పు వాయించుకోలేదు’’ అని ఉదిత్‌రాజ్‌ పోస్ట్‌ చేశారు.My dear @ShashiTharoor Alas ! I could prevail upon PM Modi to declare you as super spokesperson of BJP , even declaring as foreign minister before landing in India . How could you denigrate the golden history of Congress by saying that before PM Modi , India never crossed LOC… https://t.co/c88b8rX2bq— Dr. Udit Raj (@Dr_Uditraj) May 28, 2025కాంగ్రెస్‌ నేత పవన్‌ఖేరా స్పందిస్తూ.. యూపీఏ హ యాంలో పాకిస్థాన్‌ మీద పలుమార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించామని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్వయంగా చెప్పిన వీడియోను శశి థరూర్‌కు ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ అనేవి మోదీ ప్రధాని అయిన తర్వాతనే ప్రారంభం కాలేదని, గతంలోనూ అనేకసార్లు జరిగాయని, అయితే, దేశభద్రతకు సంబంధించిన అటువంటి సున్నిత సమాచారాన్ని తాము ఎన్నడూ రాజకీయ ప్రచారానికి వాడుకోలేదని అన్నారాయన.థరూర్‌ ఏమన్నారంటే.. ఐదు దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్‌ పనామాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఉగ్రదాడులను భారత్‌ భరిస్తూ వచ్చిందని, కానీ, ఇటీవలి కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు. మోదీ హయాంలో జరిగిన ఉరీ(2016), పుల్వా మా, పహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ.. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్‌లోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని ప్రసంగించారు. బీజేపీ మద్దతుగా.. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్‌పై భారత వైఖరిని వివిధ దేశాలకు స్పష్టం చేసేందుకు కేంద్రం పంపిన అఖిలపక్ష పార్టీల ప్రతినిధి బృందంలో శశి థరూర్ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఆయన్ని పక్కనపెట్టినప్పటికీ.. కేంద్రం ఆయనకు అందులో చోటు ఇవ్వడం గమనార్హం. అయితే.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే థరూర్‌పై దాడి జరుగుతోందని, దేశం కన్నా గాంధీ కుటుంబమే కాంగ్రెస్‌కు ముఖ్యమని బీజేపీ విమర్శించింది. అసలు కాంగ్రెస్‌ ఎవరికి మద్దతిస్తోంది? దేశం కోసం మాట్లాడటం ఆ పార్టీలో నిషేధమా? అని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి. వారికి దేశం పట్ల నిజంగా ఎంత శ్రద్ధ ఉంది?. భారత ఎంపీలు విదేశాలకు వెళ్లి భారత్‌కు, ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుకుంటోందా?. రాజకీయ వైరాగ్యానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది’’ అని కిరణ్‌ రిజిజు ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. మరోవైపు.. What does the Congress party want & How much they really care for the country? Should the Indian MPs go to foreign nation and speak against India and its Prime Minister? There’s limit to political desperation! https://t.co/JiuYqpW2tN— Kiren Rijiju (@KirenRijiju) May 28, 2025బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా థరూర్‌కు మద్దతు పలికారు. "శశి థరూర్ గాంధీ కుటుంబానికి కాకుండా, దేశానికి ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టే ఆయనపై కాంగ్రెస్ దాడి చేస్తోంది. పార్టీ ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాల గురించి, ఓటు బ్యాంకు రాజకీయాల కంటే జాతీయ విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే ఆయన లక్ష్యంగా మారారు" అని పూనావాలా పేర్కొన్నారు. "పాకిస్థాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది. నేడు కాంగ్రెస్, పాకిస్థాన్ డీజీలా మాట్లాడుతూ సొంత నేతపైనే విమర్శలు చేస్తోంది" అని పూనావాలా ఘాటుగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: చీకటి ఆ కుటుంబాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టేసింది!

Marco Rubio Says US will Revoke visas for Chinese students4
చైనా విద్యార్థులకు భారీ షాక్‌!

