Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comment On 2025 AP Budget Session Governor Speech1
మొత్తానికి ‘సూపర్ సిక్స్ వేస్ట్’ అని గవర్నర్‌తో చెప్పించారే!

ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చే గవర్నర్‌ ప్రసంగంలో ఎన్నికల హామీల అమలు, ప్రగతి తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి భిన్నం. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల ప్రణాళిక, హామీల ఊసే లేకుండా గవర్నర్‌ ప్రసంగాన్ని(Governor Speech) ముగించేసింది. ఏమిటి దీనర్థం? వాగ్ధానాలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్(Syed Abdul Nazeer) ప్రసంగం మొత్తాన్ని తరచి చూసినా సూపర్‌ సిక్స్‌ గురించి ప్రస్తావించిన విషయం పెద్దగా కనపడదు. ఎన్నికల ప్రచారంలో ఈ ఆరు హామీలపైనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రమంతా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. ఎలాగోలా అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ , లోకేష్‌లు ఈ హామీల ఎగవేతకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హామీల అమలుకు బదులు ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవడంపైనే పాలకపక్షం దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల, నేతల ఆస్తుల విధ్వంసం, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుతో రాష్ట్రం ఇప్పటికే అరాచక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గవర్నర్‌ ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు!. జగన్‌ అధికారంలో ఉండగా ప్రశంసించిన మంత్రివర్గాన్నే ఇప్పుడు గవర్నర్‌ విమర్శించాల్సిన పరిస్థితి. ప్రసంగాన్ని గవర్నర్‌ స్వయంగా కాకుండా.. పాలకపక్షం తయారు చేసి ఆయన చేత చదివిస్తుంది మరి! భారత రాజ్యాంగంలోని ఒకానొక వైరుద్ధ్యమిది. 👉గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ టాప్ 25 హామీలు అంటూ ప్రత్యేక పత్రాలను విడుదల చేసింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్నారు. సంతకమైతే పెట్టారు కానీ.. గడువులోగా అమలు చేయలేదు. గవర్నర్‌ ప్రసంగంలో దీని గురించి స్పష్టత ఏమీ ఇవ్వలేదు. వృద్ధాప్య ఫించన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిన విషయాన్ని చెప్పారు. కానీ, లక్షల సంఖ్యలో ఫించన్ల కోతకు కారణమేమిటో వివరించలేదు. అలాగే పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలందరికీ రూ.1500, పండుగ కానుకలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లోని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున చెల్లింపు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు, వలంటీర్ల గౌరవ వేతనం రూ.పది వేలకు పెంపు, అందరికీ అందుబాటులో ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పూర్ టు రిచ్, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్‌ వర్తింపు, పెళ్లికానుక కింద రూ.లక్ష, పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిల్లో.. గ్యాస్ సిలిండర్లు పథకం అరకొరగా అమలు అవుతోంది. ఇసుక ఉచితం అనేది ఉత్తుత్తి మాటగానే మిగిలిపోయింది. వీటితోపాటు మిగిలిన హామీల పురోగతి, అమలుకు ఉన్న అడ్డంకులను గవర్నర్‌తో చెప్పించి ఉంటే చంద్రబాబు ప్రభుత్వ నిబద్ధత ప్రజలకు తెలిసేది. కానీ సూపర్ సిక్స్ హామీలను ఇవ్వనట్లు గవర్నర్ ప్రసంగం సాగిందనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం ఏటా ఎన్నికల ప్రణాళికలోని అంశాల అమలును గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు నివేదించేది. టీడీపీ ప్రభుత్వం(TDP Government) మాత్రం అలవికాని హామీలను ఇవ్వడమే కాకుండా.. ఆచరణ ప్రశ్నార్థకంగా ఉన్న పలు అంశాలను చెప్పుకుని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందట. కుల వృత్తుల ద్వారా ఆత్మగౌరవం, ఆర్థిక స్ధిరత్వం వస్తుందట. గీత కార్మికులకు పదిశాతం మద్యం షాపులను కేటాయించడం ప్రభుత్వ ప్రగతి అట. ఐటీ నుంచి కృత్రిమ మేధ వరకు టెక్నాలజీ వినియోగంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోందని, విప్లవానికి నాయకత్వం వహిస్తోందని చెబితే జనం చెవిలో పూలు పెడుతున్నట్లు అనిపించదా!. 👉యథా ప్రకారం స్వర్ణాంధ్ర -2047 సాధనకు పది సూత్రాలను రూపొందించి ముందుకు వెళుతున్నారని తెలిపారు. విశేషం ఏమిటంటే ఆ పది సూత్రాలు తమకే అర్థం కాలేదని తెలుగుదేశం మీడియా అంటోంది. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్నట్లుగా గవర్నర్‌తో చెప్పిస్తే ఏమి ప్రయోజనం?. అది నిజమో ,కాదో ప్రజలకు తెలియదా? తాము ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చెప్పలేదని, అవకాశాలు కల్పించామని అన్నామని మంత్రి లోకేష్ శాసనమండలిలో కొత్త భాష్యం చెప్పారు. కానీ వారి పత్రిక ఈనాడులో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేసినట్లే రాశారు. వారికి కూడా తెలుగు అర్థం కాలేదా!. కేంద్ర పధకాలను పునరుద్దరించారట. తొమ్మిదివేల కోట్ల అప్పు తీర్చారట. విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వ టైమ్ లోనే కేంద్రం ఆయా స్కీముల కింద నిధులు ఎక్కువ ఇచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు(Chandrababu)కు కొద్ది రోజుల క్రితం వివరించారు. అయినా గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. 👉ఇక రోడ్లు, ఇతర పనుల బిల్లులు రూ.పది వేల కోట్లు చెల్లించామని అంటున్నారు. మంచిదే. కాని దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని అనడమే ఒకింత ఆశ్చర్యం!!. ఒక పక్క జనం వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి ఆశించిన స్థాయిలో లేక, జీఎస్టీ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. మరోపక్క గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. గూగుల్, మిట్టల్, టాటా పవర్, బీపీసీఎల్‌, ,గ్రీన్ కో వంటి దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. వీటిలో బీపీసీఎల్‌, గ్రీన్ కోలు జగన్ ప్రభుత్వ టైమ్‌లోనే ప్రతిపాదనలు పెట్టాయి. గ్రీన్ కో కర్నూలు జిల్లాలో రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. కూటమి సర్కార్ వీటిని తన ఖాతాలో వేసుకుంటోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. వలంటీర్లు లక్షన్నర మందిని తొలగించారు. ఇతరత్రా కొన్నివేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు ఎక్కడ వచ్చాయో ప్రభుత్వం వివరంగా చెబితే బాగుండేది. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలందరిని స్కీమ్‌లు, డబ్బులతో ముంచి లేపుతానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పాత కొటేషన్ ను అందుకుంది. ఎవరికైనా చేపను ఇస్తే అది అతని ఆకలిని ఒక్క రోజే తీర్చగలదు. అదే కనుక మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి లభిస్తుందనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. అంటే అర్థమైంది కదా? సూపర్ సిక్స్, ఇతర హామీలు వేస్ట్ అని చెప్పడమే ఇది! ఇక మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ రవాణా కేంద్రాలు.. ప్రపంచ మార్కెట్లో అనుబంధంగా కొత్త వాణిజ్య కారిడార్లు.. ఇలా ఏవేవో చెప్పి ప్రజలను మభ్య పెట్టేయత్నం సాగించారు. రోడ్లను బాగు చేసేసినట్లు, కొత్త రోడ్లు వేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే రూ.15వేల కోట్ల మేర బాదిన ప్రభుత్వం ఇప్పుడు పెంచడం లేదని చెప్పుకుంటోంది. తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామని చెప్పారు. కాని ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేదో వెల్లడించలేదు. అన్నా క్యాంటిన్లు హామీ అమలు నిజమే కాని, దానితోనే పేదరికం పోయేటట్లయితే, పేదల ఆకలి తీరేటట్లయితే వాటినే రాష్ట్రం అంతటా వీధి, వీధిన పెడితే సరిపోతుంది కదా? మరి ఇది చేపల వల అవుతుందా? లేక చేపలు ఇచ్చినట్లు అవుతుందో వివరిస్తే బాగుంటుంది. మొత్తం మీద గవర్నర్ స్పీచ్‌లో ఏదో జరిగిపోతోందన్న పిక్చర్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో తెలియకుండానే సూపర్ సిక్స్ హామీలు మోసపూరితమైనవని, ప్రజలను సోమరిపోతులను చేసేవి అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Heart Attack Cases Understand from Experts2
చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?