వాషింగ్టన్‌: అమెరికాలోని డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో చైనా విద్యార్థుల వీసాలు రద్దు చేయడానికి ట్రంప్‌ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో, చైనా విద్యార్థుల్లో టెన్షన్‌ మొదలైంది.మంత్రి మార్కో రూబియో తాజాగా ట్విట్టర్‌ వేదికగా..‘అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ నాయకత్వంలో చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా విదేశాంగ శాఖ హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖతో కలిసి పని చేస్తుంది. చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం.వీరిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నవారు, కీలక రంగాలలో చదువుతున్నవారు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇక, అమెరికాలో భారత్‌, తర్వాత చైనా విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా విద్యార్థులే రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను చైనా నుండి 2,70,000 మంది విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు.The U.S. will begin revoking visas of Chinese students, including those with connections to the Chinese Communist Party or studying in critical fields.— Secretary Marco Rubio (@SecRubio) May 28, 2025ట్రంప్ vs హార్వర్డ్మరోవైపు.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కొత్త అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోకుండా తాత్కాలికంగా నిలిపివేసింది. వర్సిటీలోని పరిశోధన భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సమన్వయం చేసుకుంటున్నట్టు ఆరోపించింది. హార్వర్డ్ ఒక చైనీస్ పారామిలిటరీ గ్రూప్ సభ్యులకు శిక్షణ ఇస్తోందని డీహెచ్‌ఎస్‌ వ్యాఖ్యానించింది. చైనా విద్యార్థులు వామపక్ష భావజాలంతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసింది.ఇదిలా ఉండగా.. అమెరికా వీసాల విషయంలో ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. యూఎస్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అమెరికన్లు చేసే పోస్టులను, కామెంట్లను సెన్సార్‌ చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారులపై కొత్తగా వీసా నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా తమ దేశానికి చెందిన సామాజిక మాధ్యమాలకు కంటెంట్‌ను తీసేయమని నోటీసులు పంపడం, ఒత్తిడికి గురిచేసిన వారిపైనా ఈ వీసా నిషేధం అమలుకానున్నట్లు అమెరికా పేర్కొంది. ఇటీవల పలు దేశాల ప్రభుత్వాల నుంచి యూఎస్‌ సోషల్‌ మీడియా కంపెనీలకు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.‘అమెరికా పౌరులు లేదా నివాసితులు తాము సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌లను, కామెంట్లను తొలగించమని ఒత్తిడికి గురిచేయడం, అరెస్టు వారెంట్లు జారీ చేయడం, యూఎస్‌ టెక్‌ కంపెనీలను సైతం ఒత్తిడికి గురిచేసే విదేశీ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త పాలసీ తీసుకొచ్చాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఈ సందర్బంగా విదేశీ అధికారులు ఇలా అమెరికా పౌరులను, టెక్‌ కంపెనీలను ఒత్తిడికి గురిచేయడం అనైతికం అన్నారు. అంతేకాకుండా గ్లోబల్‌ కంటెంట్‌ మోడరేషన్‌ విధానాలు అవలంభించడం లేదా వారి అధికార పరిధి దాటి సెన్సార్‌షిప్‌ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఇతర దేశాల అధికారులు యూఎస్ టెక్‌ కంపెనీలను డిమాండ్‌ చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. అయితే ఏ దేశం పేరును గానీ, అధికారులను గానీ ఆయన నేరుగా ప్రస్తావించలేదు.

Gautam Gambhir Breaks Silence On Snubbing Shreyas Iyer For England Test Series5
నేను సెలక్టర్‌ను కాదు.. నన్ను ఎందుకు అడుగుతారు: గంభీర్‌

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ ఇటీవ‌లే ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. ఈ జ‌ట్టుకు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్‌, అత‌డి డిప్యూటీగా వికెట్ కీపర్ రిష‌బ్ పంత్ ఎంపిక‌య్యాడు. సాయిసుద‌ర్శ‌న్‌, అర్ష‌దీప్ సింగ్ వంటి యువ ఆట‌గాళ్ల‌కు తొలి భార‌త టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది.అదేవిధంగా క‌రుణ్ నాయ‌ర్‌, శార్ధూల్ ఠాకూర్ వంటి వెట‌ర‌న్ ఆట‌గాళ్లకు సెల‌క్ట‌ర్లు తిరిగి పిలుపునిచ్చారు. అయితే ఈ జ‌ట్టులో మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. రంజీ ట్రోఫీ సహా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో కూడా చక్కటి రికార్డు ఉన్న అయ్యర్‌ పేరును సెల‌క్ట‌ర్లు పరిశీలించకపోవడం ఆశ్చర్యపర్చింది.క్రికెటేతర కారణాలతో అతడిని పక్కన పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విష‌యంపై భార‌త హెడ్ కోచ్ గౌతమ్‌ గంభీర్‌ను ప్ర‌శ్నించ‌గా సూటిగా సమాధానం ఇవ్వలేదు. ‘నేను సెలక్టర్‌ను కాదు’ అంటూ ఒక్క ముక్కలో గంభీర్‌ స్పందించాడు.కానీ ఐపీఎల్‌ ఫైనల్‌కు త్రివిధ దళాల అధిపతులను ఆహ్వానించినందుకు బీసీసీఐని గంభీర్‌ ప్రశంసించాడు. అది నమ్మశక్యం కాని నిర్ణయమని అన్నాడు. దేశం మొత్తం మ‌న సాయుధ ద‌ళాల‌కు సెల్యూట్ చేయాల‌ని గంభీర్ పేర్కొన్నాడు. కాగా భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ సైకిల్‌2025-27లో భాగంగా జ‌ర‌గ‌నుంది.చదవండి: IPL 2025: రిషబ్ పం‍త్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ

Pahalgam Attack 770 from Delhi alone Deported to Bangladesh6
‘పహల్గామ్‌’ ఎఫెక్ట్‌: అక్రమ నివాసితుల ఏరివేత

న్యూఢిల్లీ: భారత్‌లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఈ చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి భారత్‌లో నివాసం కొనసాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచారు. వీరి చర్యలను గమనిస్తూ, నిందితులుగా తేలినవారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.మరోవైపు బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో పలువులు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్‌కు తరలివచ్చి, ఇక్కడ తలదాచుకుంటున్నారు. గడచిన 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 770 మంది బంగ్లాదేశీయులను వారి దేశానికి తరలించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందిన విషయం విదితమే. నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు రాజధాని వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 470 మంది బంగ్లాదేశ్ వలసదారులను, మరో 50 విదేశీయులను గుర్తించారు, వారిలో బంగ్లాదేశకు చెందిన వారిని అగర్తలాకు విమానంలో తరలించి, భారత భూ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్‌కు పంపించారు.బంగ్లాదేశ్‌(Bangladesh) నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను, రోహింగ్యాలను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2024, నవంబర్ 15, 2025 ఏప్రిల్ 20 మధ్య కాలంలో 220 మంది అక్రమ వలసదారులను, 30 మంది గడువు దాటి దేశంలోనే ఉంటున్న విదేశీయులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారని సమాచారం. కాగా ‘పహల్గామ్‌’ ఘటన తర్వాత కొంత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, వెరిఫికేషన్ డ్రైవ్‌లు నిర్వహించి, బంగ్లాదేశ్ వలసదారులను, రోహింగ్యాలను అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఆధారాలను ధృవీకరించడానికి రాష్ట్రాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. వారి పత్రాలు ధృవీకరణ పొందకపోతే వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ వలసదారుకు సౌకర్యాలు కల్పించి, వారు భారత్‌లో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాయి.ఇది కూడా చదవండి: పాక్‌కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ

Actress Tamannaah blames Instagram clarifies her like on Deepika Padukone7
దీపికా పదుకొణెకు సపోర్టుగా తమన్నా.. నెటిజన్ల రచ్చ