దేశంలో ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఈ తరహాలో గుండెపోటు, స్ట్రోక్‌, గుండె, ధమనుల వ్యాధులు వృద్ధులలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పాతికేళ్లలోపువారిలోనూ గుండపోటు కేసులు వెలుగు చూస్తున్నాయి. దీనికి కారణమేమిటి? వైద్యులు ఏమంటున్నారు?పురుషుల్లోనే అధికంఇండియన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్నేళ్లుగా 50 ఏళ్లలోపు వయసుగల వారిలో గుండెపోటు ముప్పు 50 శాతం, 40 ఏళ్లలోపు వారిలో 25 శాతం మేరకు పెరిగింది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో.. మహిళల్లో గుండెపోటు కేసులు చాలా తక్కువని తెలిపింది. పురుషులు ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ధూమపానం, మద్యపానం అనేవి యువతలో హృదయ సంబంధ వ్యాధులకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ వ్యసనాల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఇది కరోనరీ హార్ట్ డిసీజ్‌కు దారితీస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది రక్త నాళాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది.కారణాలివే..👇👉ఆహారపు అలవాట్లుఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ పని ఒత్తిడి మరింతగా పెరిగింది. దీంతో యువత తమ ఆహారపు అలవాట్లు, దినచర్యపై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇది పలు రకాల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తోంది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని కారణంగా శరీరంలోని కేలరీల పరిమాణం పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.👉అధిక పని ఒత్తిడిమానసిక ఒత్తిడి కూడా గుండెపోటుకు కారణంగా నిలుస్తోంది. పని భారం అనేది నేరుగా రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా యువకులు, మధ్య వయస్కులు రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఎనిమిది గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.👉మధుమేహం యువతలో గుండె జబ్బులకు మధుమేహం (డయాబెటిస్) కూడా ఒక ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో డయాబెటిస్ రోగులు అత్యధికంగా ఉన్నారు. 2019లో భారతదేశంలో 7.7 కోట్ల మంది డయాబెటిక్ బాధితులు ఉన్నారని పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2045 నాటికి డయాబెటిస్ రోగుల సంఖ్య 13 కోట్లకు పైగా పెరుగుతుందనే అంచనాలున్నాయి.జిమ్, డ్యాన్స్ సమయంలోనే ఎందుకంటే..అధికంగా శారీరక శ్రమ చేయడం వలన గుండె ధమనులలో అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ చీలిపోయే ప్రమాదం మరింతగా పెరుగుతుంది ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఛాతీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే గుండెపోటు ముప్పు కూడా మరింతగా పెరుగుతుంది. అందుకే నిపుణుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా నృత్యం చేసే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నృత్యం చేసే సమయంలో హృదయ స్పందన పెరుగుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఊబకాయం కలిగివారు, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఎక్కువ స్టెప్స్‌ కలిగిన నృత్యం చేస్తున్నప్పుడు వారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్తపడండిఛాతీ, వీపు, గొంతు, దవడ లేదా రెండు భుజాలలో తరచూ నొప్పిగా అనిపిస్తుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అలాగే ఉన్నట్టుండి చెమటలు పడుతున్నా, ఊపిరి ఆడటం కష్టంగా అనిపించినా, రెండు అడుగులు కూడా వేయలేనంత నీరసంగా అనిపించినా వెంటనే వైద్య నిపుణులను కలుసుకోవాలి. ఇదేవిధంగా ఛాతీలో, ఉదరంలో గ్యాస్ ఏర్పడినా, విపరీతమైన అలసట లేదా తల తిరుగుతున్నట్లు ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఛాతీ నొప్పి, విశ్రాంతి లేకపోవడం, శ్వాస సమస్యలు లేదా వేగంగా శ్వాస తీసుకోవడం మొదలైనవి గుండెపోటు సంబంధిత లక్షణాలు కావచ్చని గుర్తించాలని, ఇటువంటి సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు.గుండెలో సమస్యలు👉హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిగుండె కండరాలు గట్టిపడే జన్యుపరమైన రుగ్మత. దీని వలన గుండె రక్తాన్ని సమర్ధవంతంగా పంప్ చేయలేకపోతుంది.👉డైలేటెడ్ కార్డియోమయోపతి దీనిలో ఎడమ జఠరిక పెద్దదిగా, బలహీనంగా మారుతుంది. ఇది గుండెకు రక్తాన్ని సమర్థవంతంగా ప్రసరింపజేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.👉అరిథ్మోజెనిక్ రైట్‌ వెంట్రిక్యులర్‌ డిస్ప్లాసియా దీనిలో కొవ్వు లేదా పీచు కణజాలం గుండె కండరాలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ప్రాణాంతక అరిథ్మియా ముప్పును మరింతగా పెంచుతుంది.ముందుగా చేసే పరీక్షలివే..👉ఎకోకార్డియోగ్రఫీ (ఎకో) గుండె పనితీరునంతటినీ అంచనా వేయడానికి చేసే గుండె సంబంధిత అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ఇది.👉స్ట్రెస్/ట్రెడ్‌మిల్ పరీక్ష శారీరక శ్రమ చేసే సమయంలో గుండె ఎలా స్పందిస్తుందో ఈ పరీక్ష అంచనా వేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను గుర్తిస్తుంది.👉జెనెటిక్ పరీక్ష ఆకస్మిక గుండెపోటు, వారసత్వంగా వచ్చిన గుండె సంబంధిత సమస్యలు, కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు.👉హోల్టర్ పర్యవేక్షణ హోల్టర్ మానిటర్ అనేది హృదయ స్పందనను రికార్డ్ చేస్తుంది. ఇది గుండె సంబంధిత అసాధారణ సంకేతాలను తనిఖీ చేస్తుంది. బాధితులకు అవసరమైనప్పుడు వైద్యులు 24 గంటల హోల్టర్ పర్యవేక్షణను సూచిస్తుంటారు.వెంటనే ఏం చేయాలంటే..అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్‌ అనేది ప్రాణాలను కాపాడుతుంది. సీపీఆర్‌ చేయడం ద్వారా మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. కణజాల మరణాన్ని కొంతసేపటి వరకూ నివారిస్తుంది. సీపీఆర్‌ అందని పక్షంలో ఐదు నిమిషాల్లో మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. ఎనిమిది నిమిషాల తర్వాత మరణం దాదాపు ఖాయమని వైద్యులు చెబుతున్నారు.అత్యవసర సేవలకు కాల్ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే పక్కనే ఉన్నవారు ఆ వ్యక్తిని కదిలిస్తూ ‘బాగున్నారా?’ అని గట్టిగా అడగాలి. వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాలి. బాధితులు శ్వాస తీసుకుంటున్నాడా లేదా అనేది గుర్తించాలి. బాధితుడు శ్వాస తీసుకోకవడం లేదని గుర్తిస్తే అతని ఛాతీ మధ్యలో గట్టిగా వేగంగా అదమండి. నిమిషానికి 100 నుండి 120 సార్లు ఇలా చేయాలి. సీపీఆర్‌లో శిక్షణ పొందినవారు 30 కంప్రెషన్ల తర్వాత రెస్క్యూ శ్వాసలను అందించగలుగుతారు. శిక్షణ పొందనివారు ఛాతీ కంప్రెషన్లను కొనసాగించాలి. అదేవిధంగా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.ఇది కూడా చదవండి: Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు

Did AAP Arvind Kejriwal Goes Parliament Here Is The Actual Truth3
ఆప్‌ సర్‌ప్రైజ్‌.. ఎంపీగా కేజ్రీవాల్?

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సైలెంట్‌ అవుతారని భావించిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal).. పార్టీ కన్వీనర్‌ హోదాలో క్రమం తప్పకుండా పార్టీ మీటింగ్‌లకు హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘోర పరాజయం చవిచూసింది. మాజీ సీఎం కేజ్రీవాల్‌ కూడా ఓడిపోవడంతో ఢిల్లీ రాజకీయాలకు ఆయన శాశ్వతంగా దూరం అవుతారని, అందుకు ‘లిక్కర్‌ స్కామ్‌’ అవినీతి మరకే కారణమని విశ్లేషణలు నడిచాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష నేతగా అతిషీని ఎంపిక చేశారని కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో..పంజాబ్‌ లూథియానా వెస్ట్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఆప్‌ ఆశ్చర్యకరరీతిలో అభ్యర్థిని ఎంపిక చేసింది. కిందటి నెలలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గురుప్రీత్‌ గోగి మృతి చెందారు. దీంతో.. రాజ్యసభ ఎంపీ సంజీవ్‌ అరోరాను ఆ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఈ ఉదయం ప్రకటించింది ఆప్‌. సంజీవ్‌ అరోరా(Sanjeev Arora) 2022లో ఆప్‌ తరఫున పంజాబ్‌ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028తో ముగియనుంది. దీంతో అరోరాను అసెంబ్లీకి పంపి.. ఆ ఎంపీ సీటును కేజ్రీవాల్‌కు అప్పజెప్పబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. లూథియానా వెస్ట్‌ ఉప ఎన్నికకు ఈసీ ఇంకా షెడ్యూల్‌ ప్రకటించలేదు. అయితే ఆర్నెల్ల లోపు ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ప్రకారం.. జులై 11లోపు ఈ ఉపన్నిక జరిగే అవకాశం ఉంది.అందుకేనా సమీక్షలు!ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పంజాబ్‌ ఆప్‌ కేడర్‌తో కేజ్రీవాల్‌ వరుసబెట్టి సమావేశాలు జరిపారు. ఒకానొక టైంలో.. భగవంత్‌ మాన్‌ను తప్పించి కేజ్రీవాల్‌ పంజాబ్‌ సీఎం అవుతారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ చర్చల సారాంశం.. బహుశా రాజ్యసభ స్థానం కోసమే అయి ఉంటుందని ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది.

TVK Vijay And Prashant Kishor step out together In Tamil Nadu4
#GETOUT: తమిళనాట పొలిటికల్‌ హీట్‌.. విజయ్‌, పీకే ప్లానేంటి?

చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేడు సినీ నటుడు విజయ్‌ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు పార్టీ చీఫ్‌ విజయ్‌. ఈ కార్యక్రమానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ హాజరవుతున్నారు. దీంతో, తమిళ పాలిటిక్స్‌ రసవత్తరంగా మారింది.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నారు. నేడు పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. చెన్నైలోని మామల్లపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. తమిళనాడులో వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలకమైన ప్రకటన చేస్తారని సమాచారం.ఇదిలా ఉండగా.. పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ సహా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పాటు టీవీకే ఇతర ముఖ్య నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. ఈ సభకు దాదాపుగా మూడు వేలమంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, వేదికపై నుంచి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.தமிழக மக்களின் தலையெழுத்தை மாற்றப்போகும் கையெழுத்து ❤️#Getout #TVKForTN pic.twitter.com/3yAUgiQqZ7— Mʀ.Exᴘɪʀʏ (@Jana_Naayagan) February 26, 2025హాట్‌ టాపిక్‌ బ్యానర్‌..మరోవైపు.. టీవీకే పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం 6 అంశాలను ప్రస్తావించారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ #GETOUT అనే హ్యాష్‌ ట్యాగ్‌ను చేర్చారు. ఈ బ్యానర్‌పై విజయ్‌ సంతకం కూడా చేశారు. అందులో మహిళల భద్రత, సంక్షేమానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక నియంతృత్వ పాలనను సాగిస్తూ ప్రజా గొంతులను అణిచివేయడం, ఓటు బ్యాంకుల కోసం కులమతాల పేరుతో ప్రజలను విడగొట్టడాన్ని కూడా ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు. పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆర్భాటాలు చేస్తున్నారని ఆరోపించారు. నూతన విద్యా విధానం, త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతిజ్ఞ చేద్దామని కూడా ఆ పోస్టర్‌లో ఉంది.

Former Pakistan cricketer says sorry for supporting home team5
'ఇంత చెత్త‌గా ఆడుతార‌ని ఊహించలేదు.. నన్ను క్ష‌మించండి'

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య‌ పాకిస్తాన్ ప్ర‌యాణం ముగిసిన సంగ‌తి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌.. టోర్నీ ప్రారంభ‌మైన కేవ‌లం ఆరు రోజుల్లోనే ఇంటిముఖం ప‌ట్టింది. దీంతో ఈ మెగా టోర్నీకి ముందు తాము చేసిన వ్యాఖ్య‌ల‌ను పాక్ మాజీ ఆట‌గాళ్లు వెనక్కి తీసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో పాక్ మాజీ బ్యాట‌ర్ బ‌సిత్ అలీ చేరాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌కు పాకిస్తాన్ చేరుతుంద‌ని, తుది పోరు లాహోర్ వేదిక‌గా జ‌రుగుతుంద‌ని అలీ అంచ‌నా వేశాడు. అయితే పాక్ లీగ్ స్టేజిలోనే నిష్క్ర‌మించిడంతో తాజాగా అలీ క్షమాపణలు చెప్పాడు. భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గాల‌ని త‌ను కోరుకుంటున్న‌ట్లు అత‌డు తెలిపాడు."ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ లాహెర్ వేదిక‌గా జ‌రుగుతుంద‌ని, పాక్ టైటిల్ పోరుకు ఆర్హ‌త సాధిస్తుంద‌ని చెప్పినందుకు న‌న్ను క్ష‌మించిండి. ఈ టోర్నీలో పాకిస్తాన్ టీమ్ ఇంత చెత్త‌గా ఆడుతుంద‌ని నేను అస్స‌లు ఊహించ‌లేదు. ఈ మెగా ఈవెంట్‌లో భార‌త్ త‌మ అధిప‌త్యాన్ని కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నాను. మ‌ర్చి 9న దుబాయ్ వేదిక‌గా ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా, భార‌త్‌లు త‌ల‌ప‌డితే బాగుంటుంది. మ‌రోసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌ను త‌ల‌పిస్తుందని అనుకుంటున్నాను" అని అలీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.బై బై అకీబ్‌..!ఇక ఈ ఘోర ప్ర‌ద‌ర్శ‌న నేప‌థ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త‌మ జ‌ట్టు తాత్కాలిక హెడ్ కోచ్ అకిబ్‌ జావెద్‌తో పాటు సహాయక సిబ్బందిని తొలిగించాల‌ని పీసీబీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న అకిబ్ ప‌ద‌వీ కాలం ఈ నెల 27తో ముగియ‌నుంది.ఈ టోర్నీ ముగిసిన అనంత‌రం పాకిస్తాన్ జ‌ట్టు వైట్‌బాల్ సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు న్యూజిలాండ్‌కు వెళ్ల‌నుంది. దీంతో న్యూజిలాండ్ టూర్‌కు ముందు పాక్‌కు కొత్త హెడ్‌కోచ్ అవకాశ‌ముంద‌ని పీసీబీ మూలాలు వెల్ల‌డించాయి. పాక్ త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్ర‌వరి 27న బంగ్లాదేశ్‌తో రావ‌ల్పిండి వేదిక‌గా త‌ల‌ప‌డ‌నుంది.చదవండి: మీ కంటే కోతులు బెట‌ర్‌.. త‌క్కువ‌గా తింటాయి: వసీం అక్రమ్‌

slbc Tunnel rescue operation continues On 26 Feb live updates6
SLBC వద్దకు ఆపరేషన్ మార్కోస్ టీమ్‌.. ప్రస్తుత పరిస్థితి ఇలా..

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఆపరేషన్ మార్కోస్ టన్నెల్ రంగంలోకి దిగుతోంది. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ రానుంది.ఈ కమాండ్స్‌ నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ కార్యక్రమాలు చేపడతారు. ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో కార్మికులు బయటకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగంపై నుంచి కాని, పక్క నుంచి కానీ.. వెళ్లే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టన్నెల్‌ బురదమయం..ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కాపాడేందుకు సహాయచర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్‌ మైనర్స్‌ సహా పలు సహాయక బృందాలు వారి వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు సహాయక బృందాలు 13.5 కిలోమీటర్ల వరకు మాత్రమే చేరుకున్నాయి. అక్కడ.. ధ్వంసమైన టీబీఎం పరికరాలు ఉండటంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు.. 11.5 కి.మీ నుంచి ఎయిర్‌ సప్లయ్‌ పైప్‌లైన్‌ వ్యవస్థ ధ్వంసమైంది. జీఎస్‌ఐ, ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు బురద పరిస్థితిపై అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం టన్నెల్‌లో 200 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. గంటకు 3600 నుంచి 5000 లీటర్ల ఊట వస్తోంది. సొరంగ మార్గంలో 10వేల క్యూబిక్‌ మీటర్ల బురద ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కన్వేయర్‌ బెల్ట్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కన్వేయర్‌ బెల్ట్‌తో గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశముందని చెబుతున్నారు.ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు ఉండటంతో అక్కడ అడుగు వేయడానికి వీలులేకుండా ఉందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. కూలిపోయే ప్రమాదం.. అక్కడి పరిస్థితిని రెస్క్యూ టీం సభ్యులు వీడియో తీశారు. ‘ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది.. పైకప్పునకు క్రాక్‌ వచ్చింది. కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్దాం పదండి..’ అంటూ రెస్క్యూ టీం సభ్యులు వీడియోలో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బృందం తిరిగి బయటకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సొరంగంలోకి వెళ్లిన ఐదో రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి 40 మీటర్ల సమీపం వరకే వెళ్లగలిగింది.

Mazaka Movie Review And Rating In Telugu7
Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ

టైటిల్‌: మజాకానటీనటులు: సందీప్‌ కిషన్‌, రావు రమేశ్‌, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్నిర్మాత: రాజేశ్‌ దండకథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడదర్శకత్వం: త్రినాథరావు నక్కినసంగీతం: లియోన్‌ జేమ్స్‌సినిమాటోగ్రఫీ: నిజార్‌ షఫీవిడుదల తేది: ఫిబ్రవరి 26, 2025యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌కి ఈ మధ్య సరైన హిట్టే పడలేదు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అనే పదానికే దూరమయ్యాడు. అందుకే ఈ సారికి ఎలాగైన హిట్‌ కొట్టాలని ‘ధమాకా’ డైరెక్టర్‌ త్రినాథరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ‘మజాకా’(Mazaka Review)తో సందీప్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వెంకటరమణ అలియాస్‌ రమణ(రావు రమేశ్‌) ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ(సందీప్‌ కిషన్‌) ఇంజనీరింగ్‌ చదివి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. రమణ మాత్రం ఇంట్లో ఆడదిక్కు లేదని.. కొడుక్కి త్వరగా పెళ్లి చేసి ఓ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. కానీ..ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పెళ్లిళ్ల బ్రోకర్‌ ఇచ్చిన సలహాతో ముందుగా తానే పెళ్లి చేసుకొని..ఆ తర్వాత కొడుక్కి పిల్లని వెతుకుదామని ఫిక్స్‌ అవుతాడు. అదే సమయంలో బస్‌స్టాఫ్‌లో యశోద(అన్షు)ని చూసి ఇష్టపడతాడు. మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. ఇలా తండ్రికొడుకులిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి ప్రేమలో పడిపోతారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంజనీరింగ్‌ చదివే కొడుకు ఉన్న రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? పగతో రగిలిపోయే వ్యాపారవేత్త భార్గవ్‌ వర్మ(మురళీ శర్మ)తో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకి కథే సరిగా ఉండదు కానీ కామెడీ సీన్లతో పాసైపోతుంది. పాటలు, కామెడీ వర్కౌట్‌ అయితే వంద కోట్లు కలెక్షన్స్‌ని కూడా రాబడతాయి. త్రినాథరావు, ప్రసన్న కుమార్‌ కాంబినేషన్‌ దీన్నే నమ్ముకుంది. రొటీన్‌ కథకి బలమైన కామెడీ సన్నివేశాలను రాసుకొని ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సినిమాను తీర్చిదిద్దుతారు. ‘ధమాకా’ వరకు వీరిద్దరి మ్యాజిక్‌ వర్కౌట్‌ అయింది. కానీ ‘మజాకా’ విషయంలో కాస్త బెడిసి కొట్టిందనే చెప్పాలి. కథే రొటీన్‌ అంటే స్క్రీన్‌ప్లే అంతకన్న రొటీన్‌గా ఉంటుంది. ఇక్కడో కామెడీ సీన్‌.. అక్కడో పాట..మధ్యలో ఎమోషనల్‌ సన్నివేశం..ఇలా సెట్‌ చేస్తే సరిపోతుంది సినిమా ఆడేస్తుంది అనుకున్నారేమో.వాస్తవానికి ఈ కథ లైన్‌ చాలా బాగుంది. కొడుకు పుట్టగానే భార్య చనిపోతే..మళ్లీ పెళ్లి చేసుకోకుండా, కొడుకు కోసం అలానే ఉండిపోయిన తండ్రి.. చివరకు కొడుకు పెళ్లి కోసమే..మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడం. ఫ్యామిలీ ఫోటో కోసం ఆశపడడం.. మంచి ఎమోషనల్‌ ఉన్న పాయింట్‌ ఇది. కామెడీ వేలో ఈ కథను చెప్పాలనుకోవడం మంచి ఆలోచననే. కానీ కామెడీ కోసం రాసుకున్న సీన్ల విషయంలోనే జాగ్రత్తపడాల్సింది. కథలో కామెడీ సన్నివేశాలను ఇరికించినట్లుగా అనిపిస్తుందే కానీ సిట్యువేషనల్‌కి తగ్గట్లుగా వచ్చినట్లు అనిపించదు.తండ్రి కొడుకులిద్దరు కలిసి ప్రేమ లేఖలు రాయడం.. ప్రేమించిన అమ్మాయి కోసం గోడలు దూకడం..‘ఖుషీ’ సీన్‌ రిపీట్‌.. ఇవన్నీ కొంతమందిని ఫుల్‌గా నవ్విస్తే..మరికొంతమందికి అతిగా అనిపిస్తాయి. ఫస్టాప్‌ వరకు కథ రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే ఓ ట్వీస్ట్‌ ఆకట్టుకుంటుంది కానీ..ఆ తర్వాత కథనం రొటీన్‌గా సాగుతంది. కామెడీతో కూడా అంతగా వర్కౌట్‌ కాలేదు. అనకాపల్లి ఎపిసోడ్‌ అతికించినట్లుగా ఉంటుంది. కథనం ఊహకందేలా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్లు కొంతవరకు ఆకట్టుకుంటాయి. సినిమా ముగింపు బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. తండ్రికొడుకులుగా రావు రమేశ్‌, సందీప్‌ కిషన్‌ తెరపై హుషారుగా కనిపించారు. ముఖ్యంగా లేటు వయసులో ప్రేమలో పడిన రమణ పాత్రలో రావు రమేశ్‌ ఇరగదీశాడు. యంగ్‌ లుక్‌లో కనిపించడమే కాదు..డ్యాన్స్‌, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఆయనతో వచ్చే ఒకటిరెండు కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. కృష్ణ పాత్రకి సందీప్‌ కిషన్‌ న్యాయం చేశాడు. ఆయన కామెడీ టైమింగ్‌ కూడా సినిమాకి ప్లస్‌ అయింది. రీతూ వర్మ, అన్షులకు బలమైన పాత్రలు లభించాయి. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతాయి.కానీ నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. పగతో రగిలిపోయే భార్గవ్‌ వర్మ పాత్రలో మురళీ శర్మ చక్కగా నటించాడు. హైపర్‌ ఆది కామెడీ జస్ట్‌ ఓకే. శ్రీనివాస్ రెడ్డి, ర‌ఘుబాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.లియోన్‌ జేమ్స్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నప్పటకీ అవి వచ్చే సందర్భమే సరిగా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. Rating : 2.75/5

Mukesh Ambani made a record of his own with india pak match make a profit in champions trophy 20258
భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. విజేతగా ముఖేష్‌ అంబానీ!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇటీవల భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటారు. దాంతోపాటు ఈ మ్యాచ్‌ ప్రారంభం కాకముందే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ రికార్డు సృష్టించారు. అదెలా అనుకుంటున్నారా.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియోహాట్‌స్టార్ భారత్-పాక్ మ్యాచ్‌ను ప్రసారం చేసే ప్రత్యేక హక్కులను కలిగి ఉంది. దాంతో కొన్ని గంటలపాటు సుమారు 12 కోట్ల మందికిపైగా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. కంపెనీకి ఇతర ప్రసార హక్కులు, యాడ్‌ రెవెన్యూ ద్వారా బారీగానే ఆదాయం సమకూరినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడంతోపాటు దీన్ని అందరూ వీక్షించేందుకు ప్రసార హక్కులు సాధించిన ముఖేశ్‌ అంబానీ కూడా విజేతగానే నిలిచినట్లు భావిస్తున్నారు.రిలయన్స్‌ ఇటీవలే అధికారికంగా హాట్‌స్టార్‌తో కలిసి జియోహాట్‌స్టార్‌ను ఆవిష్కరించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు కంపెనీలకు ఎంతో లాభదాయకమని రెండు సంస్థలు గతంలో తెలిపాయి. ఇటీవల జరిగిన ఒక్కమ్యాచ్‌లోనే భారీగా రెవెన్యూ సంపాదించినట్లు మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ రసవత్తరంగా ఉంటుందని ముందే గ్రహించిన కోట్లాదిమంది వ్యూయర్స్‌ జియోహాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించారు. ఇది ప్లాట్‌ఫామ్‌ వ్యూయర్‌షిప్‌ను పెంచడమే కాకుండా ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్లను, సంస్థ ఆదాయాన్ని కూడా పెంచింది. అంతేకాకుండా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని మరో ఛానెల్ స్పోర్ట్స్ 18 ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో ప్రసారం చేసే హక్కులను కలిగి ఉంది. దీంతో అంబానీ కంపెనీ ఆన్‌లైన్‌, టీవీ వ్యూయర్‌షిప్‌ రెండింటి నుంచి లాభపడింది.ఇటీవల భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటారు. 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో కోహ్లీ సెంచరీ (111 బంతుల్లో 100) చేశారు. మరో 7.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో భారత్‌ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం సెమీఫైనల్లో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే కాకుండా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వన్డేల్లో పాకిస్థాన్‌పై రికార్డు నెలకొల్పింది.ఇదీ చదవండి: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..! ధర ఎంతంటే..జియోహాట్‌స్టార్‌ ప్లాన్లు ఇలా..రూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్‌ల మాదిరిగా ఈ ఆఫర్‌లో వాయిస్ లేదా ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్‌స్టార్‌ను మొబైల్‌లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్‌ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్‌ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్‌సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్‌రూ.195 డేటా ప్లాన్‌తోపాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్‌ ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్‌. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనాలను ఈ ప్లాన్‌ అందిస్తుంది.

Congress MP Shashi Tharoor Interesting Comments Over future politics9
కాంగ్రెస్‌కు నా అవసరం లేదనుకుంటే.. శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీ: గత కొద్ది రోజులుగా తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ తీరు కాంగ్రెస్‌కు దూరమవుతున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీలో చేరుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మరోసారి శశిథరూర్‌ ప్రశంసించారు. అలాగే, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో సెల్ఫీ తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు కథనాలపై ఎంపీ శశిథరూర్‌ స్పందించారు.తాజాగా శశిథరూర్‌ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నన్ను వ్యతిరేకిస్తున్నారు. కానీ, నేను దేశం, కేరళ భవిష్యత్‌ కోసం మాట్లాడుతున్నాను. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నేను కాంగ్రెస్‌కు విధేయుడినే. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీలో పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకానీ, పార్టీ మారే ఆలోచన నాకు లేదు. ప్రజల సేవ పట్ల నిబద్ధతతో ఉన్నాను. నేను రాజకీయాల్లోకి రా ముందే ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా పనిచేశాను. అనంతరం.. సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ నన్ను కాంగ్రెస్‌లోకి రావాలని కోరిన తర్వాతే పార్టీలో చేరాను’ అని తెలిపారు.పార్టీకి నేను అవసరం అనుకుంటే నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతాను. పార్టీకి అవసరం లేదనుకుంటే నా ముందు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అంతేకానీ ఇతర పార్టీల్లో చేరడంపై నేను ఆలోచించడం లేదు. పుస్తకాలు.. ప్రసంగాలు.. సదస్సుల కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఆహ్వానాలు.. ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నేను ప్రజాస్వామ్యవాదిగా ఉంటాను. మతతత్వాన్ని వ్యతిరేకిస్తాను. అలాగే, సామాజిక న్యాయాన్ని నమ్ముతాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త అయిన శశిథరూర్‌.. పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై ప్రశంసలు కురిపించడం కాంగ్రెస్‌ నాయకత్వానికి రుచించలేదు. కేరళలోని పినరయి విజయన్‌ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, రెడ్‌ టేప్‌ కోత విధానాలను శశిథరూర్‌ ఇటీవల ప్రశంసించారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన, ట్రంప్‌తో భేటీ ఫలితాలను శశిథరూర్‌ కొనియాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

PM  Modi talks aboour obesity oil use check full deets  inside 10
ఓవర్‌ ఆయిల్‌ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?

ఇటీవల ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఊబకాయం (obesity)పై మన దేశ ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మాట్లాడుతూ 10 శాతం వంట నూనెల వాడకం తగ్గించాలన్నారు. దీంతో ఆయిల్‌ వాడకం వల్ల లాభనష్టాల మాట మళ్లీ చర్చకి వచ్చింది. మనం ఎలాంటి నూనెలు వాడితే మంచిది? ఏ వయసువాళ్లు ఎంత నూనె వాడాలి? మహిళలు, పురుషులు వారి ఆరోగ్య రీత్యా వాడే నూనెలలో తేడాలుండాలా.. ఈ అంశాల గురించిన వివరణ. ప్రపంచంలో 250 కోట్ల మంది అధికబరువుతో ఉన్నారని, ఆహారంలో నూనెల వాడకం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతోందని మోదీ డబ్ల్యూహెచ్‌ఓ డేటాని ఉటంకిస్తూ రోజువారి ఆహారంలో తక్కువ నూనె వాడకం ప్రాముఖ్యతను వివరించారు.కుటుంబ బాధ్యతవంటల్లో నూనెని తగ్గిస్తే ఊబకాయం నుంచి బయటపడొచ్చు. వంటల్లో నూనె తగ్గించడాన్ని కుటుంబం పట్ల బాధ్యతగా తీసుకోవాలి. ఎక్కువ నూనె వాడితే గుండె సమస్యలు, షుగర్, బీపి వంటివి వస్తాయి. అలాంటి వాటి నుంచి తప్పించుకునేందుకు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసి హెల్దీగా, ఫిట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చు. ప్రమాదకరమైనవివంట నూనెల్లో ఎక్కువగా ట్రాన్స్‌ ఫ్యాట్‌ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ట్రాన్స్‌ ఫ్యాట్‌ ఎక్కువగా ఉండే ఆహారం ఊబకాయానికి కారణమవుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. నూనెలోని కొవ్వు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌ స్థాయులను పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు, డయాబెటిస్‌ వంటి సమస్యలు వస్తాయి. అధిక రక్త΄ోటు ప్రమాదం పెరుగుతుంది. చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?తగ్గించాలంటే... పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేయాలి. ఊబకాయం గురించి అవగాహన కల్పించడానికి మోదీ పదిమంది సెలబ్రిటీలను నామినేట్‌ చేశారు. వారిలో జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా, నటులు ఆర్‌.మాధవన్, దినేష్‌ లాల్‌ యాదవ్‌ నిరాహువా, మోహన్‌ లాల్, స్పోర్ట్స్‌ షూటర్‌ మను భాకర్, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, గాయని శ్రేయా ఘోషల్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. అధికంగా తీసుకుంటే నష్టాలుగ్రాము నూనెలో 9 క్యాలరీలు ఉంటాయి. అధికంగా తీసుకుంటే శరీర బరువు పెరుగుతుంది. కొవ్వు అధికంగా కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు.ముఖ్యంగా ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉన్న నూనెలు హాని చేస్తాయి.అసమతుల్యమైన నూనెలు తీసుకుంటే బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ పెరిగి, గుడ్‌ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.అధిక నూనె వాడకం ఫ్యాటీ లివర్‌ సమస్యకు దారితీస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.ఏ నూనెలు వాడాలి? సమతుల కొవ్వులు ఉండే నూనెలను వాడాలి. ముఖ్యంగా ప్రాసెసింగ్‌ తక్కువగా చేసిన (కోల్డ్‌ ప్రెస్డ్‌) నూనెలు ఆరోగ్యానికి మంచివి.సురక్షితమైన, ఆరోగ్యకరమైనవి: సన్‌ఫ్లవర్, వేరుశనగ, ఒమేగా, మొక్కజొన్న నూనె, ఆలివ్‌ ఆయిల్, అవిసె నూనె, కోల్డ్‌ ఫ్రెస్డ్‌ ఆయిల్‌లలో ప్రాసెసింగ్‌ తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువ. చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్‌ టిప్స్‌తక్కువగా వాడవలసినవి: పామ్‌ ఆయిల్‌ (Palm oil) ) – అధికంగా ప్రాసెస్‌ అవుతుంది.వనస్పతి – ట్రాన్స్‌ ఫాట్స్‌ ఎక్కువ స్నాక్స్‌ తయారీలో ఒకసారి ఉపయోగించినవి, తిరిగి వాడుతుంటారు. వీటి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. సరైన పరిమితిలో తగిన రకాల నూనెలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలే చేస్తుంది.నూనెలు మంచి క్యాలరీ సోర్స్‌గా పనిచేస్తాయి. వీటిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్‌) ఉంటాయి.ఒమేగా–3, ఒమేగా–6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.కొన్ని నూనెలలో విటమిన్‌–ఇ, కె, శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం, కేశాల ఆరోగ్యానికి మంచిది.కొవ్వులు శరీరంలోని వివిధ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైనవి.ఎవరు ఎంత ఆయిల్‌ పిల్లలు (6–19 ఏళ్లు) రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్‌) ఆడ–మగ ఇద్దరికీ. ముఖ్యంగా కొబ్బరి, ఆలివ్‌ ఆయిల్, కనోలా, నెయ్యి వంటి ఆరోగ్యకరమైన నూనెలు వాడాలి. 20 – 59 ఏళ్ల వరకు : రోజుకు 5 – 6 టీస్పూన్లు (25–30ఎం.ఎల్‌) ఆడ–మగ ఇద్దరికీ. ఆలివ్, కనోలా, అవకాడో, వేరుశనగ, సన్‌ఫ్లవర్, రిఫైన్డ్‌ వెజిటబుల్‌ ఆయిల్స్‌. కొబ్బరినూనె, అవిసె నూనె రోజుకు60 ఏళ్ల.. అంతకు మించి...రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్‌.) ఆడ–మగ ఇద్దరికీ. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆలివ్, అవిసె, కనోలా నూనెలను వాడాలి. గర్భవతులు మాత్రం రోజూ 6–7 టీ స్పూన్ల ఆరోగ్యకరమైన నూనె వాడాలి. వాటిలో ఆలివ్, అవకాడో, ఫ్లాక్స్‌ సీడ్‌ ఆయిల్స్‌ (ఒమెగా 3 ఉన్న నూనెలు) వాడాలి. -డా. జానకి, పోషకాహార నిపుణులు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధిఆయిల్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
#GETOUT: తమిళనాట పొలిటికల్‌ హీట్‌.. విజయ్‌, పీకే ప్లానేంటి?

చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

title
మే 2 నుంచి కేదార్‌నాథ్‌ దర్శనం.. శివరాత్రి వేళ ప్రకటన

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో కొలువైన కేదారనాథుడు శివరాత్రి పర్వదినాన భక్తులపై

title
ఆప్‌ సర్‌ప్రైజ్‌.. ఎంపీగా కేజ్రీవాల్?

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సైల

title
కుంభమేళా నుంచి వస్తుండగా కారు ప్రమాదం.. ఎంపీకి తీవ్ర గాయాలు

లతేహార్: ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా మొదలైన మహాకుంభమేళా న

title
Mahashivratri: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు(బుధవారం) మహాశివరాత్రి సంబరాలు మిన్నంటుతున్నాయి.

International View all
title
ఒక్క ర​‍క్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన

ఎన్నాళ్లు బతుకుతాం? ఎపుడు చచ్చిపోతాం?  ఎలాంటి జబ్బులొస్తాయి?

title
పౌరసత్వంపై ట్రంప్‌ సంచలన ప్రకటన.. వారందరికీ ‘గోల్డ్‌కార్డు’ వీసా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నార

title
USA: ఎలాన్‌ మస్క్‌కు బిగ్‌ షాక్‌..

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది

title
పుతిన్‌కు అండగా ట్రంప్‌ సంచలన నిర్ణయం.. భారత్‌ వైఖరి ఇదే..

ఐక్యరాజ్యసమితి: బైడెన్‌ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం గత మూడ

title
దక్షిణ కొరియాలో కూలిన ఎలివేటెడ్‌ హైవే

సియోల్‌: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ సమీపంలో నిర్మాణంలో ఉన

NRI View all
title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

title
డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

title
Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!

వలసదారుల విషయంలో  డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆ

title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ (Donald Trump) తన  మద్దతు ద

Advertisement
Advertisement