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తాజాగా చేసిన ట్వీట్‌తో రెండు రోజులుగా దీపికా పదుకొణె( Deepika Padukone) పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తను తీయబోతున్న సినిమా కథను ఒక స్టార్‌ హీరోయిన్‌ లీక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సోషల్‌మీడియాలో ఆయనొక పోస్ట్‌ చేశారు. సందీప్‌ చేసిన కామెంట్స్‌ దీపికను ఉద్దేశించే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సందీప్‌ కామెంట్‌ చేసిన కొన్ని గంటల్లోనే దీపిక కూడా పరోక్షంగా స్పందించింది. ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను' అని చెప్పుకొచ్చింది. ఆ వీడియోతో పాటు దీపికకు చెందిన ఒక పాత వీడియోను ఆమె అభిమాని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అగౌరవం, పురుషులు, లింగ వివక్షత, లింగ వేతన వ్యత్యాసం, ఓవర్ టైం పని, వృత్తి నైపుణ్యం లేకపోవడం, స్త్రీ ద్వేషం, ద్వంద్వ ప్రమాణాలు అంటూ చెప్పిన ఆమె మాటలను ఇప్పుడు మళ్లీ వైరల్‌ చేశాడు. దానిని తమన్నా లైక్‌ చేశారని కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు. అది కాస్త నెట్టింట వైరల్‌ అయిపోయింది. దీపికాకు తమన్నా సపోర్ట్‌ చేస్తుందంటూ పేర్కొన్నారు. అయితే, తాజాగా తమన్నా వివరణ ఇచ్చింది. తాను ఎవరి పోస్ట్‌కు లైక్‌ కొట్టలేదని తెలిపింది. కొందరు కావాలనే ఇలాంటి వార్తలు క్రియేట్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. లైక్‌ కొట్టలేదని ఇన్‌స్టాగ్రామ్‌ చెప్పినా నమ్మలేని స్థితిలో కొందరు ఉన్నారని పేర్కొంది. తనకు తానుగా పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌ ఎలా లైక్‌ చేస్తుందో చెబితే బాగుంటుందని ఆమె తెలిపింది. దయచేసి దీనిని ఇంతటితో వదిలేయండి చాలా పనులు ఉన్నాయంటూ ఆమె వెళ్లిపోయింది.

Reason Behind Elon Musk Steps Down From Donald Trump Government Is8
ట్రంప్‌ పాలకవర్గం నుంచి మస్క్‌ ఔట్‌

ప్రముఖ బిలీయనీర్‌ ఎలాన్‌ మస్క్‌((Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ పాలక వర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మస్క్‌.. ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తన ఎక్స్‌ ఖాతాలో ఇందుకు సంబంధించి ఆయన ఓ పోస్ట్‌ చేశారు. ‘‘అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్‌ ఉద్యోగిగా తన షెడ్యూల్‌ ముగిసింది’’ అని పోస్టులో పేర్కొన్నారాయన. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే డోజ్‌ మిషన్‌ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending. The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.— Elon Musk (@elonmusk) May 29, 2025ట్రంప్‌ ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయాలపై మస్క్‌ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజా పన్నులు, వ్యయాల బిల్లులను తప్పు బట్టిన ఆయన.. ట్రిలియన్‌ డాఆర్ల పన్నులు వేయకపోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే.. రక్షణ రంగంపై వ్యయం పెంచడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో ట్రంప్‌ విధానాలు సరికావంటూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంతోనే ఆయన బాధ్యతల నుంచి తప్పుకుని ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం నుంచే ఎలాన్‌ మస్క్‌ను తన పాలక వర్గంలోకి తీసుకుంటానంటూ డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించడం తెలిసిందే. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్‌ను డోజ్‌ శాఖకు సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్‌’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్‌ ప్రకటించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వశాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేసింది. ఈ క్రమంలో.. అటు డెమోక్రట్ల నుంచి మాత్రమే కాదు, ఇటు రిపబ్లికన్ల నుంచి కూడా మస్క్‌ వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయితే దీర్ఘకాలిక అభివృద్ధి కావాలంటే.. కొన్నింటిని వదులుకోవాలని మస్క్‌ తన చర్యలను సమర్థించుకున్నారు.ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్‌ సంస్థలను పునర్మిర్మాణం.. ఇవన్నీ డోజ్‌ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. 2026 జులై 4వ తేదీలోపు మొత్తం ఫెడరల్ బ్రూరోక్రసీని ఇది ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్‌ దానికదే ఎక్స్‌పైరీ కానుంది. మస్క్‌ నిర్ణయంతో డోజ్‌కు ట్రంప్‌ కొత్త సారథిని నియమిస్తారా? లేదంటే ఆ వ్యవస్థను రద్దు చేస్తారా? అనేది వేచి చూడాలి.ఇదీ చదవండి: యువ పార్లమెంటేరియన్‌తో సీనియర్‌ అనుచిత ప్రవర్తన!

Lokpals Clean Chit To Ex SEBI Chief Madhabi Buch9
సెబీ మాజీ చీఫ్‌ మాధవికి క్లీన్‌ చిట్‌

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ విషయంలో అనైతికంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ మాజీ చీఫ్‌ మాధవి పురి బచ్‌కు లోక్‌పాల్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆమెపై ఆరోపణలన్నీ ఊహాగానాలు, అభిప్రాయాలతో కూడుకున్నవేనని వ్యాఖ్యానించింది.టీఎంసీ ఎంపీ మహువా మైత్రా సహా ఇతరుల ఫిర్యాదులన్నీ కూడా, అదానీ కంపెనీలను టార్గెట్‌ చేసుకుంటారని పేరొందిన ఓ షార్ట్‌సెల్లర్‌ నివేదిక ఆధారంగా చేసినవేనని పేర్కొంది. ఇవన్నీ నిరాధారమైనవేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఆదేశించడానికి ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. అదానీ గ్రూప్‌ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన నివేదికలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.వాటిపై సెబీ చైర్మన్‌ హోదాలో బచ్‌ విచారణ జరపాల్సినప్పటికీ.. అదానీ గ్రూప్‌ కుంభకోణంతో సంబంధమున్న ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌లో గతంలో ఆమెకి, ఆమె భర్తకి వాటాలు ఉన్నందున సరైన చర్యలు తీసుకోలేదంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపించింది. ఈ ప్రాతిపదికన దాఖలైన ఫిర్యాదులను లోక్‌పాల్‌ తాజాగా కొట్టివేసింది.

Miss World 2025: Nandini Gupta Become 4 continental finalists at Miss world10
Miss World 2025: నందిని గెలిస్తే..నంబర్‌ వన్‌ మనమే..!

మిస్‌ వరల్డ్‌ 2025 పోటీల్లో కీలక ఘట్టాలకు తెరలేచింది. మరో వారం రోజుల్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. నగరంలో తొలిసారి జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ సారి భారతీయ సుందరి నందిని గుప్తా గెలిస్తే.. అది మరో కిరీటాన్ని భారత్‌కు అందించడం మాత్రమే కాదు అత్యధిక టైటిల్స్‌ గెలుచుకున్న దేశం అనే రికార్డ్‌ని కూడా అందిస్తుంది. ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉన్నా.. మిస్‌ వరల్డ్‌ పోటీలు ప్రారంభమైన 15ఏళ్ల తర్వాత తొలిసారిగా మన దేశం నుంచి 1966లో రీటా ఫరియా టైటిల్‌ గెలిచారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లర్‌ ఈ టైటిల్స్‌ను సాధించి దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారు. అదే విధంగా వెనిజులా 1955, 1981, 1984, 1991, 1995, 2011లలో ప్రపంచ సుందరి కిరీటాల్ని దక్కించుకుంది. తద్వారా ఇండియా, వెనిజులా – రెండూ సమానంగా 6 టైటిల్స్‌ గెలుచుకుని నెంబర్‌ వన్‌ స్థానాన్ని పంచుకుంటున్నాయి. మన తర్వాత యునైటెడ్‌ కింగ్డమ్‌ (యుకె) 5 టైటిల్స్, జమైకా, ఐస్లాండ్‌ – రెండూ చెరో 3 టైటిల్స్‌ గెలుచుకున్నాయి.నగరంపై నజర్‌ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్లామర్‌ ప్రపంచం దృష్టి మొత్తం నందిని గుప్తాపైనా, హైదరాబాద్‌ నగరంపైనే ఉంది. ఈ దఫా టైటిల్‌ను నందిని గెలిస్తే అది భారత్‌ను ప్రపంచ సుందరి పోటీల్లో నెం.1 స్థానానికి చేరుస్తుంది. కాబట్టి ఆ ఘనత నగరం వేదికగా సాకారం కావాలని గ్లామర్‌ రంగ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. (చదవండి: అమెరికా వేదికపై మెరిసిన తెలుగు అందం..! ఎవరీ చూర్ణికా ప్రియ..?)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement